Varasudu Business Details: షాకిస్తున్న వారసుడు బిజినెస్ డీటైల్స్.. ఎన్ని కోట్లకు అమ్మారంటే?

Varasudu Theatrical Business:  దిల్ రాజు ప్రొడక్షన్లో వంశీ పైడిపల్లి డైరెక్షన్లో రూపొందిన  విజయ్ వారసుడు సినిమా హక్కులు 140 కోట్ల దాకా పలికే అవకాశం ఉందనిటాలీవుడ్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఆ వివరాల్లోకి వెళితే 

Written by - Chaganti Bhargav | Last Updated : Oct 30, 2022, 02:46 PM IST
Varasudu Business Details: షాకిస్తున్న వారసుడు బిజినెస్ డీటైల్స్.. ఎన్ని కోట్లకు అమ్మారంటే?

Varasudu Theatrical Business: ఈ మధ్య కాలంలో ఒక భాషకు సంబంధించిన డైరెక్టర్లు మరో భాష హీరోలతో ఒక భాషకు సంబంధించిన హీరోలు మరో భాష డైరెక్టర్లతో సినిమాలు చేస్తున్న దాఖలాలు ఎక్కువయ్యాయి. అలాంటి వాటిలో విజయ్ వారసుడు సినిమా కూడా ఒకటి. తమిళంలో స్టార్ హీరో అయిన దళపతి విజయ్ తో తెలుగు డైరెక్టర్ వంశీ పైడిపల్లి ఒక సినిమా ప్లాన్ చేశారు. దిల్ రాజు ప్రొడక్షన్లో ఈ సినిమాని అనౌన్స్ చేయడమే కాక వారసుడు అని తెలుగులో వారిసు అంటూ తమిళంలో విడుదల చేసేందుకు రంగం సిద్ధం చేశారు.

రష్మిక మందన హీరోయిన్ గా నటించిన ఈ సినిమాను భారీ బడ్జెట్ తో రూపొందించారు దిల్ రాజు. ఇక ఈ సినిమాని సంక్రాంతి సందర్భంగా విడుదల చేస్తున్నట్లు ఇప్పటికే అధికారికంగా సినిమా యూనిట్ ప్రకటించింది. అయితే సినిమా విడుదల విషయం మీద ఇంకా సందిగ్ధత కొనసాగుతోంది. దానికి కారణం ఈ సినిమాతో పాటు మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య, నందమూరి బాలకృష్ణ నటించిన వీర సింహారెడ్డి, ప్రభాస్ హీరోగా నటించిన ఆది పురుష్ వంటి సినిమాలు కూడా విడుదలకు సిద్ధమవడమే కాక వీటికి తోడు ఏజెంట్ అంటూ అఖిల్ కూడా ఒక సినిమాతో వస్తున్నారు.

కానీ ఇన్ని సినిమాలు సంక్రాంతికి విడుదలవుతాయా? అంటే ఎవరు ఏమీ చెప్పలేని పరిస్థితి. ఎందుకంటే రెండు మూడు సినిమాలు విడుదలయితేనే ధియేటర్లను మేనేజ్ చేయడం చాలా కష్టం, అలాంటిది ఇప్పుడు ఏకంగా ఇన్ని సినిమాలు విడుదలవుతూ ఉండడం కాస్త ఇబ్బందికరమైన విషయమే. అయితే వారసుడు హక్కులు మాత్రం ఒకరకంగా షాక్ కలిగిస్తున్నాయి. ఏకంగా సినిమా హక్కులు 140 కోట్ల దాకా పలికే అవకాశం ఉందని అంటున్నారు.

ఈ సినిమా రెండు బాషల ఓవర్సీస్ హక్కులు 35 కోట్లకు అమ్ముడయ్యాయి. అలాగే తమిళ నాడులో తమిళ హక్కులు 72 కోట్ల రేంజ్‌లో ముగుస్తాయని, కేరళ, కర్నాటక రాష్ట్రాలకు కలిపి 15 కోట్ల వ్యాపారం జరుగుతుందని అంచనాలు ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లో సాధారణంగా విజయ్ సినిమాలు 10కోట్ల రేంజ్ లో బిజినెస్ చేసే పరిస్థితి ఉంటుంది,  వంశీ పైడిపల్లి దర్శకుడు, దిల్ రాజు నిర్మాత కావడంతో మరో 50% ఎక్కువ మార్కెట్ చేస్తుందని అంచనా.  
Also Read: Brahmaji Counter: అనసూయ ‘ఆంటీ’ని వదలని బ్రహ్మాజీ.. ప్రభాస్ ను కూడా వాడేసుకున్నాడుగా!

Also Read: Puri Jagannadh Open Letter : పూరి భార్యాపిల్లల ఫోటోలు షేర్ చేసిన బండ్ల గణేష్.. ఓపెన్ లెటర్ మీద బండ్లన్న ట్వీట్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News