Plance Collide: ఆకాశంలో రెండు విమానాల క్రాష్ లైవ్‌లో చూశారా ఎప్పుడైనా.. వీడియో వైరల్

Plance Collide: రెండు విమానాలు ఢీ కొనడం..క్రాష్ అవడం ఎప్పుడైనా చూశారా..ఘటనలో ఇద్దరు పైలట్స్ దుర్మరణం పాలవగా..కెమేరాల రికార్డైన ఈ దృశ్యం వైరల్ అవుతోంది.   

Written by - Md. Abdul Rehaman | Last Updated : Sep 26, 2022, 06:04 PM IST
Plance Collide: ఆకాశంలో రెండు విమానాల క్రాష్ లైవ్‌లో చూశారా ఎప్పుడైనా.. వీడియో వైరల్

Plance Collide: రెండు విమానాలు ఢీ కొనడం..క్రాష్ అవడం ఎప్పుడైనా చూశారా..ఘటనలో ఇద్దరు పైలట్స్ దుర్మరణం పాలవగా..కెమేరాల రికార్డైన ఈ దృశ్యం వైరల్ అవుతోంది. 

విమాన ప్రమాదాల ఘటన తరచూ వింటూనే ఉంటాం. ఇటీవల అమెరికాలోని ఒక విమానంలో మంటలు అంటుకోవడం, ఆ తరువాత ఫ్రాన్స్ విమానం రన్‌వే నుంచి జారి..సరస్సులో పడిపోవడం ఇలాంటి వార్తలు విన్నాం. ఇప్పుడు జర్మనీ నుంచి వచ్చిన ఈ వార్త ఒళ్లు జలదరించేస్తుంది. ఇందులో రెండు విమానాలు ఒకదానికొకటి ఢీకొని..జనావాసాల్లో పడిపోయాయి. ఈ ఘటనలో ఇద్దరు పైలట్లు దుర్మరణం పాలయ్యారు. రెండు విమానాలు కాలి బూడిదయ్యాయి.

వాస్తవానికి ఈ ఘటన జర్మనీలోని లెమనీజ్ ఎయిర్ ఫీల్డ్‌కు చెందింది. ది సన్‌లో ప్రచురితమైన వార్త ప్రకారం..రెండు విమానాల పైలట్లు ఓ ప్రత్యేక విధానంలో ట్రైనింగ్ అవుతుండగా ఈ క్రాష్ జరిగింది. ఇద్దరు పైలట్లు మిరర్ ఫ్రైట్ కోసం శిక్షణ పొందుతున్నారు. ఈ సందర్భంగా రెండు విమనాలు సమాంతరంగా ఎగురుతున్నాయి. ఈలోగా ఒకదానికొకటి ఢీకొని క్రాష్ అయ్యాయి. 

రెండు విమానాలు క్రాష్ అయి మంటలు వ్యాపించాయి. అలానే జనావాసాలకు సమీపంలో కూలిపోయాయి. రెండు విమానాలు నేలకూలగానే ఆందోళన రేగింది. సహాయక చర్యలు ప్రారంభించినా ఫలితం లేకపోయింది. ఇద్దరు పైలట్లు మరణించారు. ఇద్దరు పైలట్లు తమ తమ విమానాలతో ఏరోబేటిక్స్ శిక్షణ పొందుతున్నారు. అంతలో రెండు ఒకదానికొకటి ఢీ కొన్నాయి. రెండు విమానాలు ఆకాశంలో ఎగరడం, ఒకదానికొకటి ఢీ కొనడం, క్రాష్ అయి కూలిపోవడం, మంటలు రావడం అంతా దూరం నుంచి ఓ కెమేరాలో రికార్డైంది. ఇప్పుడీ వీడియో వైరల్ అవుతోంది.

Also read: King Cobra vs Mongoose: భారీ నాగుపాము, రెండు ముంగిసల మధ్య ఫైట్.. చివరకు ఊహించని ట్విస్ట్!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu 

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News