MP Ranjith Reddy: బీజేపీలో చేరికపై క్లారిటీ ఇచ్చిన ఎంపీ రంజిత్ రెడ్డి

MP Ranjith Reddy: సంస్థాన్ నారాయణపురం మండలంలోని వాయిళ్లపల్లి ఎంపీటీసీ పరిధికి ఇంచార్జ్ గా రంజిత్ రెడ్డిని పార్టీ నియమించింది.అయితే మిగితా నేతలంతా తమకు కేటాయించిన గ్రామాల్లో ఉండి ప్రచారం చేస్తుండగా.. రంజిత్ రెడ్డి మాత్రం వాయిళ్లపళ్లి వెళ్లడం లేదు. దీంతో ఆయన పార్టీ జంప్ చేయడం ఖాయమని అంతా అనుకున్నారు

Written by - Srisailam | Last Updated : Oct 25, 2022, 06:06 PM IST
  • ఎంపీ రంజిత్ రెడ్డి పార్టీ మారుతారంటూ ప్రచారం
  • తనపై వస్తున్న వార్తలపై స్పందించిన రంజిత్ రెడ్డి
  • తాను టీఆర్ఎస్ పార్టీని వీడేది లేదని క్లారిటీ
 MP Ranjith Reddy: బీజేపీలో చేరికపై  క్లారిటీ ఇచ్చిన ఎంపీ రంజిత్ రెడ్డి

MP Ranjith Reddy: తెలంగాణలో ఆపరేషన్ ఆకర్ష్ జోరుగా సాగుతోంది. నేతల చేరికల విషయంలో టీఆర్ఎస్, బీజేపీ మధ్య పోటాపోటీ నెలకొంది. భువనగిరి మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ బీజేపీ లో చేరారు. కమలానికి కౌంటర్ గా శాసనమండలి చైర్మెన్ స్వామిగౌడ్, మాజీ ఎమ్మెల్యే బిక్షమయ్య గౌడ్, దాసోజు శ్రవణ్ కుమార్ కారెక్కారు. వలసలతో జోష్ మీదున్న కారు పార్టీకి బీజేపీకి కౌంటర్ ప్లాన్ వేసిందని.. చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి త్వరలో బీజేపీలో చేరనున్నారనే వార్తలు వస్తున్నాయి. గులాబీ లీడర్లంతా మునుగోడు ప్రచారంలో ఉండగా రంజిత్ రెడ్డి అక్కడ కనిపించడం లేదు. సంస్థాన్ నారాయణపురం మండలంలోని వాయిళ్లపల్లి ఎంపీటీసీ పరిధికి ఇంచార్జ్ గా రంజిత్ రెడ్డిని పార్టీ నియమించింది. అయితే మిగితా నేతలంతా తమకు కేటాయించిన గ్రామాల్లో ఉండి ప్రచారం చేస్తుండగా.. రంజిత్ రెడ్డి మాత్రం వాయిళ్లపళ్లి వెళ్లడం లేదు. దీంతో ఆయన పార్టీ జంప్ చేయడం ఖాయమని అంతా అనుకున్నారు.

పార్టీ మారుతానంటూ  తనపై జరుగుతున్న ప్రచారంపై స్పందించారు ఎంపీ రంజిత్ రెడ్డి. పార్టీ మార్పుపై ప్రకటన చేశారు. తాను టీఆర్ఎస్ పార్టీని వీడేది లేదని చెప్పారు ఎంపీ రంజిత్ రెడ్డి. తన కాలికి తీవ్ర గాయం కావడం వల్లే మునుగోడు ఎన్నికల ప్రచారంలో  ప్రత్యక్షంగా పాల్గొనలేకపోతున్నానని చెప్పారు. తాను అక్కడికి వెళ్లకపోయినా.. ప్రతి రోజు అక్కడున్న టీఆరెస్ నాయకులు, కార్యకర్తల తో ఫోన్ లో మాట్లాడుతున్నానని చెప్పారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు పనిచేస్తూ టీఆరెస్ పార్టీ గెలుపు కొరకు కృషి చేస్తున్నానని తెలిపారు. మునుగోడు లో అన్ని సర్వేలు టీఆరెస్ పార్టీ కి పాజిటివ్ గా ఉన్నాయ్ననారు. మునుగోడు గడ్డపై గులాబీ జెండా ఎగరడం  ఖాయమని రంజిత్ రెడ్డి ధీమా ధీమా వ్యక్తంచేశారు.

తన కాలికి గాయం తగ్గాలంటే మరో వారం రోజులు నడవకూదడని డాక్టర్లు సూచించారని చెప్పారు రంజిత్ రెడ్డి. అందువల్లే మునుగోడుకి ప్రత్యక్షంగా రాలేకపోతున్నాను తప్ప మరొ కారణం లేదని స్పష్టం చేశారు.సోషల్ మీడియాలో తనపై వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదన్నారు రంజిత్ రెడ్డి.  ఎల్లప్పుడూ సీఎం కేసీఆర్ నాయకత్వంలొనే  పని చేస్తానని ఆయన ప్రకటన విడుదల చేశారు.కొందరు పని గట్టుకొని  తనపై చేస్తున్న ఆరోపణలను, పుకార్లను నమ్మవద్దని పార్టీ కేడర్ కు సూచించారు, తెలంగాణ రాష్ట్ర పౌల్ట్రీ రైతులు, ఇండస్ట్రీ ఎల్లప్పుడూ సీఎం కేసీఆర్ వైపే ఉంటుందని చెప్పారు. మునుగోడు  పౌల్ట్రీ పార్మర్స్ తో ఎప్పటికప్పుడు ఫోన్ లో మాట్లాడుతున్నానని తెలిపారు.

Also Read : Revanth Reddy: కాంగ్రెస్ అంతానికి టీఆర్ఎస్, బీజేపీ కుట్ర! మునుగోడు రావాలని కేడర్ కు రేవంత్ రెడ్డి పిలుపు

Also Read : Munugode Bypoll: రాజగోపాల్ రెడ్డిపై దాడుల వెనుక ఎవరున్నారు? మునుగోడులో ఏం జరుగుతోంది?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News