Prabhas Again as No.1 in Tollywood male Actors list: తెలుగు సినీ పరిశ్రమలో టాప్ హీరో ఎవరు? అంటే దానికి టక్కున సమాధానం చెప్పడం చాలా కష్టం. ఎందుకంటే మన తెలుగు సినీ పరిశ్రమలో ఉన్నంత మంది హీరోలు మరో సినీ పరిశ్రమలో లేరు అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఎవరికి వారే సపరేట్ ఫ్యాన్ బేస్ తో, సపరేట్ ఇమేజ్ తో సూపర్ క్రేజ్ తెచ్చుకున్న మన హీరోలు ఇప్పుడు ప్రపంచమంతా తమ వైపు తిప్పుకునే పనిలో పడ్డారు.
బాహుబలి సినిమాతో ప్రభాస్ ప్రపంచ స్థాయిలో హీరోగా పరిచయమైతే ఆర్ఆర్ఆర్ సినిమాతో రామ్ చరణ్, ఎన్టీఆర్, పుష్ప సినిమాతో అల్లు అర్జున్ కూడా ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే తెలుగు సినీ పరిశ్రమలో ఎక్కువగా ఎవరి గురించి చర్చ జరిగింది అనే విషయం ఆధారంగా టాలీవుడ్ లో టాప్ టెన్ హీరోల లిస్టును ప్రతి నెల ఆర్మాక్స్ మీడియా సంస్థ విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే అనూహ్యంగా గత కొన్నాళ్ల నుంచి ప్రభాస్ ఆ లిస్టులో టాప్ వస్తున్నాడు.
సుమారు ఏడాది పాటు మహేష్ బాబు ఈ రేసులో టాప్ హీరోగా నిలవగా ఇప్పుడు ఆ స్థానాన్ని ఆక్రమించిన ప్రభాస్ సత్తా చాటుతున్నాడు. అప్పుడప్పుడు ఎన్టీఆర్ ఈ స్థానం కోసం పోటీ పడుతూ ఉండగా ప్రభాస్ మాత్రం స్పష్టమైన ఆధిక్యం కనబరుస్తున్నారు, సెప్టెంబర్ నెలకు గాను టాప్ హీరోల లిస్టు ఆర్మాక్స్ మీడియా సంస్థ విడుదల చేసింది. ఇక ఈ లిస్టులో ప్రభాస్ మొదటి స్థానాన్ని ఆక్రమించాడు. రెండవ స్థానంలో జూనియర్ ఎన్టీఆర్ నిలిచారు.
ఇక మూడవ స్థానంలో అల్లు అర్జున్, నాలుగవ స్థానంలో రామ్ చరణ్, ఐదవ స్థానంలో మహేష్ బాబు, ఆరో స్థానంలో పవన్ కళ్యాణ్ ఏడో స్థానంలో నాని, 8వ స్థానంలో విజయ్ దేవరకొండ నిలిచారు. 9వ స్థానంలో మెగాస్టార్ చిరంజీవి నిలవగా పదవ స్థానంలో హీరో రవితేజ నిలిచారు. ఇక ఈ లిస్టులో లేని హీరోలు కూడా ఇప్పుడు జాతీయ స్థాయిలో కూడా గుర్తింపు దక్కించుకునే ప్రయత్నం చేస్తున్నారు. కార్తికేయ సినిమాతో నిఖిల్ సిద్ధార్థ్ కూడా దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు.
ఇక టాలీవుడ్ హీరోలు ఈ రేంజ్ లో సోషల్ మీడియాలో మీడియాలో గుర్తింపు దక్కించుకోవడంతో వీరిలో మొదటి స్థానంలో ప్రభాస్ నిలిచారు ఇక ప్రభాస్ క్రేజ్ చూసిన అభిమానులు అందరూ మా ప్రభాస్ సత్తా ఏంటో చూశారా? అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇక ప్రభాస్ చేస్తున్న సినిమాల విషయానికి వస్తే ఆయన హీరోగా ఆది పురుష్ అనే సినిమా రూపొందింది. అలాగే నాగాశ్విన్ డైరెక్షన్ లో ప్రాజెక్టు కే, ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో సలార్, సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్ లో స్పిరిట్ అనే సినిమాలు రూపొందుతున్నాయి.
ఇవి కాకుండా ఆయన మారుతీ డైరెక్షన్లో కూడా ఒక సినిమా ఒప్పుకున్నట్లు ప్రచారం జరుగుతుంది. అయితే ఈ విషయం మీద అధికారిక ప్రకటన లేదు కానీ ఈ నెలలోనే షూటింగ్ మొదలయ్యే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ సినిమా బడ్జెట్ కాస్త తక్కువగా ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నట్లుగా టాక్ వినిపిస్తోంది.
Also Read: Allu Arjun Indian of the Year: అల్లు అర్జున్ కు అరుదైన గౌరవం.. ఇండియన్ ఆఫ్ ది ఇయర్ గా అవార్డు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook