Margashirsha Amavasya 2022: మార్గశిర అమావాస్య ఎప్పుడు? దీని ప్రాముఖ్యత ఏంటి?

Margashirsha Amavasya 2022: మార్గశిర మాసంలో వచ్చే అమావాస్యకు చాలా ప్రాముఖ్యత ఉంది.  అఘన అమావాస్య తేదీ, శుభ సమయం గురించి తెలుసుకుందాం.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Nov 18, 2022, 12:17 PM IST
  • ఈ నెల 23న మార్గశిర అమావాస్య
  • ఈరోజు స్నానం, దానానికి విశేష ప్రాధాన్యత
  • పితృదోషం తొలగిపోవాలంటే ఈ రోజున ఇలా చేయండి
Margashirsha Amavasya 2022: మార్గశిర అమావాస్య ఎప్పుడు? దీని ప్రాముఖ్యత ఏంటి?

Margashirsha Amavasya 2022: హిందూ మతంలో ఏకాదశి, పూర్ణిమ, అమావాస్య తిథికి చాలా ప్రత్యేకత ఉంది. మార్గశిర మాసంలో వచ్చే అమావాస్యనే మార్గశిర లేదా అఘన అమావాస్య (Margashirsha Amavasya 2022) అంటారు. అమావాస్య నాడు స్నానం, దానానికి విశేష ప్రాధాన్యత ఉంది. ఈరోజున మీ పూర్వీకుల శ్రాద్ధ కర్మలు చేస్తే వారికి మోక్షం లభిస్తుందని నమ్ముతారు. మరి ఈ ఏడాది మార్గశిర అమావాస్య ఎప్పుడు వచ్చింది, శుభ సమసయం గురించి తెలుసుకుందాం. 

మార్గశిర అమావాస్య 2022 తేదీ
హిందూ క్యాలెండర్ ప్రకారం, మార్గశిర మాసంలోని కృష్ణ పక్షం చివరి తేదీని అమావాస్య అంటారు. ఈ సంవత్సరం మార్గశీర్ష అమావాస్య 23 నవంబర్ 2022, బుధవారం వచ్చింది. ఈ రోజున పూర్వీకులను పూజిస్తారు. అఘన అమావాస్య తిథి 23 నవంబర్ 2022 ఉదయం 06.53 గంటలకు ప్రారంభమై...24 నవంబర్ 2022 ఉదయం 04.26 గంటలకు ముగుస్తుంది.
స్నాన-దాన ముహూర్తం - ఉదయం 05.06 - ఉదయం 06.52 

ప్రాముఖ్యత
మత గ్రంధాల ప్రకారం, శ్రీ కృష్ణుడు తనను తాను మార్గశిర మాసంగా వర్ణించుకున్నాడు. ఈరోజున శ్రాద్ధ కర్మలను జరిపించడం ద్వారా మీ పూర్వీకుల ఆత్మకు శాంతి కలగడంతోపాటు మోక్షం కూడా లభిస్తుంది. అంతేకాకుండా మీకు దేనికీ లోటు ఉండదు. పితృదోషం తొలగిపోవాలంటే ఈ రోజున పేదలకు అన్నదానం, బట్టలు, డబ్బు దానం చేయండి.

మత గ్రంథాల ప్రకారం, సత్యయుగం మార్గశిర మాసం నుండి ప్రారంభమైంది. ఈ మాసంలోని కొన్ని ప్రత్యేక తేదీల్లో ఉపవాసం ఉండటం వల్ల శ్రీ కృష్ణుడి ప్రత్యేక అనుగ్రహం లభిస్తుంది. మార్గశిర అమావాస్య వ్రతం వీటిలో ఒకటి. ఈ రోజున చంద్రుడిని ఆరాధించడం వల్ల ఆగిపోయిన పనులు పూర్తి అవుతాయి.

Also Read: Holi 2023 Date: 2023లో హోలీ ఎప్పుడు? హోలికా దహన్ తేదీ, శుభ సమయం మరియు ప్రాముఖ్యతను తెలుసుకోండి.. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Trending News