Selfie With Tiger, Viral Video: ముఖ్యంగా రిజర్వ్ ఫారెస్ట్ ఏరియాలోంచి వెళ్లే రహదారుల వెంట ఈ హెచ్చరికలు ఎక్కువగా కనిపిస్తుంటాయి. ఇలాంటి సైన్ బోర్డులు ఏర్పాటు చేయకపోతే, అసలు విషయం తెలియని వాళ్లు ఎవరైనా వన్యమృగాల బారిన పడి ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉందని హెచ్చరించడం ఇందుకు ఒక కారణమైతే.. తెలిసో, తెలియకో మానవులు కూడా వన్య మృగాలకు ఎలాంటి హానీ తలపెట్టవద్దనే విజ్ఞప్తి ఈ హెచ్చరికల్లో నిగూడమై ఉంటుండటం మరో కారణం.
అయితే, అటవీ శాఖ అధికారులు ఎన్ని హెచ్చరికలు చేసినప్పటికీ.. కొంతమంది యువత మాత్రం అటవీ శాఖ అధికారుల హెచ్చరికలను బేఖాతరు చేస్తూ అడవిలో వన్యప్రాణులను ఇబ్బంది పెట్టడం చేస్తుంటారు. ఇంకొన్నిసార్లు వన్యప్రాణులను ఇబ్బందిపెట్టే క్రమంలో తమకు తెలియకుండానే ఆపద కొని తెచ్చుకుంటుంటారు. ఇదిగో ఇప్పుడు మనం చూడబోయే ఈ వీడియో కూడా అలాంటిదే.
ఇప్పుడు మీరు చూసిన దృశ్యం మధ్యప్రదేశ్ లోని పన్నా జిల్లా రిజర్వ్ ఫారెస్ట్ ప్రాంతంలోది. ఒక పులి రోడ్డు దాటి వెళ్లేందుకు వస్తున్న క్రమంలో దానిని గమనించిన యువకులు అక్కడే ఆగి దానిని తమ కెమెరాలో బంధించేందుకు ప్రయత్నించారు. తాము వెంటాడుతోంది ఒక పులిని అనే విషయం కూడా మర్చిపోయి దానికి అతి సమీపంలోకి వెళ్లబోయారు. వారిలో ఒక యువకుడు మరో అడుగు ముందుకేసి ఏకంగా పులితో సెల్ఫీ తీసుకునేందుకు ప్రయత్నించడం వీడియోలో చూడొచ్చు.
Remember that if you see a large carnivore, it wanted you to see it. It never wanted to be chased. The tiger can maul you to death feeling threatened. Please don’t resort to this wired behaviour. pic.twitter.com/e0ikR90aTB
— Susanta Nanda (@susantananda3) October 6, 2022
ఈ ఘటనకు సంబంధించిన వీడియోను ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఆఫీసర్ సుశాంత నంద ట్విటర్ పోస్ట్ చేసి ఒక ఇంట్రెస్టింగ్ క్యాప్షన్ రాసుకొచ్చారు. ఒక పులిని మీరు చూస్తున్నారు అంటే.. అది మిమ్మల్ని చూసేందుకు అనుమతించడం వల్లే తప్ప దాని చేతకానితనం కాదు అని గుర్తించాలని యువకులకు లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చుకున్నారు. ఏదో పరధ్యానంలో ఉండి చూసిచూడనట్టు ఉంటే తప్ప.. లేదంటే అవి వేటాడం మొదలుపెడితే చంపి పారేస్తాయనే విషయాన్ని మర్చిపోవద్దని సుశాంత్ నంద హెచ్చరించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ (Viral Videos) అవుతోంది.
Also Read : Python Snake in Graveyard: ఒక సమాధిలోంచి మరో సమాధిలోకి 6 అడుగుల కొండచిలువ
Also Read : Chimpanzee Viral Videos: సన్‌గ్లాసెస్, కోకోనట్ వాటర్, 7 లక్షల మంది ఫాలోవర్స్.. తగ్గేదెలె అంటున్న చింపాంజీ
Also Read : Monkey Playing With Tiger: పులిని తెలివిగా ఫూల్ చేసి కిందపడేసిన కోతి.. వీడియో వైరల్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి