Madhya Pradesh woman fights leopard for 25 minutes to save 15 months old son: ఈ సృష్టిలో 'తల్లి ప్రేమ'ను మించింది మరొకటి ఉండదు. బిడ్డను ఈ నేల మీదకు తీసుకురావడానికి పురిటి నొప్పులను కూడా ఎంతో ప్రేమగా భరిస్తుంది. బిడ్డ ఆలనా, పాలనా దగ్గరుండి చూసుకుంటుంది. తను ఆకలితో ఉన్నా.. పిల్లలకు పెట్టి కానీ అమ్మ ముద్ద ముట్టదు. బిడ్డకు ఓ చిన్న దెబ్బ తగితే.. విలవిలలాడిపోతుంది. అదే తన బిడ్డ ఆపదలో ఉందంటే ఆ తల్లి ఊరుకుంటుందా?.. ప్రాణాలను సైతం లెక్కచేయదు. ఎదురుగా చిరుతపులి ఉన్నా.. బిడ్డ ప్రాణాల కోసం అస్సలు భయపడదు. తాజాగా ఇలాంటి ఘటనే మధ్యప్రదేశ్‌లో చోటుచేసుకుంది.
వివరాల ప్రకారం.. మధ్యప్రదేశ్ రాష్ట్రం ఉమారియా జిల్లాలోని బాంధవ్‌ఘర్ టైగర్ రిజర్వ్ ఏరియా ఉంది. టైగర్ రిజర్వ్‌లోని మాలా బీట్ పరిధిలోకి వచ్చే రోహనియా గ్రామంలో అర్చన చౌధరి కుటుంబం నివసిస్తుంది. 25 ఏళ్ల అర్చనకు 15 నెలల కుమారుడు రవిరాజ్ ఉన్నాడు. ఆదివారం (సెప్టెంబర్ 4) అర్చన తన కుమారుడిని తీసుకుని పొలానికి వెళ్లింది. పొదల్లో ఉన్న చిరుతపులి ఒక్కసారిగా చిన్నారిపై దూకి దాడి చేసింది. చిన్నారిని నోట్లో కరచుకుని వెళ్లబోయింది. ఇది గమనించిన తల్లి పెద్దగా కేకలు వేసింది.
చిన్నారిపై దాడి చేస్తున్న చిరుతపులితో అర్చన చౌధరి భీకరంగా పోరాడింది. అర్చన తన ఒట్టి చేతులతోనే పులితో ఫైట్ చేసింది. అదే సమయంలో సహాయం కోసం గట్టిగా అరిచింది. పులి శిశువును లాక్కోవడానికి ప్రయత్నించగా.. ఎదురుదాడి చేసింది. పులి, శిశువు మధ్యలో నిలబడి 25 నిమిషాల పాటు జీవన్మరణ పోరాటం కొనసాగింది. తలపై, ఊపిరితిత్తులపై బలమైన గాయాలు అయినా.. అర్చన వెనకడుగు వేయలేదు. కుమారుడిని కాపాడేందుకు పులితో పోరాటం చేసింది. ఇంతలో గ్రామస్థులు రావడంతో చిరుతపులి అడవిలోకి పారిపోయింది.
గాయాల పాలైన అర్చన, ఆమె కుమారుడిని మాన్‌పూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లి ప్రథమ చికిత్స అందించారు. ఆపై మెరుగైన చికిత్స కోసం 30 కిలోమీటర్ల దూరంలోని ఉమరియా జిల్లా ఆస్పత్రికి తరలించారు. అర్చన తల, ఊపిరితిత్తులలో పులి గోర్లు గుచ్చుకున్నాయని వైద్యులు తెలిపారు. రెండు రోజులు ఐసీయూలో ఉన్న అర్చన పరిస్థితి ప్రస్తుతం బాగానే ఉందని ఆమె భర్త భర్త భోళా ప్రసాద్ మీడియాకు తెలిపారు. అర్చన పొత్తికడుపు, వీపు, చేతులకు గాయాలయ్యాయని చెప్పారు. కుమారుడు బాగున్నాడని చెప్పాడు. ఉమారియా కలెక్టర్ సంజీవ్ శ్రీవాస్తవ ఆసుపత్రిలో ఉన్న అర్చన మరియు ఆమె కుమారుడిని కలిసి పరామర్శించారు.
Also Read: Rahul Gandhi: రూ.3 లక్షల వరకు రైతు రుణమాఫీ.. రూ.500లకే ఎల్పీజీ సిలిండర్!
Also Read: iBOMMA Close: సినీ ప్రియులకు బిగ్ షాక్.. ఆ రోజు నుంచి శాశ్వతంగా ఐబొమ్మ సేవలు బంద్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook