YS Viveka Case: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రకంపనలు రేపుతున్న మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో కీలక పరిణామం జరిగింది. వైఎస్ వివేకా హత్య కేసు విచారణను ఆంధ్రప్రదేశ్ నుంచి మరో రాష్ట్రానికి తరలించాలన్న వివేకా కూతురు సునితా రెడ్డి డిమాండ్ కు సీబీఐ మద్దతు తెలిపింది. తన తండ్రి హత్య కేసు విచారణను ఏపీలో కాకుండా తెలంగాణ లేదా కర్ణాటకకు మార్చాలని చాలా కాలంగా పోరాడుతోంది వైఎస్ సునీత. ఈ విషయంలోనే ఆమె కోర్టును ఆశ్రయించింది. సుప్రీంకోర్టులో పోరాడుతోంది. సునీత దాఖాలు చేసిన పిటిషన్ పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. విచారణ సందర్భంగా ఏపీలో కాకుండా మరో రాష్ట్రంలో హత్య కేసు విచారణ జరిపించాలన్న సునీత డిమాండ్ కు సీబీఐ మద్దతు తెలిపింది.
ఏపీ పోలీసులు దర్యాప్తు అధికారులను బెదిరిస్తున్నారంటూ వివేకా హత్య కేసులో సునిత చెబుతున్నంతా నిజమేనని సుప్రీంకోర్టులో సమర్పించిన అఫిడవిట్ లో సీబీఐ స్పష్టం చేసింది. వివేకా హత్య కేసు నిందితులతో రాష్ట్ర పోలీసులు కుమ్మక్కయ్యారని, వారిపై ప్రైవేట్ కేసులు పెట్టి వేధిస్తున్నారని అఫిడవిట్ లో సీబీఐ పేర్కొంది. తప్పుడు వాంగ్మూలం ఇవ్వాల్సిందిగా తనను వేధించారంటూ సీబీఐపై కేసు వేసిన ఓ పోలీసు అధికారికి ప్రమోషన్ ఇచ్చిన విషయాన్ని కోర్టులో ప్రస్తావించారు సీబీఐ న్యాయవాది. నిందితులను ఏపీ పోలీసులు తమకు వీలైనంత వరకు కేసు నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నిస్తున్నారని దర్యాప్తు సంస్థ వెల్లడించింది.
వైఎస్ వివేకా హత్య కేసును వేరే రాష్ట్రానికి ప్రత్యేకించి తెలంగాణకు మార్చాలని సునీత సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ సెప్టెంబర్లో విచారణకు వచ్చింది. ఈ కేసులో వైఎస్ సునీత తరపున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా వాదించారు. ఏపీలో సీబీఐ జరుపుతున్న దర్యాప్తుపై తమకు నమ్మకం పోయిందని చెప్పారు. స్థానిక పోలీసులు రాజకీయ నాయకులు సీబీఐ దర్యాప్తు అధికారులను బెదిరిస్తున్నారని, నిందితులు సీబీఐ అధికారులపై ప్రైవేట్ కేసులు పెట్టి సాక్షులను బెదిరిస్తున్నారని అని లూత్రా వాదించారు. హత్య కేసును విచారిస్తున్న సీబీఐ అధికారులకు భద్రత లేనందున.. తెలంగాణ తరహాలో అక్కడి హైకోర్టు పర్యవేక్షణలో ఇతర రాష్ట్రంలోని సీబీఐ కోర్టుకు దర్యాప్తును అప్పగించడం మంచిదని సూచించారు. సీబీఐ విచారణలో ఎటువంటి పురోగతి కనిపించటం లేదని తెలిపారు. కేసులో నిందితులుగా ఉన్న వారంతా బెయిల్‌పై బయటకు వచ్చి సాక్షులను బెదిరిస్తున్నారని కోర్టులో వాదించారు. ఏపీ ప్రభుత్వం కూడా ఈ కేసులో ఎలాంటి సహాయ సహకారాలు అందించడం లేదని సిద్దార్థ లూత్రా వాదనలు వినిపించారు. వాదనలు విన్న న్యాయస్థానం.. సునీత లేవనెత్తిన అంశాలపై సమాధానం చెప్పాలంటూ సీబీఐ, ఏపీ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. దీనిపై తాజాగా సీబీఐ కౌంటర్ దాఖలు చేసింది.ఈకేసు అక్టోబర్ 19న మరోసారి విచారణకు రానుంది.
Read Also: మాజీ ఎమ్మెల్యేకు సీఎం జగన్ షాక్.. వైసీపీ నుంచి సస్పెండ్.. హిట్ లిస్టులో ఇంకెవరు..?
Read Also: AICC NEW PRESIDENT: 24 ఏళ్ల తర్వాత గాంధీయేతర వ్యక్తి పగ్గాలు.. కాంగ్రెస్ చీఫ్ గా ఖర్గే ఘన విజయం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి