Prabhas Fans Vs Mega Fans Regarding a Banner at Krishnamraju Condolence Meet: టాలీవుడ్ లో ఇద్దరు హీరోల అభిమానుల మధ్య ఫాన్ వార్ జరగడం చాలా మామూలే. గతంలో మెగాస్టార్ చిరంజీవి- బాలకృష్ణ అభిమానులు, పవన్ కళ్యాణ్ -మహేష్ బాబు అభిమానులు, పవన్ కళ్యాణ్ -ప్రభాస్ అభిమానుల మధ్య అడపాదడపా సోషల్ మీడియాలో ఫ్యాన్ వార్ జరుగుతూ ఉండేవి. కానీ తాజాగా జరిగిన కృష్ణంరాజు సంస్మరణ సభ నేపథ్యంలో అక్కడ ప్రభాస్ అభిమానులు ప్రదర్శించారని చెబుతున్న ఒక బ్యానర్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
నిజానికి నిన్న కృష్ణంరాజు సంస్మరణ సభ మొగల్తూరులో పెద్ద ఎత్తున జరిగింది. కొన్ని వేల కేజీల చికెన్, మటన్, రొయ్యలు, చేపలు, పీతలతో సుమారు 70 వేల మందికి భోజనం ఏర్పాటు చేశారు. ఇక మెగాస్టార్ చిరంజీవిది కూడా మొగల్తూరు కావడంతో ప్రభాస్ చిరంజీవిని కంపేర్ చేస్తూ ఒక పోస్టర్ ను ప్రచురించి చూపడం హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటివరకు చిరంజీవి రావడం చూశారు, పవన్ కళ్యాణ్ రావడం చూశారు కానీ 12 ఏళ్ల తర్వాత ఒక రాజు వస్తే ఇలాగే ఉంటుంది అంటూ ప్రభాస్ నిలబడి ఉన్న ఒక పోస్టరును ప్రచురించడం ఆసక్తికరంగా మారింది.
ఇక్కడ ప్రభాస్ను హైలైట్ చేయడం కంటే చిరంజీవి పవన్ కళ్యాణ్ ఇద్దరిని విమర్శించడమే ఎక్కువగా కనిపిస్తోందనే వాదన ఉంది. దీంతో సోషల్ మీడియాలో పవన్ అలాగే మెగాస్టార్ చిరంజీవి అభిమానులు కూడా రెచ్చిపోయి కామెంట్లు చేశారు. తినడానికి పోయారు, తినండి అంతేకానీ మధ్యలో చిరంజీవి గారు ఎందుకు వచ్చారు ?పవన్ కళ్యాణ్ ఎందుకు వచ్చారు? మాకు ప్రభాస్ అంటే ఇష్టమే కానీ మీలాంటి వాళ్ల వల్లనే ఇదంతా. ఎవరైనా మీ హీరోని లేపుకోవాలంటే లేపుకోండి అంతేగాని ఇంకో హీరోయిన్ తక్కువ చేయకూడదు అంటూ వారు కాస్త బూతులతోనే రెచ్చిపోయారు.
అయితే మరికొందరు పవన్ మాత్రం చిరంజీవి కృష్ణంరాజు గారు మంచి స్నేహితులని ఇద్దరికీ ఒకే ఊరు వాళ్ళం అనే ఫీలింగ్ ఉండేదని తర్వాత కృష్ణంరాజు గారు ప్రజారాజ్యంలో కూడా పనిచేశారని జనసేనకు బహిరంగంగానే మద్దతు తెలిపే వాళ్ళని కామెంట్ చేస్తున్నారు. మాకు చిరంజీవి పవన్ కళ్యాణ్ అంటే ఎంత ఇష్టమో కృష్ణంరాజు ప్రభాస్ అంటే కూడా అంతే ఇష్టమని రెండు కుటుంబాలు స్వయంకృషితో ఎదిగాయని అడిగిన వాడికి లేదనుకున్నా సాయం చేస్తాయని అంటున్నారు.
మరికొందరైతే ఇదంతా ఏపీలో సీఎం జగన్ కోసం పనిచేస్తున్న ప్రశాంత్ కిషోర్ పని అని కావాలని అభిమానుల మధ్య గొడవలు పెట్టే ప్రయత్నం ఇలా చేస్తున్నారని వారంతా కామెంట్ చేస్తున్నారు. అయితే అసలు ఏం జరిగింది? ఈ పోస్టర్ ఎవరు ప్రచురించారు? ఎవరు ప్రదర్శించారు అనే విషయాల మీద పూర్తి అవగాహన లేదు. కానీ సోషల్ మీడియాలో మాత్రం రకరకాల చర్చలు జరుగుతున్నాయి. మరి అసలు ఈ విషయంలో ఏం జరిగింది అని మీరు అనుకుంటున్నారు అనేది కింద కామెంట్ చేయండి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook