CM Jagan: ఆ చిన్నారి చాలా హుషారు. చదువులో షార్ప్. మాట తీరుతో అందరిని ఇట్టే కట్టేపడేస్తుంది. గ్రామంలో అందరితో కలిసిపోయే ఆ చిన్నారి.. ఇటీవలే ఏపీ సీఎం జగన్ ను కలిసింది. ఆ చిన్నారి ముఖ్యమంత్రితో ఎంతో ముద్దుముద్దుగా మాట్లాడింది. అయితే ఇంతలోనే విధి వక్రీకరించింది. ఆ చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. సీఎం జగన్ తో ముద్దుగా మాట్లాడిన చిన్నారి.. కొన్ని రోజులకే విగత జీవిగా మారడంతో గ్రామంలో తీవ్ర విషాదం అలుముకుంది. పశ్చిమ గోదావరి జిల్లా ఏజెన్సీలో జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది
అల్లూరి సీతారామరాజు మన్యం జిల్లా చింతూరు మండలం కుయిగూరు గ్రామంలో ఈ ఘటన జరిగింది. గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ ఏసుబాబు కూతురు సంధ్య. చింతూరులో ఐదో తరగతి చదువుతోంది. ఇటీవలే సంధ్య తండ్రి ఏసుబాబుకు తీవ్ర జర్వం వచ్చింది. భద్రాచలంలోని ఓ ఆస్పత్రిలో చికిత్స తీసుకున్నాడు. తండ్రితో పాటు సంధ్య కూడా హాస్పిటల్ లోనే ఉంది. ఏసుబాబుకు నయమయ్యాక ఇంటికి వెళ్లారు. కొన్నిరోజులకే సంధ్యకు జ్వరం వచ్చింది. భద్రాచలం హాస్పిటల్ లో చూపించగా సాధారణ ఫీవరేనని డాక్టర్ చెప్పారు. ఇంటికి వచ్చాక సంధ్య పరిస్థితి మరింత క్షీణించింది. ఫీవర్ ఎక్కువగా రావడంతో చింతూరు ఆస్పత్రికి తీసుకెళ్లారు. బ్లడ్ టెస్ట్ చేయగా డెంగీగా తేలింది. దీంతో మెరుగైన వైద్యం కోసం భద్రాచలంలోని ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతున్న బాలిక ప్రాణాలు కోల్పోయింది.
జులైలో వచ్చిన గోదావరి వరదకి ముంపు గ్రామాలు జలమలమయ్యాయి. కొన్ని గ్రామాలు వారాల పాటు నీటిలోనే ఉన్నాయి. వరద బాధితులను పరామర్శించేందుకు జులై 27న చింతూరు మండలం కుయిగూరు వెళ్లారు సీఎం జగన్. సంధ్య తండ్రి మాజీ సర్పంచ్ కావడంతో సీఎం పర్యటనలో ఆయన కీలకంగా వ్యవహరించారు. సంధ్య కూడా జగన్ దగ్గరకు వెళ్లింది. ఈ సందర్భంగా సంధ్యను దగ్గరకు తీసుకుని కాసేపు మాట్లాడారు సీఎం జగన్. ఎలాంటి భయం లేకుండా ముఖ్యమంత్రితో ముద్దుముద్దుగా మాట్లాడింది సంధ్య. అంతటి చురుకైన సంధ్య డెంగ్యూ భారీన పడి ప్రాణాలు కోల్పోవడం స్థానికంగా తీవ్ర విషాదం నింపింది. సంధ్య చనిపోవడంతో.. సీఎం జగన్ పర్యటన సన్నివేశాలను గుర్తు చేసుకుంటూ కన్నీళ్లపర్యంతమయ్యారు ఆమె తల్లిదండ్రులు, బంధువులు. గోదావరి వరదల తర్వాత గ్రామాల్లో విష జ్వరాలు విజృంభిస్తున్నాయని వందలాది మంది మంచాన పడ్డారని చెబుతున్నారు.
Read also: Kcr New Scheme: ఓట్లే లక్ష్యంగా కేసీఆర్ కొత్త స్కీం.. దసరా నుంచి అమలు! గులాబీ పండగేనా..
Read also: Pawan Kalyan: జల్సా షోలో పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ రచ్చ.. పోలీసుల ఎంట్రీతో ఉద్రిక్తత
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook