TARGET TRS : ఢిల్లీ లిక్కర్ స్కాంలో తెలంగాణలో సీబీఐ, ఈడీ సోదాలు.. పీఎఫ్ఐ కేసులో ఎన్ఐఏ అరెస్టులు.. మనీ లాండిరింగ్ కేసులో ఎమ్మెల్యేను ప్రశ్నించిన ఈడీ.. ఇవీ తెలంగాణలో కొన్ని రోజులుగా జరుగుతున్న ఘటనలు. కేంద్ర దర్యాప్తు సంస్థలు తెలంగాణలో నిర్వహిస్తున్న దాడులు కలకలం రేపుతున్నాయి. అధికార టీఆర్ఎస్ నేతల టార్గెట్ గానే కేంద్ర సంస్థల దాడులు జరుగుతున్నాయనే ప్రచారం సాగుతోంది. తెలంగాణలో కేసీఆర్ పాలన అవినీతికి కేంద్రంగా మారిందని.. అక్రమాలను వెలికితీస్తామని బీజేపీ నేతలు పదేపదే చెబుతున్నారు. అటు కేసీఆర్ కూడా కేంద్ర సంస్థల విషయంలో అప్రమత్తంగా ఉండాలని పార్టీ నేతలు అలెర్ట్ చేశారనే వార్తలు వచ్చాయి. దీంతో తెలంగాణలో కీలక పరిణామాలు జరగడం ఖాయంగా కనిపిస్తోంది.
కేంద్ర దర్యాప్తు సంస్థల దూకుడు, సీఎం కేసీఆర్ హెచ్చరికలతో గులాబీ పార్టీ నేతల్లో గుబులు పట్టుకుందని తెలుస్తోంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో సీబీఐ ఇద్దరిని అరెస్ట్ చేసింది. మరికొందరిని అరెస్ట్ చేయవచ్చని తెలుస్తోంది. లిక్కర్ స్కాంలో మూలాలు తెలంగాణలో బయటపడ్డాయి. సీఎం కేసీఆర్ కూతురు ఎమ్మెల్సీ కవితపైనే ఆరోపణలు చేశారు ఢిల్లీ బీజేపీ నేతలు. కవిత మాత్రం తనకు సంబంధం లేదని ప్రకటించింది. అయితే కవితకు సన్నిహితులుగా చెప్పుకునే వారి కార్యాలయాలు, ఇళ్లలో ఈడీ సోదాలు జరిపింది. లిక్కర్ స్కాం కేసులో ఏ14గా ఉన్న మద్యం వ్యాపారి రామచంద్రన్ పిళ్లై.. కవిత ఫ్యామిలీతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్న వీడియోలు బయటికి వచ్చాయి. ఈ కేసులోనే హైదరాబాద్ కు చెందిన అభిషేక్ బోయినపల్లి, సూదిన సృజన్, గండ్ర మోహన్ రావు నివాసాల్లో ఈడీ సోదాలు చేసింది. సిరిసిల్ల జిల్లాకు చెందిన బిల్డర్ వెన్నమనేని శ్రీనివాసరావు ఇళ్లలో సోదాలు చేయడంతో పాటు అతన్ని ప్రశ్నించింది. ఢిల్లీ కార్యాలయానికి పిలిపించి వివరాలు సేకరించింది.
ఢిల్లీ లిక్కర్ స్కాంలో హైదరబాద్ లింకులు బయటపడటం.. సీబీఐ అరెస్టులు మొదలు కావడంతో కొందరు టీఆర్ఎస్ నేతలు తమ ఫోన్లు స్విచ్చాఫ్ చేశారని తెలుస్తోంది. కొందరు నేతలు తమ అనుచరులకు కూడా అందబాటులో లేరట. సీఎం కేసీఆర్ కు అత్యంత సన్నిహితుడిగా చెప్పుకునే నేత కుటుంబ సభ్యుడిపైనా ఆరోపణలు వస్తుండగా.. సదరు నేత ఫోన్ స్విచ్చాఫ్ అయిందనే వార్తలు వస్తున్నాయి. ఇందుకు సంబంధించి జాతయ మీడియాలోనూ కథనాలు వస్తున్నాయి. సీఎం కేసీఆర్ అలెర్ట్ చేయడంతోనే ఇలా స్విచ్ఛాఫ్ చేసుకున్నారని అంటున్నారు. ఉమ్మడి కరీంనగర్ జల్లాకు చెందిన చాలా మంది గులాబీ లీడర్లు రహస్య ప్రదేశానికి వెళ్లిపోయారని చెబుతున్నారు. తన నేతలు ఫోన్లు స్విచ్చాఫ్ చేసుకోవడంతో ఏదో జరబోతుందనే ఆందోళన కేడర్ లో వ్యక్తమవుతోంది.
ఢిల్లీ లిక్కర్ స్కాంలో తెలంగాణ నుంచే కోట్లాది రూపాయలు చేతులు మారినట్లు ఈడీ విచారణలో తేలిందని తెలుస్తోంది. దీంతో ఢిల్లీ లిక్కర్ స్కాంలో తెలంగాణలో అరెస్టులు తప్పవచ్చని సమాచారం. దసరా తర్వాత సంచలనాలు జరగవచ్చని.. కీలక నేతలను అరెస్ట్ చేయవచ్చనే ప్రచారం సాగుతోంది. కొన్ని రోజులుగా సీఎం కేసీఆర్ సైలెంట్ గా ఉండటం టీఆర్ఎస్ నేతలను కలవరపరుస్తోంది. సెప్టెంబర్ 17 వేడుకల్లో పాల్గొన్న తర్వాత ఫాంహౌజ్ వెళ్లిన కేసీఆర్.. ముఖ్య నేతలతో మంతనాలు సాగిస్తున్నారని అంటున్నారు. మూడు రోజుల క్రితం మంత్రి హరీష్ రావుతో కేసీఆర్ సుదీర్ఘంగా చర్చించారని చెబుతున్నారు. కేసీఆర్ రహస్య చర్చలతో రాష్ట్రంలో కీలక పరిణామాలే జరగబోతున్నాయనే ఆందోళన టీఆర్ఎస్ కేడర్ లో కనిపిస్తోంది.
Read also: హాస్పిటల్లో మహేష్ బాబు.. ఇంట్లో దూరిన దొంగ.. వెలుగులోకి షాకింగ్ ఘటన!
Read also: Telangana Rain Alert: కుమ్మేస్తున్న వరుణుడు.. మరో మూడు రోజులు ఇంతే... జనాలకు ఐఎండీ వార్నింగ్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి