Content is the King: చిన్నదా, పెద్దదా కాదు.. కంటెంట్ ఈజ్ ది కింగ్.. ఇదే లైవ్ ఎగ్జామ్‌పుల్!

Content is the King: ఒకప్పుడు సినిమా అంటే అనేక లెక్కలుండేవి కానీ ఇప్పుడు ఒకటే లెక్క, సినిమా కంటెంట్ ఈజ్ ది కింగ్, సినిమా కంటెంట్ బాగుంటేనే ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. 

Written by - Chaganti Bhargav | Last Updated : Nov 27, 2022, 04:14 PM IST
Content is the King: చిన్నదా, పెద్దదా కాదు.. కంటెంట్ ఈజ్ ది కింగ్.. ఇదే లైవ్ ఎగ్జామ్‌పుల్!

These Movies Prooves that Content is the King: సాధారణంగా సినిమా రిలీజ్ అవుతుందంటే ట్రేడ్ వర్గాల అనేక విషయాలను బేరీజు వేసుకుంటూ ఉంటారు. ఆ సినిమా హీరో మార్కెట్ ఎంత? హీరోయిన్ మార్కెట్ ఎంత? సినిమా దర్శకుడి వల్ల మార్కెట్ ఎంత? ఇలాంటి ఆలోచనలు పెద్ద ఎత్తున ట్రేడ్ వర్గాల వారు చేస్తూ ఉంటారు. కానీ అవన్నీ ఒకప్పటి లెక్కలు ఇప్పుడు సినిమా మార్కెట్ తో సంబంధం లేకుండా సినిమా కంటెంటే కింగ్ గా మారింది.

సినిమా కంటెంట్ బాగుంటే అది పెద్ద సినిమానా? చిన్న సినిమానా? అనేది జనాలు పట్టించుకోవడం లేదు. పెద్ద హీరో సినిమానా? చిన్న హీరో సినిమానా? అనే విషయాన్ని కూడా పట్టించుకోవడం లేదు. కేవలం సినిమా బాగుందా? లేదా? అనేదే ప్రేక్షకులు అబ్జర్వ్ చేస్తున్నారు. సినిమా బాగుంటే కనుక చిన్న హీరో సినిమాని హిట్ చేస్తున్నారు. పెద్ద హీరో సినిమా అయినా ఫట్ చేస్తున్నారు. ఈ మధ్యకాలంలో కనుక మనం చూసుకుంటే కాంతార అనే సినిమా కన్నడ నాట రిలీజ్ అయి సూపర్ హిట్ అయిన తర్వాత దాన్ని తెలుగు సహా మిగతా భాషల్లో కూడా రిలీజ్ చేస్తే ఏకంగా 400 కోట్ల రూపాయల కలెక్షన్లు రాబట్టింది.

 వాస్తవానికి రిషబ్ శెట్టి అంటే అంతకుముందు చాలా తక్కువ మందికే తెలుసు. కానీ ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత చాలామందికి పరిచయం అయ్యాడు. ఒకరకంగా ఈ సినిమా రిలీజ్ అయ్యే నాటికి రిషబ్ శెట్టి తెలుగులో ఎలాంటి మార్కెట్ లేదు. కానీ ఈసారి రిసెప్షన్ నుండి సినిమా వస్తుందంటే కచ్చితంగా ప్రేక్షకులు ఆదరించే పరిస్థితి అయితే కనిపిస్తోంది. అదే విధంగా తెలుగులో చిరంజీవి ఎలాంటి హీరోనో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు,

ఆయన నటించిన గాడ్ ఫాదర్ సినిమా కంటే కుర్ర హీరోగా పేరు తెచ్చుకున్న నిఖిల్ సిద్ధార్థ్ కార్తికేయ 2 సినిమాతో తెచ్చుకున్న కలెక్షన్స్ ఎక్కువ అంటే ఎవరూ కాదనలేరు అంటే ఇక్కడ నిఖిల్ సిద్ధార్థ్ గొప్పతనమా మెగాస్టార్ టైం బ్యాడా?  అంటే కచ్చితంగా అవేవీ కాదు కేవలం కంటెంట్. అలాగే తమిళంలో కూడా అలాంటి పరిస్థితి కనిపించింది. లవ్ టుడే అనే సినిమా రిలీజ్ అయ్యి ఆ సినిమా మొదటి రోజు తెచ్చుకున్న కలెక్షన్స్ చూస్తే అక్కడి స్టార్ హీరోగా ఉన్న సూర్య ఈటీ కలెక్షన్స్ కంటే తక్కువగా ఉంది అంటే కంటెంట్ ఈజ్ ద కింగ్ అన్నట్లుగా సినిమా పరిస్థితి మారిపోయింది. ఇప్పటికైనా దర్శక నిర్మాతలు ఆ విషయాన్ని గ్రహిస్తే భవిష్యత్తులో మున్ముందు కంటెంట్ ఉన్న సినిమాలు చూసే అవకాశం మనకు కూడా దక్కుతుంది. 
Also Read: SSMB 28: అదిరిందయ్యా త్రివిక్రమ్.. మహేష్ బాబు సినిమా కోసం ఏకంగా 4 హీరోయిన్లు!

Also Read: Actor Simbhu: ఎన్టీఆర్ తరువాత కుర్ర హీరో కోసం శింభు 'గాత్ర దానం'

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

 

Trending News