Suryakumar Yadav Vs Virat Kohli: టీ20 వరల్డ్ కప్ ఓటమి నుంచి టీమిండియా తేరుకుంది. న్యూజిలాండ్‌తో జరిగిన మూడు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌ను 1-0తో కైవసం చేసుకుంది. మొదటి మ్యాచ్ వర్షం కారణంగా రద్దవ్వగా.. రెండో మ్యాచ్‌లో భారత్ విజయం సాధించింది. ఇక కీలకమైన మూడో మ్యాచ్ డక్ వర్త్ లూయిస్ పద్ధతిలో టైగా ముగిసింది. ఈ సిరీస్ నుంచి రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ వంటి సీనియర్ ఆటగాళ్లకు విశ్రాంతినివ్వగా.. ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా జట్టును ముందుండి నడిపించాడు. సూర్యకుమార్ యాదవ్ సెంచరీతో ఈ సిరీస్‌లో ఆకట్టుకున్నాడు. దీపక్ హుడా, సిరాజ్, అర్ష్‌దీప్ బౌలింగ్‌లో సత్తా చాటారు.
రెగ్యులర్‌గా నాలుగో స్థానంలో బ్యాటింగ్ వచ్చే సూర్య కుమార్ యాదవ్.. ఈ సిరీస్‌లో విరాట్ కోహ్లీకి ఇష్టమైన నంబర్ 3 స్థానంలో ఆడాడు. మూడో స్థానంలో శ్రేయాస్ అయ్యర్ బ్యాటింగ్ చేస్తాడని అందరూ భావించగా.. ఆశ్చర్యకరంగా సూర్యను మూడో స్థానంలో పంపించారు. ఈ స్థానంలో సూపర్ బ్యాటింగ్ చేసిన సూర్యను కోహ్లితో నెటిజన్లు పోలుస్తున్నారు.
అవసరమైనప్పుడు ఏ స్థానంలో అయినా బ్యాటింగ్ చేయగలనని సూర్యకుమార్ నిరూపించాడు. న్యూజిలాండ్ హోస్టింగ్‌లో పొట్టి ఫార్మాట్‌లో సెంచరీ సాధించిన తీరు అభినందనీయం. సూర్యకుమార్ గతేడాది టీ20 అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. ఈ ఫార్మాట్‌లో భారత్ తరఫున 42 మ్యాచ్‌లు ఆడిన అతను 2 సెంచరీలు, 12 హాఫ్ సెంచరీల సాయంతో 1408 పరుగులు చేశాడు. వన్డేల్లో 13 మ్యాచ్‌ల్లో రెండు అర్ధ సెంచరీలతో 340 పరుగులు చేశాడు. వన్‌డౌన్‌లో వచ్చి సెంచరీ సాధించిన సూర్య.. భవిష్యత్‌లో కోహ్లి స్థానానికి ఎసరు పెడతాడని నెటిజన్లు అంటున్నారు.
దేశవాళీ క్రికెట్‌లో ముంబైకి ప్రాతినిధ్యం వహిస్తున్న సూర్యకుమార్ యాదవ్.. ఈ ఏడాది అద్భుత ఫామ్‌లో ఉన్నాడు. ఇటీవల జరిగిన టీ20 ప్రపంచకప్‌లో కూడా దుమ్ములేపాడు. న్యూజిలాండ్‌లోనూ అదే ఫామ్‌ని కొనసాగించాడు. ఈ సిరీస్‌లో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. 2 మ్యాచ్‌ల్లో ఒక సెంచరీతో సహా 124 పరుగులు చేశాడు. రాబోయే సిరీస్‌లలో సూర్యకుమార్ యాదవ్ మరింత కీలకంగా మారనున్నాడు.
టీ20 ప్రపంచకప్ సెమీఫైనల్స్‌లో ఇంగ్లండ్‌పై టీమ్‌ఇండియా ఎలాంటి పరాజయం తరువాత తీవ్ర విమర్శలు వచ్చాయి. ఆ తరువాత న్యూజిలాండ్ వేదికగా జరిగిన పొట్టి ఫార్మాట్‌లో భారత్ అద్భుతంగా పునరాగమనం చేసింది. రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ, డాషింగ్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, పేసర్ జస్ప్రీత్ బుమ్రా వంటి ఆటగాళ్లు లేకపోయినా.. యువ ఆటగాళ్లు అద్భుతమైన ప్రదర్శన కనబరిచారు. ఈ టీ20 సిరీస్‌కు హార్దిక్ పాండ్యాకు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించగా.. తన సత్తా నిరూపించుకున్నాడు.
Also Read: Satyendra Jain Massage: మంత్రికి మసాజ్ చేసిన ఆ వ్యక్తి ఎవరో తెలిస్తే షాక్.. ఆ వీడియోలో కీలక మలుపు
Also Read: 7th Pay Commission Update: కేంద్ర ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. త్వరలోనే ఖాతాల్లోకి పెండింగ్ డీఏ..?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి