ఇంటర్నెట్‌లో చూసి తుపాకీ తయారీ ! యువకుడి అరెస్ట్

                                                                                

Last Updated : Jun 4, 2018, 03:52 PM IST
ఇంటర్నెట్‌లో చూసి తుపాకీ తయారీ !  యువకుడి అరెస్ట్

ఇంటర్నెట్‌ లో వంటకాలు తయారు చేయడం సర్వసాధరణం. అయితే ఓ యువకుడు ఏకంగా  తుపాకీనే తయారు చేశాడు. అంతటితో ఊరుకున్నాడా..తన గది పక్కన ఒక రౌండ్‌ గోడకు కాల్పులు జరిపి తుపాకీ పని తీరును టెస్ట్ చేశాడు. సక్సెస్ అవడంతో  ఓ కల్లు దుకాణం వద్ద తుపాకీని నేలకు పెట్టి ఒక రౌండ్‌ కాల్పులు జరిపాడు. దీంతో జనం ప్రాణ భయంతో పరుగులు తీశారు. కాగా స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో యువకుడిని అదుపులోకి తీసుకున్నారు

ఇతగాడి నేపథ్యం..
పోలీసుల ఇచ్చిన సమాచారం ప్రకారం... విజయనగరం జిల్లా బాడంగి మండలం కోడూర్‌కు చెందిన రమేశ్ ‌ ఐటీఐ పూర్తి చేశాడు. ఉపాధి కోసం మెదక్‌ జిల్లా మనోహరాబాద్‌ మండలం రామాయపల్లిలో స్థిరపడ్డాడు.  స్థానికంగా ఉండే  ఓ పరిశ్రమలో ఎలక్ట్రీషియన్‌గా పని చేస్తున్నాడు. అతనికి పరిశ్రమలో ఉండే ఇనుప పరికరాలతో ఓ నాటు తుపాకీని తయారు చేయాలనే ఆలోచన తట్టింది. ఇంటర్నెట్ లోని వీడియోల ఆధారంగా నాటు తుపాకీతోపాటు మూడు తూటాలనూ తయారు చేశాడు. 

Trending News