గత 16 రోజులుగా దేశ ప్రజల్ని హడాలెత్తిస్తున్న చమురు ధరలు 17వ రోజు తగ్గాయి. ప్రతిరోజు పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరల నుంచి వాహనదారులకు కాస్త ఉపశమనం కలిగింది. ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర 60 పైసలు, డీజిల్ ధర 56 పైసలు, ముంబయిలో లీటర్ పెట్రోల్ ధర 59 పైసలు, డీజిల్ ధర 59 పైసలు తగ్గాయి.
Petrol prices at Rs 77.83/litre in Delhi and Rs 85.65/litre in Mumbai. Diesel at Rs 68.75/litre in Delhi and Rs 73.20/litre in Mumbai. pic.twitter.com/o77sz3mrMu
— ANI (@ANI) May 30, 2018
మెట్రోపాలిటన్ నగరాల్లో బుధవారం సవరించిన పెట్రోల్ ధరలు,డీజిల్ ధరలు ఇలా ఉన్నాయి:
ప్రదేశం | పెట్రోల్/లీటర్ | డీజిల్/లీటర్ |
ఢిల్లీ | ₹ 77.83 | ₹ 68.75 |
ముంబాయి | ₹ 85.65 | ₹ 73.20 |
కోల్‌కతా | ₹ 80.47 | ₹ 71.30 |
చెన్నై | ₹ 80.80 | ₹ 72.58 |
హైదరాబాద్ | ₹ 82.45 | ₹74.73 |
జీఎస్టీ పరిధిలోకి పెట్రోల్, డీజిల్..!
ఏప్రిల్‌లో పెట్రోలియం మంత్రి ధర్మేంద్ర ప్రధాన్.. పెట్రోల్, డీజిల్‌లను జీఎస్టీ పరిధిలోకి తీసుకొచ్చేందుకు చూస్తున్నామని చెప్పిన సంగతి తెలిసిందే..! కొంతమంది ఆర్థిక నిపుణులతో కేంద్రం దీనిపై ఒక నివేదికను తయారుచేయమని ఆదేశించగా.. వీరు పెట్రోల్, డీజిల్‌లను జీఎస్టీ పరిధిలోకి తెచ్చి ఇప్పుడున్న గరిష్ట స్లాబ్ 28 శాతాన్ని వీటికి విధించడం ద్వారా నేరుగా పెట్రోల్, డీజిల్ తదితరాలను కేంద్రం తన అధీనంలోకి తెచ్చుకోవాలని సూచించారు. అలాగే పెట్రోల్ లీటర్ గరిష్టంగా 60 రూపాయలు, డీజిల్ 50 రూపాయలు మాత్రమే ఉండేలా కేంద్రం చర్యలు తీసుకోవాలని కూడా నివేదించారు. త్వరలోనే దీనిపై కేంద్రం నుంచి స్పష్టమైన నిర్ణయం వెలువడే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.