Whatsapp Tracking: వాట్సప్ ట్రాక్ అంటే ఏమిటి, మీ నెంబర్ ట్రాక్ అయిందో లేదో ఎలా తెలుసుకోవడం

Whatsapp Tracking: ప్రముఖ సోషల్ మీడియా మెస్సేజింగ్ యాప్ వాట్సప్‌ను ట్రాక్ చేసే కేసులు పెరుగుతున్నాయి. అసలు వాట్సప్ ట్రాకింగ్ అంటే ఏంటి, మీ వాట్సప్‌‌ను ఎవరైనా ట్రాక్ చేస్తుంటే ఎలా తెలుసుకోవచ్చనేది పరిశీలిద్దాం..

Written by - Md. Abdul Rehaman | Last Updated : Sep 11, 2022, 11:21 PM IST
Whatsapp Tracking: వాట్సప్ ట్రాక్ అంటే ఏమిటి, మీ నెంబర్ ట్రాక్ అయిందో లేదో ఎలా తెలుసుకోవడం

Whatsapp Tracking: ప్రముఖ సోషల్ మీడియా మెస్సేజింగ్ యాప్ వాట్సప్‌ను ట్రాక్ చేసే కేసులు పెరుగుతున్నాయి. అసలు వాట్సప్ ట్రాకింగ్ అంటే ఏంటి, మీ వాట్సప్‌‌ను ఎవరైనా ట్రాక్ చేస్తుంటే ఎలా తెలుసుకోవచ్చనేది పరిశీలిద్దాం..

ప్రముఖ ఇన్‌స్టంట్ చాటింగ్ యాప్ వాట్సప్ ప్రపంచవ్యాప్తంగా విశేష ఆదరణ పొందిన సోషల్ మీడియా వేదిక. దాదాపు 4 వందల బిలియన్ల యూజర్లున్నారు. వ్యక్తిగతంగా, గ్రూప్ పరంగా ప్రయోజనం కల్గించే అద్భుతమైన వేదిక ఇది. ఎప్పటికప్పుడు యూజర్లను ఆకర్షించేందుకు వాట్సప్ సరికొత్త ఫీచర్లను ప్రవేశపెడుతూనే ఉంది. అయితే వాట్సప్ ఆదరణ పెరిగే కొద్దీ హ్యాకింగ్ సమస్యలు వెంటాడుతున్నాయి.

వాట్సప్ ట్రాకింగ్ కేసులు ఇటీవలి కాలంలో పెద్దఎత్తున జరుగుతున్నాయి. వాట్సప్ యూజర్లలో ఈ విషయమై ఆందోళన పెరుగుతోంది. వ్యక్తిగత చాటింగ్ కోసం వాట్సప్ బహుళ ప్రాచుర్యం పొందిన యాప్ కావడంతో యూజర్లకు ట్రాకింగ్ సమస్య ఆందోళన కల్గిస్తోంది. ఎవరైనా సరే ఇట్టే మీ వాట్సప్ నెంబర్ ట్రాక్ చేయగలుగుతున్నారు. 

ట్రాకింగ్ చేయడమే కాకుండా..వాట్సప్ వెబ్ లేదా మల్టీ డివైస్ సపోర్ట్ ఫెసిలిటీ ద్వారా ఎవరైనా సరే మీ మెస్సేజ్ యాక్సెస్ చేయగలుగుతున్నారు. ఒకటి కంటే ఎక్కువ డివైస్‌లలో వాట్సప్ వినియోగించుకునేందుకు వాట్సప్ అనుమతిస్తుంటుంది. దాంతోపాటు ప్రైమరీ డివైస్‌లో ఇంటర్నెట్ కనెక్షన్ ఉండాల్సిన అవసరం లేదు. అయితే మీ వాట్సప్ నెంబర్ ట్రాక్ అయిందో లేదో తెలుసుకునే మార్గాలు కొన్ని మీ కోసం..

1. ముందుగా వాట్సప్ ఎక్కౌంట్ ఓపెన్ చేయండి.
2. పైన ఉండే మూడు డాట్స్‌పై క్లిక్ చేయాలి.
3. లింక్డ్ డివైస్ ఎక్కౌంట్‌పై క్లిక్ చేయాలి.
4. ఆప్షన్ క్లిక్ చేసిన తరువాత మీ ఎక్కౌంట్ ఎక్కడెక్కడ ఓపెన్ చేసుందో కన్పిస్తుంది. 
5. ఇప్పుడు అక్కడి నుంచి అందర్నీ లాగౌట్ చేసేయవచ్చు.

Also read: TATA EV Cars: టాటా నుంచి చీపెస్ట్ ఈవీ కారు వచ్చేస్తోంది.. అన్నింటి కన్నా ఇదే చీప్..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News