IND vs AUS: నాగ్‌పూర్ టీ20 మ్యాచ్‌లో టీమిండియా ఘన విజయం సాధించింది. వర్షం కారణంగా ఈమ్యాచ్‌ను 8 ఓవర్లకు కుదించారు. మొదటి బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా మొదట్లో తడబడింది. వరుసగా వికెట్లు కోల్పోయి నష్టాల్లో పడింది. ఈసమయంలో క్రీజులోకి వచ్చి వేడ్ సంచలన ఇన్నింగ్స్ ఆడాడు. దీంతో నిర్ణీత ఓవర్లలో ఆ జట్టు 90 పరుగులు చేసింది. లక్ష్య చేధనకు దిగిన టీమిండియా మరో నాలుగు బంతులు మిగిలి ఉండగానే టార్గెట్‌ను చేధించింది.
రోహిత్ శర్మ కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. మొదట్లో వరుసగా వికెట్లు పడినా...హిట్‌మ్యాన్ మాత్రం ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. ఎడపెడ ఫోర్లు, సిక్సర్లు బాదాడు. చివరి ఓవర్‌లో 9 పరుగులు కావాల్సి సమయంలో దినేష్ కార్తీక్ రఫ్ఫాడించాడు. సిక్సర్, ఫోర్‌తో రెండు బంతుల్లో పది పరుగులు చేసి జట్టును గెలిపించాడు. చివర్లో కార్తీక్ ఫినిషర్ షాట్ హైలెట్‌గా నిలిచింది. 7వ ఓవర్లలో వేగంగా ఆడే సమయంలో ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా ఔట్ అయ్యాడు.
ఈసమయంలో వెటరన్ ప్లేయర్ దినేష్ కార్తీక్ క్రీజులోకి వచ్చారు. భారత్ గెలుపు కోసం 7 బంతుల్లో 14 కావాలి. ఐతే ఆ తర్వాత ఆస్ట్రేలియా బౌలర్ వైడ్ వేయడంతో మరో పరుగు వచ్చింది. మరుసటి బంతికి రోహిత్ శర్మ ఫోర్ కొట్టడంతో సమీకరణం 6 బంతుల్లో 9 పరుగులకు మారింది. చివరి ఓవర్‌లో 9 పరుగులు కావాల్సిన సమయంలో దినేష్ కార్తీక్ వరుసగా సిక్సర్, ఫోర్ కొట్టి విజయ ధుంధుంబి మోగించాడు. దీంతో అవతలి వైపు ఉన్న కెప్టెన్ రోహిత్ శర్మ సంబరాల్లో మునిగిపోయాడు.
పరుగెత్తుకుని వచ్చి కార్తీక్‌తో కలిసి సంబరాలు చేసుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియోను బీసీసీఐ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది. గొప్ప ముగింపు..గొప్ప విజయమని క్యాప్షన్ ఇచ్చింది. ఆ వీడియోను ఇప్పుడు మీరు చూడండి..
WHAT. A. FINISH! 👍 👍
WHAT. A. WIN! 👏 👏@DineshKarthik goes 6 & 4 as #TeamIndia beat Australia in the second #INDvAUS T20I. 👌 👌@mastercardindia | @StarSportsIndia
Scorecard ▶️ https://t.co/LyNJTtkxVv pic.twitter.com/j6icoGdPrn
— BCCI (@BCCI) September 23, 2022
🔥💙🥳 pic.twitter.com/OB6yteAu6b
— DK (@DineshKarthik) September 23, 2022
Also read:Syria Boat Accident: సిరియా తీరంలో ఘోరం..77 మంది వలసదారుల మృతి..!
Also read:IND vs AUS: రేపే ఉప్పల్ వేదికగా భారత్, ఆస్ట్రేలియా నిర్ణయాత్మక మ్యాచ్..టీమిండియా తుది జట్టు ఇదే..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి