Gold Price Today: మన ఇండియన్స్ కు గోల్డ్ అంటే చాలా మోజు. ఏ మాత్రం డబ్బులు ఉన్నా బంగారం కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతారు. ముఖ్యంగా మగువులు పసిడిని కొనేందుకు మక్కువ చూపుతారు. మనదేశంలోని పేద, మధ్యతరగతి ప్రజలు బంగారం కొనుగోలు చేసేటప్పుడు ముఖ్యంగా చూసేది ధర. రేటు తక్కువగా ఉంటే వెంటనే కొనేస్తారు.
అయితే గత కొన్ని రోజులుగా బులియన్ మార్కెట్లో పసిడి ధరల్లో హెచ్చు తగ్గులు చోటుచేసుకుంటున్నాయి. నిన్నటితో పోలిస్తే ఇవాళ పసిడి, వెండి ధరల్లో ఎలాంటి మార్పులు చోటుచేసుకోలేదు. హైదరాబాద్ (Gold Price 08th October)లో గ్రాము బంగారం ధర రూ.4,785గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లో కిలో వెండి ధర రూ.66,500గా ఉంది. దేశంలోని ప్రధాన నగరాలతోపాటు గోల్డ్ రేట్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.
దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు..
>> దేశ రాజధాని న్యూఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.48,000 కాగా, 24 క్యారెట్లు రూ. రూ.52, 360గా ఉంది.
>> ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల తులం గోల్డ్ ధర రూ.47,850 వద్ద కొనసాగుతుండగా, 24 క్యారెట్ల పసిడి ధర రూ.52,200గా ఉంది.
>> చెన్నైలో 22 క్యారెట్ల పసిడి ధర రూ.48,350 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.52,750 వద్ద కొనసాగుతోంది.
తెలుగు రాష్ట్రాల్లో గోల్డ్ రేట్స్..
>> హైదరాబాద్‌లో 22 క్యారెట్స్ బంగారం ధర రూ.47,850గా ఉండగా, 24 క్యారెట్స్ రూ.52,200 వద్ద కొనసాగుతోంది.
>> విజయవాడలో మంగళవారం 22 క్యారెట్ల పసిడి ధర రూ.47,850 కాగా, 24 క్యారెట్స్ గోల్డ్ రేట్ రూ.52,200గా ఉంది.
>> విశాఖపట్నంలో 22 క్యారెట్స్ గోల్డ్ ధర రూ.47,850 వద్ద కొనసాగుతుండగా, 24 క్యారెట్లు రూ.52,200గా ఉంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook