Komatireddy Venkat Reddy: తెలంగాణ కాంగ్రెస్ లో కీలక పరిణామం జరగబోతోంది. పార్టీ సీనియర్ నేత, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిపై వేటుకు రంగం సిద్దమవుతోంది. ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డికి మరోసారి షోకాజ్ నోటీసు ఇచ్చింది ఏఐసిసి క్రమశిక్షణ కమిటీ. గత నెల 22వ తేదీన కోమటిరెడ్డి కి షోకాస్ నోటీసు పంపింది ఏఐసీసీ క్రమశిక్షణ కమిటీ. 10 రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆదేశించింది. ఏఐసీసీ ఇచ్చిన గడువు నవంబర్ 1తో ముగిసింది. అయినా ఎలాంటి రిప్లయ్ ఇవ్వలేదు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. నోటీసు తమకు అందలేదని, ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి విదేశీ పర్యటనలో ఉన్నారని అందువల్ల తాము నోటీసుని అందుకోలేకపోయామని ఏఐసిసి క్రమశిక్షణ కమిటీకి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కార్యాలయ వర్గాలు తెలిపాయి. దీంతో మరోసారి నోటీసు ఇచ్చింది ఏఐసీసీ క్రమశిక్షణా సంఘం. తాజాగా ఇచ్చిన నోటీసుకు కోమటిరెడ్డి స్పందించకపోతే పార్టీ నుంచి సస్పెండ్ చేసే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.
తెలంగాణ కాంగ్రెస్ స్టార్ క్యాంయినర్ గా ఉన్నారు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. స్టార్ క్యాంపెయినర్ గా ఉన్న కోమటిరెడ్డి.. అత్యంత కీలకమైన మునుగోడు ఉప ఎన్నిక ప్రచారానికి దూరంగా ఉన్నారు. తన తమ్ముడు రాజగోపాల్ రెడ్డి మునుగోడు నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేయడంతో.. తమ్ముడికి వ్యతిరేకంగా ప్రచారం చేయేలేకే వెంకట్ రెడ్డి మునుగోడు వెళ్లలేదనే వార్తలు వచ్చాయి. అయితే మునుగోడు ప్రచారానికి వెళ్లకపోవడమే కాదు... అక్కడి కాంగ్రెసి నేతలు వెంకట్ రెడ్డి ఫోన్ చేసి బీజేపీకి మద్దతు ఇవ్వాలని కోరినట్లు ఆరోపణలు వచ్చాయి. ఇందుకు సంబంధించి కొందరు కాంగ్రెస్ లీడర్లతో ఎంపీ వెంకట్ రెడ్డి మాట్లాడిన ఆడియోలు లీకయ్యాయి.
మునుగోడుకు చెందిన కాంగ్రెస్ నత జబ్బార్ కు ఫోన్ చేసిన ఎంపీ కోమటిరెడ్డి.. తన సోదరుడు రాజగోపాల్ రెడ్డికి మద్దతు తెలపాలని కోరినట్లు లీకైన ఆడియోలో ఉంది. కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతికి మద్దతు తెలపకుండా బీజేపీ అభ్యర్థికి ఓట్లేయాని చెప్పడం కాంగ్రెస్ పార్టీలో కలకలం రేపింది. ఈ ఘటనపై పార్టీ తెలంగాణ ఇంచార్జ్ మాణికం ఠాగూర్ తీవ్రంగా స్పందించారు. ఏఐసీసీ క్రమశిక్షణా సంఘానికి ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన కాంగ్రెస్ డిసిప్లీనరీ యాక్షన్ కమిటీ కార్యదర్శి ఎంపీ వెంకట్ రెడ్డికి నోటీసులు జారీ చేశారు. క్రమశిక్షణా ఉల్లంఘన చర్యకు పాల్పడిన మీపై మీపై ఎందుకు చర్యలు తీసుకోరాదో 10 రోజుల్లోగా సమాధానం ఇవ్వాలని నోటీసులో ఆదేశించారు. అయితే గడువు ముగిసినా ఎంపీ కోమటిరెడ్డి ఎలాంటి వివరణ ఇవ్వలేదు. దీంతో మునుగోడు బైపోల్ ముగిసిన వెంటనే చర్యలకు ఉపక్రమించింది ఏఐసీసీ. ఈసారి కూడా కోమటిరెడ్డి స్పందించకపోతే.. ఆయనపై సీరియస్ చర్యలు ఉంటాయని తెలుస్తోంది.
Read Also: Koppula Eshwer: ప్రగతి భవన్ లో దళిత మంత్రికి ఘోర అవమానం.. తన పక్కన కూర్చోనివ్వని కేసీఆర్?
Read Also: సబ్బు పెట్టిమరీ.. బట్టలు ఉతుకుతున్న కోతి! రన్నింగ్ కామెంటరీ వింటే నవ్వాగదు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook