Soundarya Rajinikanth Baby Boy: మరోసారి తాతైన రజనీకాంత్.. మళ్లీ మనవడే!

Rajinikanth daughter Soundarya Rajinikanth Gave Birth to Baby Boy: రజనీకాంత్ మరోసారి తాత అయ్యారు. చిన్న కుమార్తె సౌందర్య రజినీకాంత్ ఆదివారం నాడు ఒక పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చారు.

Written by - Chaganti Bhargav | Last Updated : Sep 12, 2022, 09:40 AM IST
Soundarya Rajinikanth Baby Boy: మరోసారి తాతైన రజనీకాంత్.. మళ్లీ మనవడే!

Rajinikanth daughter Soundarya Rajinikanth Gave Birth to Baby Boy: సూపర్ స్టార్ రజినీకాంత్ మరోసారి తాత అయ్యారు. ఆయన చిన్న కుమార్తె సౌందర్య రజినీకాంత్ ఆదివారం నాడు ఒక పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చారు. ఈ విషయాన్ని స్వయంగా సౌందర్య రజినీకాంత్ తన సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. తల్లిదండ్రుల ఆశీర్వాదం, దేవుడు దయతో వేద్(కుమారుడు) చిన్న తమ్ముడికి నేను విషాగన్,  వేద్ కలిసి స్వాగతం పలకడం ఆనందంగా ఉందంటూ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టారు.

 అలాగే తన ప్రసవాన్ని చేయించిన వైద్య బృందానికి కూడా కృతజ్ఞతలు తెలిపారు. ఆదివారం పుట్టిన ఆ బుడతడికి అప్పుడే వీర్ రజినీకాంత్ అనే పేరు కూడా పెట్టేశారు. రజినీకాంత్ చిన్న కుమార్తె అయిన సౌందర్య అశ్వినీ రామ్ కుమార్ అనే ఒక వ్యాపారవేత్తను 2010లో వివాహం చేసుకుంది. అయితే వీరిద్దరికీ వేద్ కృష్ణ అనే ఒక కుమారుడు జన్మించాడు. అయితే ఏడేళ్ల కాపురం తర్వాత వివాదాలు రావడంతో వీరిద్దరు వివాహ బంధానికి స్వస్తి పలికారు 2019లో ఆమె విశాగన్  వనంగమూడి అనే మరో వ్యాపారవేత్తను రెండో వివాహం చేసుకున్నారు.

ఆయనకు కూడా ఇది రెండో వివాహమే. అలా వివాహం చేసుకున్న మూడేళ్ల తర్వాత వీరిద్దరూ తమ చిన్నారికి స్వాగతం పలికారు. ఇక రజనీకాంత్ కుమార్తె అయిన సౌందర్య రజినీకాంత్ దర్శకురాలిగా నిలదొక్కుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఆమె ముందుగా గ్రాఫిక్ డిజైనర్ గా పనిచేసేవారు. రజినీకాంత్ హీరోగా నటించిన పడయప్ప., బాబా, చంద్రముఖి, శివకాశి, మజా, పందెంకోడి వంటి అనేక సినిమాలకు ఆమె గ్రాఫిక్ డిజైనర్ గా పనిచేశారు. అంతేగాక కథానాయకుడు అనే సినిమాలో ఒక చిన్న అతిథి పాత్రలో కూడా ఆమె కనిపించారు.

ఇక రజినీకాంత్ హీరోగా యానిమేషన్ మూవీ రూపొందించిన ఆమె వచ్చాడు దానికి కొచ్చాయడన్ పేరుతో దానికి దర్శకత్వం కూడా వహించారు. అయితే ఆ సినిమా అనూహ్యంగా డిజాస్టర్ అందుకుంది. అలాగే తన మాజీ బావ ధనుష్ హీరోగా విఐపి2 అనే సినిమాకి కూడా దర్శకత్వం వహించింది. అయితే ఆ సినిమా కూడా అనుకున్న మేర అంచనాలను అందుకోలేకపోయింది. దర్శకురాలిగా అనేక విఫల ప్రయత్నాలు చేసింది కానీ ఒక్క హిట్ కూడా అందుకోలేకపోయింది. మొత్తానికి ఆమె తన జీవితంలో రెండో కుమారుడికి జన్మనివ్వడంతో రజినీకాంత్ కుటుంబమంతా ఇప్పుడు ఆనందంలో మునిగి పోయింది.

Also Read: Ram Gopal Varma comments: రేపు మీకు ఈ దుస్థితి తప్పదు..మన మీద మనమే ఉమ్మేసుకున్నట్టే.. టాలీవుడ్ హీరోలపై వర్మ సంచలనం!

Also Read: SIIMA 2022 Telugu Winners List: గత్తర లేపిన పుష్ప.. తగ్గేదేలే అంటూ అవార్డుల వేట!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News