Insulin Plant For Diabetes: మధుమేహం వ్యాధిగ్రస్తులు వారు తీసుకునే ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. అంతేకాకుండా కేవలం శరీరానికి అవసరమున్న పోషకాలు గల ఆహారాలను తీసుకోవాలని నిపుణులు తెలుపుతున్నారు. అయితే మధుమేహంతో బాధపడుతున్నవారి శరీరంలో చక్కెర పరిమాణాలు పెరిగితే.. తీవ్ర గుండె పోటు సమస్యలు కూడా వచ్చే అవకాశాలు కాబట్టి వీరు తప్పకుండా పలు రకాల నియమాలు కూడా పాటించాల్సి ఉంటుంది. ఈ వ్యాధితో బాధపడుతున్నవారిలో తరచుగా ఇన్సులిన్ లోపం ఏర్పడుతుంది. దీని కారణంగా తీవ్ర అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలున్నాయి. అయితే ఈ మధుమేహానికి చెక్ పెట్టేందుకు పలు రకాల ఔషధ మూలికలను తీసుకోవాల్సి ఉంటుంది. ఆ మూలికలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
'ఇన్సులిన్ ప్లాంట్' ప్రత్యేక:
మధుమేహం వ్యాధితో బాధపడుతున్న వారికి 'ఇన్సులిన్ ప్లాంట్' దివౌషధంగా పని చేస్తుంది. దీని శాస్త్రీయ నామం 'చమేకోస్టస్ కస్పిడాటస్' గా పిలుస్తారు. దీని ఆకులను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల శరీరంలో ఇన్సులిన్ స్థాయిలపై ప్రభావవంతంగా పని చేస్తాయి.
ఇనులిన్ మొక్క ప్రయోజనాలు:
>>ఇన్సులిన్ ప్లాంట్‌లో ఆస్కార్బిక్ యాసిడ్, ఐరన్, బీటా కెరోటిన్, కొరోసోలిక్ యాసిడ్ ఫ్లేవనాయిడ్స్, టెర్పెనాయిడ్స్, ప్రొటీన్లు, యాంటీ ఆక్సిడెంట్లు అధిక పరిమాణంలో ఉంటాయి. ఇవి శరీరానికి చాలా రకాల ఉపయోగపడుతుంది.
>>జలుబు, దగ్గు, ఊపిరితిత్తుల వ్యాధులు, ఉబ్బసం, ఇన్‌ఫెక్షన్ల నుంచి ఉపశమనం కలిగించేందుకు ఇన్సులిన్ ప్లాంట్ ప్రయోజనకరంగా పని చేస్తుంది. కాబట్టి మధుమేహంలో బాధపడుతున్నవారు తప్పకుండా ఈ మొక్క ఆకులను నమిలి తినాలి. ఇలా క్రమం తప్పకుండా చేస్తే శరీరంలో ఇన్సులిన్ స్థాయిలు పెరుగుతాయి.
>> తీవ్ర మధుమేహంతో బాధపడుతున్న వారు ఇన్సులిన్ మొక్క ఆకులను ప్రతి రోజూ సుమారు ఒక నెల పాటు నమిలి తింటే రక్తంలోని చక్కెర పరిమాణాలను తగ్గిస్తుంది. అంతేకాకుండా వీటిని ఎండబెట్టి పొడిలా తీసుకుంటే రెట్టిపు ప్రయోజనాలు పొందుతారని నిపుణులు తెలుపుతున్నారు.
(NOTE: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు, దయచేసి వైద్య సలహా తీసుకోండి. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)
Also Read: Telugu Movies this Week: ఈ వారం థియేటర్లో, ఓటీటీలో రిలీజ్ అవుతున్న సినిమాలివే!
Also Read: Amala Paul on Tollywood: టాలీవుడ్ పై షాకింగ్ కామెంట్స్.. నెపోటిజం, రొట్ట సినిమాలు అంటూ
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి