Pawan Kalyan Tension: ఆర్కే బీచ్ కు పవన్.. నోవొటెల్ వద్ద తీవ్ర ఉద్రిక్తత.. సంచలనంగా విశాఖ టూర్!

Hightension at Vishakapatnam Novotel: పవన్ రాకతో విశాఖ మొత్తం మీద పోలీసుల హడావుడితో టెన్షన్ వాతావరణం నెలకొంది. పవన్ కు నోటీసులు జారీ చేసిన క్రమంలో జనసేన కార్యకర్తలు నోవొటెల్ హోటల్ కు చేరుకుంటూ ఉండడం హాట్ టాపిక్ గా మారింది. 

Written by - Chaganti Bhargav | Last Updated : Oct 16, 2022, 07:41 PM IST
Pawan Kalyan Tension: ఆర్కే బీచ్ కు పవన్.. నోవొటెల్ వద్ద తీవ్ర ఉద్రిక్తత.. సంచలనంగా విశాఖ టూర్!

Pawan Kalyan Back to Back Tweets From Novotel: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విశాఖ పర్యటన రసాభాసగా మారిన సంగతి తెలిసిందే. విశాఖ గర్జన పేరుతో అధికార వైసీపీ ఒక కార్యక్రమం నిర్వహిస్తున్న రోజే విశాఖపట్నం చేరుకున్న పవన్ కళ్యాణ్ ఎయిర్ పోర్ట్ చేరుకున్నారు. ఆయనకు స్వాగతం పలికేందుకు వచ్చిన జనసైనికులు ఏపీ మంత్రుల కారుపై దాడి చేసినట్లు పోలీసులు చెబుతున్నారు. అయితే తర్వాత పవన్ కళ్యాణ్ తో పాటు నోవోటెల్ హోటల్ కి వెళ్ళిన పలువురిని పోలీసులు అరెస్టు చేయడంతో తాను నిర్వహించాలనుకున్న కార్యక్రమాన్ని సైతం పవన్ కళ్యాణ్ వాయిదా వేశారు.

తమ కార్యకర్తలు విడుదల అయితే తప్ప తాను ఈ కార్యక్రమాన్ని నిర్వహించేది లేదని పేర్కొన్నారు. అయితే పోలీసులు పవన్ కళ్యాణ్ కు నోటీసులు జారీ చేశారు ఎలాంటి సభలు ర్యాలీలు జరపకూడదని సెక్షన్ 30 అమలులో ఉందని పోలీసుల నోటీసులు ఇవ్వడంతో ఆయన నోవొటెల్ హోటల్ లోని తన గదికి పరిమితం అయ్యారు. అయితే పవన్ కళ్యాణ్ నోవొటెల్ హోటల్ లో ఉన్నారన్న సంగతి తెలుసుకున్న జనసైనికులు ఆయనను చూసేందుకు పెద్ద ఎత్తున హోటల్ కి తరలి వస్తూ ఉండడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.

అయితే తన అభిమానులు అలా తన హోటల్ బయట వేచి ఉండటం చూసిన పవన్ కళ్యాణ్ ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు. నిన్న సాయంత్రం ర్యాలీగా వెళుతున్న సమయంలో పవన్ కళ్యాణ్ కారు పైన నుంచుంటే అది కుదరదని కారు లోపలికి వెళ్ళిపోమని పోలీసు అధికారులు బలవంతం చేసిన విషయాన్ని ఎద్దేవా చేస్తూ ఇప్పుడు నేను ఇలా హోటల్ కిటికీ నుంచి అయినా చూస్తూ అభివాదం చేయవచ్చో లేదో పోలీసులు తెలపాలంటూ ట్వీట్ చేశారు.

ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిని థానోస్ తానుతో పోల్చిన పవన్ కళ్యాణ్ ఆయన కోసం పనిచేస్తున్న పోలీసులు జనసేన తరపున ఎలాంటి ర్యాలీలు మీటింగ్స్ పెట్టకూడదని నన్ను ఈ గదికే పరిమితం చేశారు ఇప్పుడు ఈ గది కిటికీ నుంచి చూడడం తప్ప నాకు వేరే దారి లేదని ఆయన మరో ట్వీట్ చేశారు. ఇక అలాగే ఉడతా ఉడతా ఊచ్‌, ఎక్కడ కెళ్తోవోచ్‌, రుషికొండ మీద జాంపండు కోసుకొస్తావా, మా వైసిపికి ఇస్తావా, మా థానోస్‌ గూట్లో పెడతావా అంటూ ఎద్దేవా చేసిన పవన్ కళ్యాణ్ తనకు ఇప్పుడే ఒక ఆలోచన వచ్చిందని అలా సరదాగా ఆర్కే బీచ్ లో నాలుగడుగులు వేస్తే ఎలా ఉంటుందని ప్రశ్నించారు. ఇక ఈ ట్వీట్ కి నాగబాబు పద బ్రదర్ నేను కూడా వస్తానని ట్వీట్ చేసి మళ్లీ డిలీట్ చేశారు.

అయితే ఈ వ్యవహారం మాత్రం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిందని చెప్పక తప్పదు. పవన్ కళ్యాణ్ బయటకు వస్తే అరెస్టు చేసే అవకాశం ఉందని పోలీసు వర్గాలు చెబుతున్నాయి. అయితే పవన్ కళ్యాణ్ ట్వీట్లు నేపథ్యంలో పెద్ద ఎత్తున ఆయన అభిమానులు నోవోటేల్ హోటల్ దగ్గరికి చేరుకుంటూ ఉండటంతో పోలీసులు అక్కడ ఆంక్షలు విరుస్తున్నారు. ఇప్పటికే నోవోటేల్  హోటల్ మీదుగా రాకపోకలు నిలిపి వేసిన పోలీసులు ఇప్పుడు నోవోటేల్ వెళ్లే అన్ని దారులను మూసివేసేందుకు ప్రయత్నిస్తున్నారు. అయినా బీచ్ పక్కనే కావడంతో బీచ్ నుంచి కూడా పవన్ అభిమానులు అక్కడికి వచ్చే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.

Also Read: Salaar Kali Matha: అఖండ, కార్తికేయ 2 బాటలోనే సలార్.. గట్టిగానే ప్లాన్ చేసిన ప్రశాంత్ నీల్?

Also Read: Maanaadu Remake: మరో గాడ్ ఫాదర్ తరహా ప్రయత్నం చేస్తున్న రవితేజ..మరో కుర్రహీరోను కూడా కలుపుకుని?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook 

Trending News