ప్రముఖ మలయాళీ నటుడు మోహన్ లాల్, యంగ్ టైగర్ ఎన్టీఆర్‌కి సవాల్ విసిరారు. ‘హమ్ ఫిట్‌తో ఇండియా ఫిట్’ ఛాలెంజ్‌లో భాగంగా మోహన్ లాల్ హీరోలు ఎన్టీఆర్, సూర్యలకు ట్యాాగ్ చేస్తూ పోస్టు పెట్టారు. వారికి ఫిట్నెస్ ఛాలెంజ్ ఇచ్చారు. ఈ ఛాలెంజ్ ప్రక్రియను తొలుత కేంద్ర మంత్రి రాజ్యవర్థన్ సింగ్ రాథోడ్ ప్రారంభించారు. ఆయన హృతిక్ రోషన్, సైనా నెహ్వాల్, విరాట్ కోహ్లీలకు సవాల్ విసిరారు.
తర్వాత ఇదే ఛాలెంజ్‌ను ప్రధాని మోదీ కూడా తీసుకున్నారు. టాలీవుడ్ తారలలో ఇప్పటికి సమంత, నాగచైతన్య, సుశాంత్, బెల్లంకొండ శ్రీనివాస్, లావణ్య త్రిపాఠి మొదలైన వారు ఈ ఛాలెంజ్‌లో పాల్గొన్నారు. తాజాగా మోహన్ లాల్ కూడా ఈ ఛాలెంజ్‌ను ఎన్టీఆర్‌కి ఇచ్చారు. మరి తారక్ ఈ ఛాలెంజ్ తీసుకుంటారో లేదో తెలియాలంటే వేచి చూడాల్సిందే.
Accepting #FitnessChallenge from @Ra_THORe for #HumFitTohIndiaFit. I invite @Suriya_offl @tarak9999 @PrithviOfficial to join #NewIndia - a healthy India. pic.twitter.com/CVcK2VFArf
— Mohanlal (@Mohanlal) May 30, 2018