Saturn Transit 2023: ఆస్ట్రాలజీలో శనిదేవుడిని (Shani Dev) పాపగ్రహంగా పరగణిస్తారు. మనం చేసే మంచి చెడులను బట్టి ఫలాలను ఇచ్చేవాడు శనిదేవుడు. అందుకే శనిదేవుడిని న్యాయదేవుడు, కర్మదాత అని పిలుస్తారు. శని అనుగ్రహం ఉన్నవారికి దేనికీ లోటు ఉండదు. అదే శని ఆగ్రహానికి గురి అయితే వారు అనేక సమస్యలను ఎదుర్కోంటారు. దీని ప్రభావం మెుత్తం 12 రాశులవారిని ప్రభావితం చేస్తుంది. దీంతో కొన్ని రాశులవారు శని సడేసతి మరియు ధైయా నుండి విముక్తి పొందగా.. మరికొందరిపై ఇది కొనసాగుతోంది.
శనిదేవుడు చాలా నెమ్మదిగా కదులుతాడు. ఇతడు ఒక రాశి నుంచి మరో రాశికి వెళ్లేందుకు రెండున్నరేళ్ల సమయం పడుతుంది. ప్రతి వ్యక్తి తన జీవితంలో ఒక్కసారైనా సడేసతి మరియు ధైయాను ఎదుర్కోవల్సి ఉంటుంది. వచ్చే ఏడాది శనిదేవుడు జనవరి 17, 2023న కుంభరాశిలోకి ప్రవేశించబోతున్నాడు. ఈరాశి మార్పు మెుత్తం 12 రాశులవారిపై మంచి, చెడు ప్రభావం ఉంటుంది.
కుంభరాశిలో శని సంచారం వల్ల మిథున, తుల, ధనస్సు రాశి వారిపై శనిసడేసతి మురియు ధైయా తొలగిపోతుంది. మీనం, మకర, కుంభరాశులపై శని సడేసతి మరియు కర్కాటకం, వృశ్చికం రాశులపై ధైయా కొనసాగుతోంది. కాబట్టి ఈ సమయంలో ఈ రాశులవారు చాలా జాగ్రత్తగా ఉండండి. శనిగ్రహం యెుక్క చెడు ప్రభావాలను నివారించడానికి శనివారం నాడు కొన్ని పరిహారాలు చేయాలి.
Also Read: Shukra Gochar 2022: శుక్రుడి సంచారం... ఈ రాశులకు చెడు రోజులు ప్రారంభం..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook