బీజేపీ తెలుగువారితో పెట్టుకుందని ఏపీ మంత్రి శాపనార్ధాలు

  బీజేపీపై ఏపీ మంత్రి అయ్యన్నపాత్రుడు ఆగ్రహం 

Last Updated : May 22, 2018, 11:53 PM IST
బీజేపీ తెలుగువారితో పెట్టుకుందని ఏపీ మంత్రి శాపనార్ధాలు

అవినీతిరహిత పరిపాలన అందిస్తానని చెప్పిన ప్రధాని నరేంద్ర మోదీ కర్ణాటకలో గాలి బంధువులకు సీట్లు ఎలా కేటాయించారని ఏపీ మంత్రి అయ్యన్నపాత్రుడు ప్రశ్నించారు. విశాఖలో జరిగిన టీడీపీ ధర్మ పోరాట సభలో మంత్రి అయ్యన్నపాత్రుడు పాల్గొని మాట్లాడుతూ.. తెలుగు వారితో పెట్టుకున్న బీజేపీకి ఇకపై పతనం తప్పదని కేంద్రంలో అధికారంలో వున్న బీజేపీపై ఆగ్రహం వ్యక్తంచేశారు. అప్పట్లో తెలుగు వారి దెబ్బకు ఇందిరాగాంధీనే దిగొచ్చారు అని ఈ సందర్భంగా మంత్రి అయ్యన్నపాత్రుడు గుర్తుచేశారు.

మంత్రి అయ్యన్నపాత్రుడితో కలిసి ఇదే ధర్మ పోరాట సభలో పాల్గొన్న టీడీపీ ఎంపీ సుజనా చౌదరి సైతం కేంద్ర ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. ఎంపీ సుజనా చౌదరి మాట్లాడుతూ కర్ణాటకలో గాలి బ్రదర్స్‌తో బీజేపీ స్నేహం చేయడం చూస్తోంటే, మన రాష్ట్రంలో ఆ పార్టీ ఎవరితో చేతులు కలుపుతుందో అర్థం చేసుకోవడం పెద్ద కష్టమేమీ కాదని అన్నారు. అందుకే తెలుగు వారు వచ్చే ఎన్నికల్లో బీజేపీకి బుద్ధి చెప్పాలని ఈ సందర్భంగా సుజనా చౌదరి తెలుగువారికి పిలుపునిచ్చారు. 

Trending News