Mangal Vakri 2022: వేద జ్యోతిషశాస్త్రంలో కుజుడు గ్రహాల అధిపతిగా పరిగణిస్తారు. అంగారకుడి ప్రభావం వల్ల మనిషికి ధైర్యం, బలం, శక్తి లభిస్తాయి. హిందూ క్యాలెండర్ ప్రకారం, అక్టోబరు 30న కుజుడు మిథునరాశిలో (Mangal Vakri in Gemini 2022) తిరోగమించాడు. దీంతో కుజుడు సంచారం వల్ల నాలుగు రాశులవారి బాధలు పెరుగుతాయి. ఆ అన్ లక్కీ రాశులేంటో తెలుసుకుందాం.
మేషరాశి (Aries)- మేష రాశి వారికి లగ్నముతో పాటుగా అష్టాధిపతి అంగారకుడు. కుజుడు ఈ రాశి యొక్క రెండవ ఇంటిలో అంటే ప్రసంగం మరియు కుటుంబ గృహంలో సంచరిస్తాడు. కుజుడు సంచారం వల్ల మీ కుటుంబంలో విభేదాలు తలెత్తవచ్చు. ఆకస్మిక ధన నష్టం సంభవించవచ్చు.
మిథునరాశి (Gemini)- మిథున రాశి వారికి కుజుడు లాభ మరియు ఋణ గృహాలకు అంటే 11వ మరియు 6వ గృహాలకు అధిపతిగా పరిగణించబడతాడు. మీ రాశిచక్రం యొక్క మూడవ, ఆరవ మరియు ఏడవ ఇంటిలో కుజుడు తిరోగమన స్థితిలో సంచరిస్తాడు. దీని కారణంగా మీ సోదరుడితో విభేదాలు వచ్చే అవకాశం ఉంది. ఇదే సమయంలో మీ జీవిత భాగస్వామి యొక్క భావాలను నిర్లక్ష్యం చేయవద్దు. పెట్టుబడికి సమయం అనుకూలంగా లేదు.
తులారాశి (Libra)- తుల రాశి వారికి కుజుడు సప్తమ మరియు రెండవ ఇంటికి అధిపతి అయినందున, ఎనిమిదవ ఇంట్లో తిరోగమనంలోకి ప్రవేశిస్తాడు. మీ రాశిచక్రంలోని కుజుడు యొక్క పూర్తి దృష్టి 11వ, 2వ మరియు 3వ ఇంట్లో ఉండబోతోంది. దీంతో మీరు కొంత ఆకస్మిక నష్టాన్ని చవిచూసే అవకాశం ఉంది. ఈ సమయంలో ఎవరినీ నమ్మవద్దు.
మకరం(Capricorn) - మకర రాశి వారికి అంగారకుడు నాల్గవ మరియు పదకొండవ గృహాలకు అధిపతిగా పరిగణించబడతాడు. మీ ఐదవ ఇంట్లో కుజుడు సంచరిస్తాడు. మీ రాశిచక్రంలోని ఎనిమిదవ, పదకొండవ మరియు పన్నెండవ ఇంట్లో అంగారకుడి దృష్టి ఉంటుంది. ఈ సమయంలో మీరు మీ పిల్లల వైపు నుండి ఇబ్బంది పడవచ్చు. డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి.
Also Read: Shani Dev: ఈ 5 రాశుల వారిపై శనిదేవుని అనుగ్రహం... జనవరి 17 వరకు వీరికి డబ్బే డబ్బు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook