Rajiv Gandhi Assassination: మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య కేసులో సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కేసులో ఆరుగురు దోషులను విడుదల చేయాలని ఆదేశాలు జారీ చేసింది. రాజీవ్ గాంధీ హత్య కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న నళిని శ్రీహర్, రాబర్ట్ పేస్, రవిచంద్రన్, రాజా, శ్రీహరన్, జయకుమార్‌లను విడుదల చేయాలని ఆదేశించింది. తమను ముందస్తుగా విడుదల చేయాలని కోరుతూ నళిని శ్రీహరన్, ఆర్‌కేపీ రవిచంద్రన్ సుప్రీంకోర్టును కోరాగా.. వారిద్దరిని ముందస్తుగా విడుదల చేయాలని సూచించింది. గతంలో ఈ కేసులో దోషిగా ఉన్న పెరారివాలన్‌ను కూడా కోర్టు విడుదల చేసింది. రాజీవ్ గాంధీ హత్య కేసులో ఆరుగురు దోషులు జైలులో జీవిత ఖైదు అనుభవిస్తున్నారు.
దోషులందరినీ విడుదల చేయాలని తమిళనాడు ప్రభుత్వం సిఫార్సు చేసినా గవర్నర్ చర్యలు తీసుకోలేదని సుప్రీంకోర్టు పేర్కొంది. దోషులు మూడు దశాబ్దాలకు పైగా జైలు జీవితం గడిపారని జైలులో వారి ప్రవర్తన సంతృప్తికరంగా ఉందని బెంచ్ తెలిపింది. గవర్నర్ చర్యలు తీసుకోలేనందుకు తాము చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పింది.
రాజీవ్ గాంధీ హత్య కేసులో దోషులు అయిన నళిని శ్రీహరన్, రవిచంద్రన్ గవర్నర్ అనుమతి లేకుండా తమను త్వరగా విడుదల చేయాలని మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. అయితే ఈ పిటిషన్‌ను కోర్టు జూన్ 17న కొట్టేసింది. “రాజ్యాంగంలోని ఆర్టికల్ 226 ప్రకారం హైకోర్టులకు అలా చేసే అధికారం లేదు. అయితే ఆర్టికల్ 142 ప్రకారం సుప్రీంకోర్టుకు ప్రత్యేక అధికారం ఉంది” అని పేర్కొంది.
ఈ మేరకు వారు ఆగస్టులో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ముందస్తుగా విడుదల చేయాలన్న తన పిటిషన్‌ను కొట్టివేసిన మద్రాస్ హైకోర్టు ఆదేశాలను అతను సవాలు చేశారు. ఈ మేరకు విచారించిన సుప్రీంకోర్టు.. రాజీవ్ గాంధీ హత్య కేసులో మొత్తం ఆరుగురు దోషులను విడుదల చేయాలని ఆదేశాలు జారీ చేసింది. జస్టిస్ బి.ఆర్.గవాయ్, జస్టిస్ బి.వి.నాగరత్నతో కూడిన ధర్మాసనం ఈ మేరకు తీర్పును వెల్లడించింది.
1991 మే 21న దేశం మొత్తం దిగ్భ్రాంతికి గురైంది. చెన్నై సమీపంలోని శ్రీపెరంబుదూర్‌లో రాజీవ్ గాంధీ హత్యకు గురయ్యాడు. ధను అనే మహిళా ఆత్మాహుతి దాడి చేసుకుని.. రాజీవ్‌ను హత్య చేసింది. ఇందిరా గాంధీ హత్య తర్వాత ప్రధానిగా రాజీవ్ గాంధీ బాధ్యతలు చేపట్టారు. దేశంలోనే అత్యంత పిన్న వయస్కుడైన ప్రధానమంత్రిగా ఆయన నిలిచారు. కేవలం 40 ఏళ్ల వయసులో ప్రధాని పదవిని చేపట్టారు.
Also Read: Virat Kohli: కలను సాధించలేకపోయాం.. టీమిండియా ఓటమిపై విరాట్ కోహ్లీ ఎమోషనల్ పోస్ట్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook