Jabardasth Comedian Murthy: జబర్దస్త్ కమెడియన్ మూర్తి మృతి.. ఆ సైడ్ ఎఫెక్ట్స్ తోనే!

Jabardasth Comedian Mimicry Murthy Passed Away:  గతంలో మిమిక్రీ ఆర్టిస్ట్ గా అనేక వందల స్టేజ్ షోలు చేసి మిమిక్రీ ఆర్టిస్ట్ గా మంచి పేరు సంపాదించిన జబర్దస్త్ కమెడియన్ మూర్తి కన్నుముశారు. 

Written by - Chaganti Bhargav | Last Updated : Sep 27, 2022, 05:25 PM IST
Jabardasth Comedian Murthy: జబర్దస్త్ కమెడియన్ మూర్తి మృతి.. ఆ సైడ్ ఎఫెక్ట్స్ తోనే!

Jabardasth Comedian Mimicry Murthy Passed Away: తెలుగు సినీ పరిశ్రమలో మరో విషాదం నెలకొంది. జబర్దస్త్ కమెడియన్ మూర్తి కన్నుముశారు.  గతంలో మిమిక్రీ ఆర్టిస్ట్ గా అనేక వందల స్టేజ్ షోలు చేసి మిమిక్రీ ఆర్టిస్ట్ గా మంచి పేరు సంపాదించిన మూర్తి తర్వాత జబర్దస్త్ లో కమెడియన్ గా మారి అనేక స్కిట్లలో అలరించారు. గత కొంతకాలంగా ఆయన పాంక్రియాస్ క్యాన్సర్ తో బాధపడుతున్నారు. ఈ అనారోగ్యం వలన చాలా కాలం క్రితం నుంచి ఆర్థిక ఇబ్బందులతో ఇబ్బందులు పడిన ఆయన స్నేహితులు, సన్నిహితుల ఆర్థిక సాయంతో మళ్ళీ కోలుకున్నారు.

ఆ మధ్య పలు యూట్యూబ్ ఇంటర్వ్యూలలో కూడా పాల్గొన్న ఆయన తన ఆరోగ్య పరిస్థితి గురించి కూడా వివరించారు. మిమిక్రీ ఆర్టిస్ట్ మూర్తి మరణించారన్న విషయాన్ని ఆయన సోదరుడు అరుణ్ ధ్రువీకరించినట్లు వార్తలు వస్తున్నాయి. ఇక ఆయన మరణ వార్తను జబర్దస్త్ మాజీ కమెడియన్ అప్పారావు కూడా ధ్రువీకరించారు. ఆయనకు కొన్నేళ్ల క్రితం పాంక్రియాస్ క్యాన్సర్ ఉన్నట్లు గుర్తించారు. ఈ మహమ్మారి నుంచి బయటపడేందుకు ఆయన అనేక ప్రయత్నాలు చేశారు.

అయితే క్యాన్సర్ చికిత్స ఖర్చుతో కూడుకున్న విషయం కావడం మూర్తి ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో ఆయన ఇతరుల నుంచి ఆర్థిక సహాయం కూడా తీసుకున్నారు. ఇక ఈ క్యాన్సర్ కారణంగా ఆయన సుమారు మూడు సంవత్సరాలలో 16 లక్షల రూపాయలు ఖర్చు పెట్టారట. అంత ఖర్చుపెట్టినా ఆయన ఆరోగ్యం మాత్రం కుదుట పడలేదు. తాజాగా అందుతున్న సమాచారం మేరకు క్యాన్సర్ కోసం ఆయన రోజు వారీగా వాడే మెడిసిన్ సైడ్ ఎఫెక్ట్స్ చూపించడంతో తన స్వస్థలమైన హన్మకొండలో కన్నుమూసినట్లు తెలుస్తోంది.

గతంలో నిండు విగ్రహం లాగా పుష్టిగా కనిపించిన ఆయన ఈ ప్యాంక్రియాస్ బారిన పడి బక్క చిక్కిన తర్వాత పలు టీవీ, యూట్యూబ్ ఛానల్ లకు ఇంటర్వ్యూలు ఇచ్చారు. అప్పట్లోనే ఆయనను చూసి చాలా మంది ఇలా అయిపోయారేంటి అంటూ బాధపడ్డారు. ఇప్పుడు ఆయన మరణ వార్త తెలుసుకున్న వారంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Also Read: Dada Saheb Phalke: ఆశా పరేఖ్ కు దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు.. ఆయనతో ప్రేమ వల్ల జీవితాంతం అవివాహితగానే!

Also Read: Ram Gopal Varma: చరణ్, ఎన్టీఆర్, ప్రభాస్ రీల్.. కేసీఆర్ రియల్ పాన్ ఇండియా పొలిటికల్ స్టార్!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

Trending News