Anushka Sharma looks very hot in Green Saree on the eve of Diwali 2022: 1988 మే 1న అనుష్క శర్మ జన్మించారు. సైనిక పాఠశాలలో ప్రాథమిక విద్యను పూర్తిచేసిన అనుష్క.. బెంగుళూరులోని మౌంట్ కార్మల్ కళాశాలలో ఉన్నత విద్య పూర్తి చేశారు.
మోడలింగ్‌తో కెరీర్ ఆరంబించిన అనుష్క శర్మ.. లాక్మే ఫ్యాషన్ వీక్‌లో మెరుపులు మెరిపించారు. సిల్క్ అండ్ షైన్, విస్పర్, నాదెళ్ల జ్యూయలరీ, ఫియట్ పాలియో లాంటి బ్రాండ్లకు ఆమె మెడల్‌గా వ్యవహరించారు.
అనుష్క శర్మ టాలెంట్ గుర్తించిన యష్ చోప్రా.. బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ సరసన 'రబ్ నే బనాదీ జోడీ' సినిమాలో ఆమెకు అవకాశం ఇచ్చారు. ఆ సినిమాలో ఆమె నటనకు విమర్శకుల నుంచి ప్రశంసలు దక్కాయి.
యష్ రాజ్ ఫిల్మ్స్ సంస్థలో వచ్చిన బద్మాష్ కంపెనీ, బ్యాండ్ బాజా బారాత్ సినిమాల్లో అనుష్క శర్మ నటించారు. 'జబ్ తక్ హై జాన్' చిత్రంలో ఆమె ప్రదర్శించిన నటనకు బాలీవుడ్ దాసోహమంది.
లేడీస్ వర్సెస్ విక్కీ బెహల్, మట్రూకీ బిజిలీకా మండోలా, పటియాలా హౌస్, పీకే, బాంబే వెల్వెట్, సుల్తాన్, పారి, జీరో, సంజు లాంటి సినిమాలతో అనుష్క శర్మ తన ప్రతిభ నిరూపించుకున్నారు.
2017లో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీని పెళ్లి చేసుకున్న తర్వాత అనుష్క శర్మ సినిమాలు చేయడం లేదు. ఆమెకు వామికా అనే కూతురు ఉంది.
దీపావళి పండగ నేపథ్యంలో అనుష్క శర్మ గ్రీన్ శారీలో తళుక్కుమన్నారు. అచ్చు దేవకన్యలా మెరిసిపోతున్నారు. విరాట్ కోహ్లీ చాలా లక్కీ అంటూ నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు.
Also Read: టీ20 ప్రపంచకప్ 2022లో కరోనా కలకలం.. స్టార్ బౌలర్‌కు పాజిటివ్!
Also Read: భారత్ చీట్ చేసి గెలిచింది.. పాకిస్తాన్ మాజీలు, అభిమానులకు కౌంటర్ ఇచ్చిన దిగ్గజ అంపైర్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి