Tulsi Vivah 2022: తులసి వివాహం రోజున ఇలా చేస్తే.. మీరు కోరుకున్న జీవిత భాగస్వామిని పొందుతారు..

Tulsi Vivah 2022: తులసి వివాహం ఈ సంవత్సరం నవంబర్ 5న జరగనుంది. అయితే ఈ కళ్యాణంలో భాగంగా పలు పరిహారాలు పాటిస్తే భార్యభర్తల మధ్య గొడవలు సులభంగా దూరమవుతాయి. అంతేకాకుండా భర్తపై ప్రేమ కూడా పెరుగుతుంది.

Written by - ZH Telugu Desk | Last Updated : Oct 18, 2022, 01:25 PM IST
  • తులసి వివాహం రోజున..
  • తులసి దేవిని పూజించండి.
  • మీరు కోరుకున్న జీవిత భాగస్వామిని పొందుతారు.
Tulsi Vivah 2022: తులసి వివాహం రోజున ఇలా చేస్తే.. మీరు కోరుకున్న జీవిత భాగస్వామిని పొందుతారు..

Tulsi Vivah 2022: ప్రతి సంవత్సరం తులసి పూజను ఏకాదశిని కార్తీక మాసంలోని శుక్ల పక్ష ఏకాదశి రోజున జరుపుకుంటారు. తులసి వివావహం తర్వాతి రోజున ద్వాదశి సంబంధించి వేడుకలు జరుపుకోవడం  ఆనవాయితీగా వస్తుంది. అయితే ఈ సంవత్సరం నవంబర్ 4న దేవుత్తని ఏకాదశి జరుపుకుని నవంబర్ 5న తులసి కళ్యాణం వైభవంగా జరుపుకుంటారు. అయితే ఈ కాళ్యాణంలో భాగంగా తులసిని పూజించడం వల్ల అన్ని రకాల ప్రయోజనాలు కలుగుతాయి. అంతేకాకుండా కుటుంబంలో సుఖ సంతోషాలతో పాటు ఆర్థిక ప్రయోజనాలు కలుగుతాయని శాస్త్రం చెబుతోంది. హిందూ సాంప్రదాయం ప్రకారం తులసి వివాహం జరిగిన తర్వాతే అందరి వివాహాలు జరగుతాయని శాన్త్రం చెబుతోంది. అయితే ఈ సంవత్సరం తులసి వివాహం  అబూజ ముహూర్తంన జరగబోతోంది.

తులసి వివాహంలో భాగంగా ఇలా చేస్తే అన్ని సమస్యలను తొలగిస్తాయి:
>>హిందువులంతా తులసిని మహాలక్ష్మి దేవి అవతారంగా భావిస్తారు. శాలిగ్రామంలో సాక్ష్యాత్తు విష్ణువే ఉంటారు. కాబట్టి తులసి దేవి శాస్త్రంలో చాలా ప్రముఖ్యత కలిగి ఉంది. అయితే తులసి పూజలో భాగంగా వివాహిత స్త్రీలు తులసి పూజిస్తే మంచి భర్తను పొందుతారని శాస్త్రం చెబోతోంది. అంతేకాకుండా తులసి వివాహంలో భాగంగా స్త్రీలు పాల్గొంటే మంచి ఫలితాలు పొందుతారు.

>>ముఖ్యంగా వాస్తు శాస్త్రంలో తులసి మొక్కకు చాలా ప్రాధాన్యతను ఇచ్చారు. అయితే తులసి మొక్కను ఇంటి ముందు నాటడం వల్ల వాస్తులో ఉండే వివిధ రకాల సమస్యలు దూరవుతాయి. అంతేకాకుండా ఇంట్లో నివసింయే అనారోగ్య సమస్యలు కూడా దూరమవుతాయని శాస్త్రం చెబుతోంది.

తులసి వివాహం రోజున పాటించే పరిహారాలు ఇవే:
>>తులసి వివాహానికి ముందు రోజూ పలు రకాల నియమాలు పాటించాల్సి ఉంటుంది. అంతేకాకుండా కొన్ని తులసి ఆకులను తీసి నీటిలో వేయాల్సి ఉంటుంది. ఈ నీటి తొట్టిని తులసి కళ్యాణం రోజున ఇంటి ప్రధాన ద్వారం వద్ద పెట్టాల్సి ఉంటుంది. ఇలా చేయడం వల్ల భర్యాభర్తల మధ్య ఉన్న గొడవలు తొలగిపోతాయి. అంతేకాకుండా వీరి మధ్య ప్రేమ కూడా పెరుగుతుందని శాస్త్రం పేర్కొంది.

>> భార్యాభర్తల మధ్య గొడవలుంటే తులసి కళ్యాణం రోజున తులసికి చేసే అలంకరణను, నైవేద్యాన్ని స్త్రీలకు దానం చేయాల్సి ఉంటుంది. ఇలా తులసి కాళ్యాణం రోజున చేస్తే భార్యభర్తల మధ్య ఉన్న గొడవలు దూరమవుతాయి. అంతేకాకుండా భర్తపై ప్రమ కూడా పెరుగుతుందని శాస్త్రం చెబుతోంది.

>>ప్రస్తుతం చాలా మందిలో వివిధ కారణాల వల్ల పెళ్లిలు జరగలేకపోతున్నాయి. అయితే దీని కోసం తులసి కాళ్యాణం రోజున తులసి భక్తి శ్రద్ధలతో పూజలు చేయాల్సి ఉంటుంది. ఇలా చేయడం వల్ల వివాహంలో జాప్యం వంటి సమస్యలు తొలగిపోయి. కోరుకున్న వరుడితో వివాహం జరుగుతుందని శాస్త్రంలో పేర్కొన్నారు. అయితే ఇలాంటి సమస్యలతో బాధపడేవారు తప్పకుండా ఈ పరిహారాలు పాటించడం చాలా మంచిదని శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా  విష్ణువుకు నైవేద్యంగా  బెల్లం, శెనగ పప్పులను సమర్పించి స్త్రీలకు వీటిని పంచి పెట్టాలి.

(NOTE: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ అంచనాలు, సమాచారంపై ఆధారపడి ఉంటుంది. ZEE NEWS దానిని నిర్ధారించలేదు.)

Also Read: TSPSC Group-1: ప్రశాంతంగా గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌... సివిల్స్ స్థాయిలో ప్రశ్నలు..!

Also Read: TSPSC Group-1: ప్రశాంతంగా గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌... సివిల్స్ స్థాయిలో ప్రశ్నలు..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.    

Android Link https://bit.ly/3P3R74U 

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

 

 

Trending News