Green Tea Benefits: టైప్ 2 డయాబెటిస్‌కు గ్రీన్ టీ అద్భుత ఔషధమే, నెలరోజుల్లోనే మధుమేహం నియంత్రణ

Green Tea Benefits: దేశంలో చాపకింద నీరులా విస్తరిస్తున్న ప్రాణాంతక వ్యాధి మధుమేహం. ఎందుకంటే ఇదొక స్లో పాయిజన్ లాంటిది. అయితే డయాబెటిస్ నియంత్రణకు కొన్ని సులభమైన చిట్కాలు కూడా ఉన్నాయి. ఆ వివరాలు చూద్దాం..

Written by - Md. Abdul Rehaman | Last Updated : Oct 5, 2022, 11:26 PM IST
Green Tea Benefits: టైప్ 2 డయాబెటిస్‌కు గ్రీన్ టీ అద్భుత ఔషధమే, నెలరోజుల్లోనే మధుమేహం నియంత్రణ

మధుమేహం అనేది చాలా వేగంగా విస్తరిస్తున్న వ్యాధి. ఇండియాలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా మధుమేహం కోరలు చాచుతోంది. ఆధునిక జీవనశైలి, చెడు ఆహారపు అలవాట్లు, పని ఒత్తిడి, స్థూలకాయం వంటివి డయాబెటిస్‌కు కారణమౌతున్నాయి. డయాబెటిస్ అనేది రెండు రకాలు. టైప్ 1 డయాబెటిస్, టైప్ 2 డయాబెటిస్. 

డయాబెటిస్ నిర్మూలనకు లేదా నియంత్రణకు కొన్ని సులభమైన చిట్కాలున్నాయి. అందులో కీలకమైంది గ్రీన్ టీ. గ్రీన్ టీతో మధుమేహాన్ని నియంత్రణలో ఉంచుకోవచ్చు. ముఖ్యంగా టైప్ 2 డయాబెటిస్ రోగులకు గ్రీన్ టీ అద్భుత ఔషధంగా పనిచేస్తుంది. గ్రీన్ టీతో ఇంకా ఇతర ప్రయోజనాలు చాలానే ఉన్నాయి. ముఖ్యంగా సన్నబడేందుకు గ్రీన్ టీ  తాగుతుంటారు. గ్రీన్ టీ ఆరోగ్యపరంగా చాలా మంచిది. గ్రీన్ టీ రోజూ తాగితే..గుండె పదికాలాలు పదిలంగా ఉంటుంది. 

గ్రీన్ టీతో ప్రయోజనాలు

శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. బ్లడ్ ప్రెషర్ ఉన్నవారు క్రమం తప్పకుండా తీసుకుంటే..రక్తపోటు అదుపులో ఉంటుంది. క్యాన్సర్ కణాలు వృద్ధి చెందకుండా ఉంటాయి.

టైప్ 2 డయాబెటిస్‌కు అద్భుత పరిష్కారం

టైప్ 2 డ‌యాబెటిస్ ఉన్న‌వారు ప్రతిరోజూ గ్రీన్ టీని సేవిస్తే.. శరీరంలో షుగర్ లెవెల్స్ అదుపులో ఉంటాయి. ఎందుకంటే గ్రీన్ టీలో కొటేకిన్ అనే యాంటీ ఆక్సిడెంట్ పుష్క‌లంగా ఉంటుంది. ఇది బరువు తగ్గేందుకు దోహదపడుతుంది. రక్తపోటును తగ్గిస్తుంది. కార్బొహైడ్రేట్లను త్వరగా జీర్ణం చేయకుండా..నియంత్రించడం వల్ల ఇన్సులిన్ రెసిస్టెన్స్ త‌గ్గుతుంది. బ‌రువు ఎప్పుడైతే తగ్గుతుందో..ఇన్సులిన్ రెసిస్టెన్స్ త‌గ్గుతుంది. శ‌రీరంలో ఉన్న ఇన్సులిన్ పూర్తిగా వినియోగమౌతుంది. ఫలితంగా ర‌క్తంలో షుగ‌ర్ లెవెల్స్ త‌గ్గుతాయి. టైప్ 2 డయాబెటిస్‌తో బాధపడేవారు రోజూ 2-3 కప్పుల గ్రీన్ టీ తాగితే మంచిది. 

గ్రీన్ టీ ఎవరు తాగకూడదు

అయితే గ్రీన్ టీ అందరూ తీసుకోవడం కూడా మంచిది కాదు. వైద్యుల సూచన మేరకే గ్రీన్ టీ తీసుకోవాలి. ఎందుకంటే గ్యాస్ ఎసిడిటీ , కెఫీన్ అలర్జీ ఉన్నవారికి గ్రీన్ టీ అంత మంచిది కాదు. మితంగా తీసుకోవాలి. గ్రీన్ తాగినప్పుడు ఏదైనా సమస్యగా అన్పిస్తే మానేయడం మంచిది.

మార్కెట్లో గ్రీన్ టీ వివిధ రకాల రుచుల్లో లభిస్తోంది. గ్రీన్ టీ లెమన్, గ్రీన్ టీ హనీ, గ్రీన్ టీ జింజర్, గ్రీన్ టీ తులసి ఇలా చాలా రకాలున్నాయి. మన అవసరానికి, రుచికి తగ్గట్టుగా ఎంచుకోవాలి. 

Also read: Kidney Stones: కిడ్నీలో రాళ్ల గురించి భయపడుతున్నారా? ఇలా చేస్తే మీ కిడ్నీలు క్లీన్..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.    

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu  

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x