Actress Anna Reshma Rajan locked in private telecom firm at Aluva: కేరళ సినీ పరిశ్రమ నుంచి ఈ మధ్య కాలంలో కొన్ని షాకింగ్ వార్తలు వస్తున్నాయి. ఈ మధ్య కాలంలో ఒక యువనటుడు అసభ్య వ్యాఖ్యలు చేశారని యూట్యూబ్ ఛానల్ యాంకర్ కేసు పెట్టడంతో సదరు నటుడిని అరెస్ట్ చేసిన వ్యవహారం మరువక ముందే ఇప్పుడు మరో షాకింగ్ కేసు తెర మీదకు వచ్చింది. మలయాళ సినీ నటి అన్నా రాజన్‌ను ఓ ప్రైవేట్ టెలికాం కంపెనీలో బంధించారని తెలుస్తోంది. కొత్త సిమ్‌కార్డును పొందే విషయంలో ఒక టెలికాం ఆపరేటర్ షో రూమ్ కు వెళ్లిన సమయంలో ఏర్పడిన వివాదం ఆమెను లోపలేసి తాళాలు వేసే దాకా వెళ్ళింది.
గురువారం సాయంత్రం, నటి అన్నా రాజన్ సిమ్ తీసుకోవడానికి అలువా మున్సిపల్ కార్యాలయం సమీపంలోని టెలికాం సంస్థ షో రూమ్ కు చేరుకుంది. అయితే సిమ్ తీసుకునే విషయంలో షో రూమ్ సిబ్బందితో గొడవలు జరిగాయి. ఈ కారణంగా, నటిని లోపల నుంచి షో రూమ్ లాక్ చేసినట్టు తెలుస్తోంది. తనకు ఎదురైన ఈ షాకింగ్ ఘటన గురించి అన్నా రాజన్ అలువా పోలీసులకు ఫిర్యాదు చేసింది. టెలికాం ఉద్యోగులపై ఫిర్యాదు మేరకు పోలీసులు ఈ ఘటనపై సమగ్ర విచారణ ప్రారంభించారు. అయితే రాత్రికి రాత్రే ఫిర్యాదును పరిష్కరించారని అంటున్నారు.
సిమ్‌కార్డును మార్చేందుకు వచ్చినప్పుడు తాను ఏదో దొంగతనం చేసినట్లుగా షట్టర్‌ను కిందకు దించారని అన్నా మీడియా ముందు వాపోయారు. తాను ముఖానికి మాస్క్ వేసుకుని అక్కడికి వెళ్లానని, ఒక సినీ నటిగా కాకుండా సాధారణ మహిళగా అక్కడికి వెళ్లానని అన్నా పేర్కొన్నారు. తన తల్లి సిమ్ కార్డు పనిచేయకపోవడంతో దానిని పునరుద్ధరించేందుకు ఒక I.D కార్డు కావాలని చెప్పారని, అది ఇచ్చేందుకు వెళ్లినప్పుడు దానిపై వాగ్వాదం జరిగిందని అన్నా అన్నారు. వాగ్వాదం మొదలైన తరువాత ఆ షోరూంలో ఉన్న యువతిని అన్నా తన ఫోన్‌లో ఫోటో తీయడంతో దాన్ని వారు డిలీట్ చేయించడానికి తనను లాక్ చేసినట్టు అన్నా పేర్కొంది.
ఇక ఆమె తనతో చెడుగా మాట్లాడినందుకే ఆ ఫోటో తీశానని అన్నా పేర్కొన్నారు. తనతో వారు దురుసుగా ప్రవర్తించారని, అయినా వేరొకరి పర్మిషన్ లేకుండా ఎవరి ఫోటో తీయకూడదని అన్నా, క్షమాపణలు చెప్పి ఫిర్యాదును వెనక్కు తీసుకున్నారు. అయితే షట్టర్‌ను దించి తాళం వేసి తనను చేతితో పట్టుకున్నట్లు నటి ఆరోపించింది. నా మీద అరిచిన అమ్మాయిని ఫోటో తీసినందుకు నన్ను బెదిరించారన్న అన్నా వాళ్లు చేయి పట్టుకుని లాగడంతో మేకు తగిలి గాయమైందని అన్నా పేర్కొన్నారు. ఇక దాడి చేసిన అమ్మాయి క్షమాపణ చెప్పిందన్న అన్నా ఇది 25 ఏళ్లలోపు బాలిక యొక్క అపరిపక్వ ప్రవర్తనగా భావించి, ఆమెను క్షమించినట్లు చెప్పుకొచ్చింది.
Also Read: Laal Singh Chaddha: ఆమీర్‌ఖాన్ 'లాల్ సింగ్ చడ్డా' ఓటీటీలోకి వచ్చేసింది... స్ట్రీమింగ్ ఎక్కడంటే?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook