Bigg Boss 6 Nominations List : నామినేషన్స్ హీట్.. మారని శ్రీహాన్, సత్య.. ఈ సారి మూడేది ఎవరికి?

Bigg Boss 6 Telugu 10th Week Nominations బిగ్ బాస్ ఇంట్లో పదోవారంలో నామినేషన్ హీట్ మరింతగా పెరిగేట్టు కనిపిస్తోంది. ఈ వారం కూడా ఇనయే టార్గెట్ అయినట్టుగా కనిపిస్తోంది. రేవంత్ మళ్లీ ట్రాక్ తప్పేసినట్టుగా ఉన్నాడు.

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 7, 2022, 12:36 PM IST
  • బిగ్ బాస్ ఇంట్లో పదోవారం రచ్చ
  • నామినేషన్స్‌లో మళ్లీ ఇనయే టార్గెట్
  • అతి చేస్తోన్న శ్రీహాన్, శ్రీ సత్య
Bigg Boss 6 Nominations List : నామినేషన్స్ హీట్.. మారని శ్రీహాన్, సత్య.. ఈ సారి మూడేది ఎవరికి?

Bigg Boss 6 Telugu 10th Week Nominations : బిగ్ బాస్ ఇంట్లో పదోవారం నామినేషన్స్ హీట్ బాగానే పెరిగింది. ఇప్పటికే తొమ్మది మంది కంటెస్టెంట్లు బయటకు వెళ్లారు. షానీ, అభినయ, నేహా, ఆరోహి, చంటి, సుదీప, అర్జున్, సూర్య, గీతూ ఇలా అందరూ బయటకు వచ్చారు. ఈ ఎలిమినేషన్లంటిలోనూ కాస్త షాకింగ్‌గా గీతూ ఎలిమినేషన్ జరిగింది. అయితే ఇప్పుడు మాత్రం పదో వారంలో బిగ్ బాస్ ఇంటి నుంచి బయటకు వచ్చే కంటెస్టెంట్ మీద అందరి దృష్టి పడేది. మామూలుగా అయితే గత వారమే సత్య ఎలిమినేట్ అవ్వాల్సింది.

కానీ సత్య తృటిలో తప్పించుకుంది. గీతూ ఎలిమినేట్ అయింది. ఈ వారంలో నామినేషన్స్‌లో రేవంత్, ఇనయ, శ్రీహాన్, ఆదిరెడ్డి,మెరినా, వాసంతి, ఫైమా, కీర్తి, ఆదిత్య ఉన్నారు. కెప్టెన్ అయిన కారణంగా సత్య నామినేషన్లోకి రాలేదు. లేదంటే ఆమె నామినేషన్లోకి వచ్చేది.. ఈ వారం ఎలిమినేట్ అయి ఉండేది.

సత్య అలా ఎలిమినేషన్ నుంచి తప్పించుకున్నట్టుగా అయింది. అయితే శ్రీహాన్ ఈ మధ్య ఓవర్ యాటిట్యూడ్ చూపిస్తున్నాడు. తన బాడీ లాంగ్వేజ్ కూడా చాలా దారుణంగా ఉంటోంది. ఇనయతో మాట్లాడే సమయంలో శ్రీహాన్ అందరికీ చిరాకు తెప్పిస్తున్నాడు. కీర్తి విషయంలోనూ అలానే మాట్లాడుతున్నాడు. ఇక ఇనయతో ఉన్న గొడవలు శ్రీహాన్‌కే బ్యాడ్ అవుతున్నాయి. శ్రీహాన్‌, శ్రీ సత్యలు కలిసి చేసే పనులు, వెక్కిరింతలు మరింతగా నెగెటివ్ ఇమేజ్ తీసుకొస్తున్నాయి.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News