టీ20 ప్రపంచకప్‌లో ఇంగ్లండ్ వంటి అగ్రగామి జట్టుని క్రికెట్‌లో పసికూన ఐర్లాండ్ మట్టికరిపించడం సంచలనంగా మారింది. మరోవైపు ఇదే జట్టు ఆటగాడు ఇప్పుడు వార్తల్లో నిలుస్తున్నాడు.ఆ వివరాలు మీ కోసం..
వర్షం కారణంగా మ్యాచ్‌కు అంతరాయం కలగడంతో..డక్‌వర్త్ లూయిస్ విధానంలో ఐర్లాండ్ జట్టు..ఇంగ్లండ్‌పై 5 పరుగుల తేడాతో విజయం నమోదు చేసింది. ఐర్లాండ్ జట్టులో ఆఫ్ స్పిన్ ఆల్ రౌండర్ సిమీ సింహ్ చర్చనీయాంశమౌతున్నాడు. పొట్టకూటి కోసం ఒకప్పుడు టాయ్‌లెట్స్ శుభ్రం చేసిన సిమీ సింహ్..ఐర్లాండ్ జట్టులో కీలక ఆటగాడు.
సిమీ సింహ్ వాస్తవానికి భారత మూలాలు కలిగిన ఆటగాడు. 35 ఏళ్ల సిమీ సింహ్..పంజాబ్‌లోని బఠ్లానాకు చెందినవాడు. సిమీ సింహ్..టీమ్ ఇండియాకు ఆడాలనుకున్నాడు. కానీ సాధ్యం కాలేదు. ఆ తరువాత ఐర్లాండ్‌కు వలస వెళ్లిపోయాడు. ఓ స్నేహితుడి పిలుపు మేరకు ఐర్లాండ్‌కు స్డూడెంట్ వీసాపై వెళ్లాడు.
ఐర్లాండ్‌లో ఉండటం సిమీ సింహ్‌కు అంత సులభం కాలేదు. ఒకానొక సమయంలో ఒక స్టోర్‌లో పార్ట్‌టైమ్ ఉద్యోగం చేసేవాడినని..ఆఖరికి టాయ్‌లెట్లు కూడా శుభ్రం చేశానని ఓ ఇంటర్వ్యూలో సిమీ సింహ్ చెప్పుకొచ్చాడు. ఓ వైపు ఇలా చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటూనే క్రికెట్‌పై కూడా ఫోకస్ పెట్టాడు. 2017లో ఐర్లాండ్ జట్టు కోసం లిస్ట్ ఎ క్రికెట్ ఆడటం ప్రారంభించాడు. ఆ తరువాత ఇక వెనుదిరిగి చూడలేదు.
2020లో సిమీ సింహ్..ఐర్లాండ్ తరపున అంతర్జాతీయ క్రికెట్‌లో ఆరంగేట్రం చేశాడు. న్యూజిలాండ్‌తో జరిగిన టీ20 ఇంటర్నేషనల్ మ్యాచ్‌తో క్రికెట్ ఎంట్రీ ఇచ్చాడు. 8వ స్థానంలో దిగి..హాప్ సెంచరీ రికార్డు నెలకొల్పాడు. సిమీ సింహ్ ఇప్పటివరకూ 35 వన్డేలు, 53 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. ఇందులో వన్డేల్లో 39, టీ20ల్లో 44 వికెట్లు సాధించాడు.
Also read: India vs Netherlands: మరి కాసేపట్లో నెదర్లాండ్స్‌తో టీమిండియా పోరు.. వీళ్లపైనే అందరి కళ్లు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook