రోజువారీ జీవితంలో వివిధ రకాల ఆహారపు అలవాట్లు, పని ఒత్తిడి, ఆందోళన, నిద్రలేమి కారణంగా అధిక రక్తపోటు, మలబద్ధకం, డయాబెటిస్, కొలెస్ట్రాల్ వంటి సమస్యలు ఎదురౌతుంటాయి. అయితే ఈ సమస్యల్నించి నియంత్రణకు ఒకే ఒక్క జ్యూస్ అద్భుత ఫలితాల్ని అందిస్తుంది.
మన చుట్టూ లభించే వివిధ రకాల కూరగాయల్లో అద్భుతమైన ఔషధ గుణాలున్నాయి. ఎప్పుడు ఎలా వినియోగించాలో తెలిస్తే చాలా సమస్యల్నించి ఉపశమనం పొందవచ్చు. ఇందులో ముఖ్యమైనవి కాకరకాయ, కీరా, టొమాటో. ఇందులో పోషక పదార్ధాలు పుష్కలంగా ఉంటాయి. చాలామంది వీటిని సలాడ్ రూపంలో తీసుకుంటుంటారు. కానీ జ్యూస్ రూపంలో తాగితే ఇంకా మెరుగైన ఫలితాలుంటాయి. కాకరకాయలో ప్రోటీన్లు, ఫైబర్, సోడియం, విటమిన్ ఎ వంటి పోషకాలుంటాయి. అటు కీరాలో ప్రోటీన్లు, నీరు ఎక్కువగా ఉండటం వల్ల ఆరోగ్యానికి ప్రయోజనకరం. ఈ క్రమంలో మూడింటిని కలిపి జ్యూస్ రూపంలో తీసుకోవడం వల్ల కలిగే లాభాలను పరిశీలిద్దాం..
కాకరకాయ, కీరా, టొమాటో జ్యూస్ ప్రయోజనాలు
బ్లడ్ షుగర్ నియంత్రణలో..
కాకరకాయ, కీరా, టొమాటో జ్యూస్ అనేది మధుమేహం రోగులకు చాలా ప్రయోజనకరం. ఎందుకంటే కాకరకాయ, కీరా, టొమాటో జ్యూస్ తాగడం వల్ల బ్లడ్ షుగర్ లెవెల్స్ తగ్గుతాయి. మీరు కూడా డయాబెటిస్ వ్యాధిగ్రస్థులైతే..రోజూ కాకరకాయ, కీరా, టొమాటో జ్యూస్ తాగితే మంచి ఫలితాలుంటాయి.
మలబద్ధకం నుంచి విముక్తి
చాలామందికి మలబద్ధకం ప్రధాన సమస్యగా ఉంటుంది. ప్రతిరోజూ కాకరకాయ, కీరా, టొమాటో జ్యూస్ తాగాల్సి ఉంటుంది. ఎందుకంటే కాకరకాయ, కీరాలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. జీర్ణక్రియకు ఇది అద్భుతంగా తోడ్పడుతుంది. ప్రతిరోజూ క్రమం తప్పకుండా తాగాలి.
ఇమ్యూనిటీ పెంచుతుంది
చలికాలంలో కాకరకాయ, కీరా, టొమాటో జ్యూస్ తాగడం వల్ల ఇమ్యూనిటీ పెరుగుతుంది. టొమాటోలో విటమిన్ సి కావల్సినంత లభిస్తుంది. ఇది ఇమ్యూనిటీని పెంచడంతో తోడ్పడుతుంది. తరచూ జలుబు, దగ్గు వంటి సమస్యలు ఉత్పన్నమౌతాయి. కాకరకాయ, కీరా, టొమాటో జ్యూస్ తాగితే మంచి ఫలితాలుంటాయి.
కాకరకాయ, కీరా, టొమాటో జ్యూస్ విధానం
కాకరకాయ, కీరా, టొమాటో జ్యూస్ తయారు చేసేందుకు కాకరకాయను ఒలుచుకోవాలి. తరువాత మిక్సీలో కాకరకాయ, కీరా, టొమాటోతోపాటు గ్లాసు నీళ్లు వేసి మిక్సీ చేసుకోవాలి. వడపోసి రోజూ తాగితే మంచి ఫలితాలుంటాయి.
Also read: Cholesterol Control Tips: ఈ పండుతో చెడు కొలెస్ట్రాల్, గుండె పోటు సమస్యలకు 20 రోజుల్లో తగ్గడం ఖాయం..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook