Tirumala Temple: తిరుమల శ్రీవారి భక్తులకు ముఖ్య సూచన చేసింది తిరుమల తిరుపతి దేవ స్థానం పాలకమండలి. అక్టోబర్, నవంబర్ నెలలో రెండు రోజుల పాటు శ్రీవారి ఆలయాన్ని మూసివేయనున్నట్లు తెలిపింది. తిరుమల రావడానికి ఏర్పాట్లు చేసుకుంటు్నన భక్తులకు అందుకు అనుగుణంగా మార్పులు చేసుకోవాలని సూచించింది. అక్టోబర్ 25న సూర్యగ్రహణం ఏర్పడనుంది. అలాగే నవంబర్ 8న చంద్ర గ్రహణం. దీంతో ఆ రెండు రోజులు 12 గంటల పాటు శ్రీవారి ఆలయ తలుపులు మూసివేస్తారు. బ్రేక్ దర్శనం, శ్రీవాణి, రూ.300/- ప్రత్యేక ప్రవేశ దర్శనం, ఇతర ఆర్జిత సేవలను టిటిడి రద్దు చేసింది. ఆ రెండు రోజుల్లో కేవలం సర్వదర్శనం భక్తులను మాత్రమే అనుమతిస్తారు.
టీటీడీ వెల్లడించిన వివరాల ప్రకారం అక్టోబరు 25న మంగళవారం సాయంత్రం 5.11 గంటల నుండి 6.27 గంటల వరకు సూర్యగ్రహణం ఉంటుంది. దీంతో ఆ రోజు ఉదయం 8.11 నుండి రాత్రి 7.30 గంటలకు శ్రీవారి ఆలయ తలుపులు మూసి వేస్తారు. బ్రేక్ దర్శనం, శ్రీవాణి, ప్రత్యేక ప్రవేశ దర్శనం, వృద్ధులు, వికలాంగులు, చంటిపిల్లల తల్లిదండ్రులు, రక్షణ సిబ్బంది, ఎన్ఆర్ఐల దర్శనంతోపాటు కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార వంటి ఆర్జిత సేవలను టిటిడి రద్దు చేసింది. సర్వదర్శనం భక్తులను మాత్రమే అనుమతిస్తారు.
నవంబరు 8న మంగళవారం మధ్యాహ్నం 2.39 గంటల నుండి సాయంత్రం 6.27 గంటల వరకు చంద్రగ్రహణం ఏర్పడుతుంది. ఆ రోజు ఉదయం 8.40 నుండి రాత్రి 7.20 గంటలకు శ్రీవారి ఆలయ తలుపులు మూసి ఉంచుతారు. నవంబరు 8న కూడా కేవలం సర్వదర్శనం భక్తులకు మాత్రమే శ్రీవారి దర్శనభాగ్యం ఉంటుంది. భక్తులు ఈ విషయాన్ని గమనించి టిటిడికి సహకరించాలని కోరింది.
Read also: Rohit Sharma: సోషల్ మీడియా మరీ చెత్తగా తయారైంది.. ట్రోలింగ్‌పై రోహిత్ శర్మ ఫైర్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook
Tirumala Temple:తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. ఆ రెండు రోజులు ఆలయం మూసివేత
అక్టోబరు 25న సూర్యగ్రహణం
నవంబరు 8న చంద్రగ్రహణం
ఆ రెండు రోజులు 12 గంటలు శ్రీవారి ఆలయం క్లోజ్