Asia Cup 2022: ఆసియా కప్‌లో దాయాది దేశాల సమరం జరగనుంది. దుబాయ్ వేదికగా సాయంత్రం 7 గంటలకు పాకిస్థాన్‌ను టీమిండియా ఢీకొట్టనుంది. హైఓల్టేజ్ మ్యాచ్ కోసం ఇరుదేశాల అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఐసీసీ టోర్నీల్లో దాయాదుల సమరం నువ్వానేనా అన్నట్లు ఉండనుంది. ఇరు జట్లు బలాబలాల పరంగా స్ట్రాంగ్‌గా ఉన్నాయి. ఈఏడాది ఆసియా కప్ టీ20 ఫార్మాట్‌లో జరుగుతోంది. దీంతో ఈటోర్నీ ఉత్కంఠగా సాగనుంది
ఈనేపథ్యంలో టీమిండియా ప్లేయింగ్ ఎలవన్‌ను భారత సీనియర్ ఆటగాడు ఛతేశ్వర్ పుజారా ప్రకటించాడు. అతడి జట్టులో ఓపెనర్లుగా కెప్టెన్ రోహిత్ శర్మ, వైస్ కెప్టెన్ కేఎల్ రాహుల్ ఉన్నారు. మూడు, నాలుగు స్థానాల్లో వరుసగా స్టార్ ప్లేయర్లు విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్‌ను ఎంచుకున్నాడు. మిడిల్ ఆర్డర్‌లో ఐదో స్థానంలో వికెట్ కీపర్ రిషబ్ పంత్‌ను ఎంపిక చేశాడు. ఆల్‌రౌండర్ల కోటాలో హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజాకు చోటు కల్పించాడు పుజారా.
పేస్ విభాగంలో భువనేశ్వర్ కుమార్, అవేష్ ఖాన్, అర్ష్‌దీప్ సింగ్‌కు చోటు దక్కింది. తన ప్రకటించిన జట్టులో స్పెషలిస్ట్ స్పిన్నర్‌గా యజువేంద్ర చహల్‌కు ఎంపిక చేశాడు. ఐతే ఈఏడాది ఐపీఎల్ విశేషంగా రాణించిన వెటరన్ ప్లేయర్ దినేష్ కార్తీక్ పుజారా చోటు కల్పించలేదు. మరో సీనియర్ ఆటగాడు రవిచంద్ర అశ్విన్‌ను జట్టులోకి తీసుకోలేదు. మొత్తంగా భారత సీనియర్ ఆటగాడు ఛతేశ్వర్ పుజారా జట్టు అద్భుతంగా ఉందని క్రికెట్ పండితులు విశ్లేషిస్తున్నారు.
పుజారా ప్రకటించిన భారత జట్టు ఇదే..
రోహిత్ శర్మ(కెప్టెన్), కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్(వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, భువనేశ్వర్ కుమార్, అవేష్ ఖాన్, అర్ష్‌దీప్ సింగ్, చాహల్..
Also read:Liger 3 Days Collections: తెలుగు రాష్ట్రాల్లో దారుణంగా వసూళ్లు.. హిందీలో రౌడీ జోరు!
Also read:Viral Video: ఆండ్రీ రసెల్ అరుదైన ఫీట్..ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు బాదిన ఆల్‌రౌండర్..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి