Tripura Government hikes 5 percent DA for Employees: ఎట్టకేలకు ప్రభుత్వ ఉద్యోగుల నిరీక్షణ ముగిసింది. డీఏ (డియర్నెస్ అలవెన్స్) పెంపునకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. త్రిపురలోని బీజేపీ ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 5 శాతం డీఏను పెంచనుంది. త్రిపుర రాష్ట్ర ముఖ్యమంత్రి మాణిక్ సాహా డియర్నెస్ అలవెన్స్‌ను 5 శాతం పెంచుతున్నట్లు ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతీ ఏటా రెండుసార్లు డీఏ (డియర్నెస్ అలవెన్స్) పెంపు ఉంటుందన్న విషయం తెలిసిందే.
డియర్నెస్ అలవెన్స్‌ను 5 శాతం పెంచేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి మాణిక్ సాహా ఆమోదం తెలిపారు. ఈ పెరిగిన డియర్నెస్ అలవెన్స్ జూలై 1 2022 నుంచి అమల్లోకి వస్తుంది. ఈ విషయాన్ని రాష్ట్ర మంత్రి సుశాంత చౌదరి తెలిపారు. వచ్చే ఏడాది మార్చిలోగా త్రిపురలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఉద్యోగులను ఆదుకునేందుకు త్రిపుర రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. కరువు భత్యాన్ని 5 శాతం పెంచేందుకు మంత్రివర్గం తాజాగా ఆమోదం తెలిపింది. ఈ నిర్ణయంతో రాష్ట్ర ఖజానాపై రూ.523.80 కోట్ల భారం పడనుంది.
త్రిపుర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల 1,04,683 మంది ఉద్యోగులు.. 80,855 మంది పెన్షనర్లు ప్రయోజనం పొందనున్నారు. మొత్తంగా 1,88,494 మంది లబ్ధి పొందనున్నారు. అంతకుముందు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కూడా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల డీఏను 31 శాతం నుంచి 34 శాతానికి పెంచారు. దాంతో 7.5 లక్షల మంది ఉద్యోగులకు ప్రయోజనం కలుగుతుంది. అదే విధంగా మధ్యప్రదేశ్ రాష్ట్ర ఖజానాపై రూ. 625 కోట్ల అదనపు భారం పడనుంది. మోదీ ప్రభుత్వం కూడా త్వరలో డీఏపై ఓ నిర్ణయం తీసుకోనుంది.
Also Read: ఫ్లిప్‌కార్ట్‌లో బంపర్ ఆఫర్.. రూ. 749కే రియల్మీ 9i 5G స్మార్ట్‌ఫోన్!
Also Read: భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌లో గెలుపు ఎవరిది.. ఎవరూ ఊహించని సమాధానం ఇచ్చిన అఫ్రిది!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook