Prabhas Landed In Controversy after Visiting Ayodhya Sri Ram Temple: గత నెల 11వ తేదీన రెబల్ స్టార్ కృష్ణంరాజు అనారోగ్య కారణాలతో కన్నుమూసిన సంగతి తెలిసిందే. దీంతో ప్రభాస్ సహా కృష్ణంరాజు కుటుంబ సభ్యులందరూ తీవ్ర విషాదంలో మునిగిపోయారు. ఆ తర్వాత ఆయన అంత్యక్రియలు, దశదినకర్మ అన్ని హైదరాబాద్‌లోనే ఘనంగా నిర్వహించారు. తర్వాత కృష్ణంరాజు పుట్టి పెరిగిన మొగల్తూరులో కూడా ఒక సంతాప సభ నిర్వహించాలని భావించి భారీ ఎత్తున సంతాప సభ కూడా నిర్వహించారు. అక్కడ పెట్టిన భోజనాలు కూడా హాట్ టాపిక్ గా మారాయి. సుమారు మూడు నుంచి నాలుగు కోట్ల రూపాయల ఖర్చుతో 70 వేల మందికి 22 రకాల నాన్ వెజ్, 15 రకాల వెజ్ ఐటమ్స్ తో భోజనాలు పెట్టినట్టు ప్రచారం జరిగింది.
ఇదంతా బాగానే ఉంది కానీ ఇప్పుడు ఆది పురుష్ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా అయోధ్యలో ఆదిపురుష్ టీజర్ లాంచ్ కార్యక్రమం అక్టోబర్ రెండో తేదీన ఘనంగా జరిగింది. సాయంత్రం 7:00కు ఈ టీజర్‌ను గ్రాండ్ గా సినిమా యూనిట్ లాంచ్ చేసింది. అయితే టీజర్ లాంచ్ కోసం అయోధ్య వెళ్లిన సినిమా యూనిట్ అక్కడ అయోధ్య రాముని దర్శించుకుని ప్రత్యేక పూజలు కూడా నిర్వహించింది. అయితే కృష్ణంరాజు మరణించి నెల రోజులు కూడా ఇంకా పూర్తికాకుండానే ప్రభాస్ గుడికి ఎలా వెళ్తాడని వాదన తెరమీదకు వచ్చింది. సాధారణంగా తెలుగు రాష్ట్రాల్లో దగ్గరి బంధువులు చనిపోతే సంవత్సరం పాటు మైలగా భావించి శుభకార్యాలకు దూరంగా ఉంటారు.
అలాగే పుణ్యక్షేత్రాలకు కూడా దూరంగానే ఉంటారు. ఇప్పుడు ప్రభాస్ విషయంలో ఆయన ఎలా వెళ్ళాడు? అనే చర్చ జరుగుతోంది. అయితే అసలు విషయం ఏమిటంటే ఇక్కడ కృష్ణంరాజుకి ప్రభాస్ తలకొరివి పెట్టలేదు. ప్రభాస్ అన్నయ్య ప్రబోధ్ కృష్ణంరాజుకు తలకొరివి పెట్టారు. ప్రభాస్ కంటే పెద్దవాడు కావడంతో ఆయన ఆ బాధ్యత స్వీకరించారు. ప్రభాస్ కేవలం అంత్యక్రియలు బాధ్యతలు మాత్రమే పర్యవేక్షించారు. ఒకవేళ ప్రభాస్ తలకొరివి పెట్టినా సరే 11 రోజుల వరకు అంటే దశదినకర్మ పూర్తయ్యే వరకు పుణ్యక్షేత్రాలు, గుడులను సందర్శించరని ఆ తర్వాత ఖచ్చితంగా ఏదైనా గుడిలో అయితే నిద్రించాల్సి ఉంటుంది.
ఆ గుడిలో ఒక నిద్ర చేసిన తర్వాత ఎలాంటి పట్టింపులు ఉండవని అంటున్నారు. ఆ తర్వాత సంవత్సరంలోపు ఏదైనా పుణ్యక్షేత్రానికి వెళ్లినా సరే దేవుడిని దర్శించుకుని వెనక్కి వచ్చేయాలి తప్ప తమ పేరిట అర్చనలు, హోమాలు, యజ్ఞ యాగాలు వంటివి నిర్వహించరాదు. అదేవిధంగా అక్కడ దేవీ దేవతలకు కొబ్బరికాయ లాంటి మొక్కులు చెల్లించకుండా ఉండాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ ప్రభాస్ కేవలం తాను సినిమా ప్రమోషన్స్ లో భాగంగా అయోధ్య రాముని దర్శించుకోవడానికి వెళ్లారు తప్ప ఇంకేదో చేయడానికి కాదనే వాదన ప్రభాస్ ఫ్యాన్స్ తెరమీదకు తీసుకువస్తున్నారు.
అయితే ఈ ఆచార వ్యవహారాలు రెండు తెలుగు రాష్ట్రాల్లో వివిధ ప్రాంతాలలో వేరువేరుగా ఉన్నాయి. ప్రభాస్ పెదనాన్న కృష్ణంరాజు పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన వ్యక్తి కావడంతో దాదాపుగా అక్కడే ఆచార వ్యవహారాలను ఇప్పటివరకు ప్రభాస్ కుటుంబ సభ్యుల పాటిస్తూ వస్తున్నారు. అక్కడి ఆచారం ప్రకారం దశదిన కర్మ పూర్తి అయిన తర్వాత ఏదైనా గుడిలో నిద్ర చేస్తే ఆ తర్వాత సంవత్సరంలోపు ఏదైనా పుణ్యక్షేత్రానికి వెళ్ళవచ్చు. కానీ అక్కడ మొక్కులు చెల్లించకూడదు అదే విధంగా తమ పేరిట అర్చనలు, యజ్ఞ యాగాలు వంటివి నిర్వహించరాదు. ప్రభాస్ అలాంటివి చేయలేదు కాబట్టి ఇందులో పెద్దగా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు అనే వాదన వినిపిస్తోంది.
Also Read: Adipurush Teaser: మరీ ఇలా అయితే ఎలా.. నిర్మాణ సంస్థల మధ్య ఆ మాత్రం అండర్ స్టాండింగ్ లేదా?
Also Read: Telugu Movies Releasing This Week : ఒకే రోజు థియేటర్లలో 3, ఓటీటీలో 10 సినిమాలు !
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook