Shukra Gochar November 2022: ఈ నెలలో కొన్ని ముఖ్యమైన గ్రహాల సంచారం ఉంది. అందులో ఒకటి శుక్రుడు రాశి మార్పు. ప్రేమ, ఆనందం, సంపద, ఆకర్షణ మరియు లగ్జరీ లైఫ్ కు కారకుడు శుక్రుడు. అంతేకాకుండా వృషభం మరియు తులరాశికి అధిపతి. ఆస్ట్రాలజీ ప్రకారం, నవంబరు 11న శుక్రుడు తులరాశి నుంచి వృశ్చిక రాశిలోకి (Venus transit in Scorpio 2022) ప్రవేశించనున్నాడు. శుక్రుడి రాశి మారడం వల్ల కొన్ని రాశులవారికి కష్టాలు పెరగనున్నాయి. ఆ దురదృష్ట రాశులేంటో తెలుసుకుందాం.
మిథున రాశి (Gemini): శుక్రుని రాశిలో మార్పు వల్ల ఈరాశివారు కొన్ని సమస్యలను ఎదుర్కోవల్సి రావచ్చు. మీ ఆరోగ్యం చెడిపోతుంది. సడన్ గా విహారయాత్రకు వెళ్లే అవకాశం ఉంది. డబ్బు దుబారా అవుతుంది. ఈ రాశి యెుక్క ఆరో ఇంట్లో శుక్రుడు సంచరించనున్నాడు.
తులారాశి (Libra): తుల రాశి వారు ఈ కాలంలో బెట్టింగ్ మొదలైన వాటికి దూరంగా ఉండాలి, లేకుంటే ఇబ్బందుల్లో పడవచ్చు. ఆకస్మిక ధననష్టం ఉంటుంది. ఈ రాశి యెుక్క రెండో ఇంట్లో శుక్రుడు సంచరించనున్నాడు.
కర్కాటకం (Cancer): ఈ రాశికి చెందిన వారు శుక్రుని సంచారం వల్ల ఇబ్బందుల్లో పడతారు. ఉద్యోగ, వ్యాపారాల్లో నష్టాలు చవిచూస్తారు. ఈరాశి యెుక్క ఐదో ఇంట్లో శుక్రుడు సంచరించనున్నాడు.
మేషరాశి (Aries): వీరు అనారోగ్యం బారిన పడే అవకాశం ఉంది. కాబట్టి ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించండి. వీలైనంత వరకు ఇంట్లో వండిన ఆహారాన్ని మాత్రమే తినండి.
వృశ్చిక రాశి (Scorpio): వృశ్చిక రాశి వారికి ఈ కాలంలో ఖర్చులు పెరుగుతాయి. దీని వల్ల కొన్ని ఆర్థిక సమస్యలు కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ రాశి యెుక్క జాతకంలో మొదటి ఇంట్లో శుక్రుడు సంచరిస్తాడు.
ధనుస్సు రాశి (Sagittarius): ఈ రాశివారు తమ కోరికలను నెరవేర్చుకోవడానికి ఎక్కువ డబ్బు ఖర్చు చేయవచ్చు, దీని కారణంగా వారు రాబోయే కాలంలో ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోవలసి ఉంటుంది. సంచార సమయంలో శుక్రుడు మీ జాతకంలో పన్నెండవ ఇంట్లో ఉంటాడు.
Also Read: Shukra Gochar 2022: శుక్రుడి 'లక్ష్మీనారాయణ యోగం'... ఈ 3 రాశుల వారికి ప్రత్యేక ప్రయోజనం..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook