Kochu Preman: సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం.. అనారోగ్యంతో సీనియర్ నటుడు కన్నుమూత

Kochu Preman passes away: తెలుగు సినీ పరిశ్రమ ఇప్పటికే సూపర్ స్టార్ కృష్ణ లాంటి హీరోని కోల్పోయి తీవ్ర విషాదంలో మునిగిపోగా ఇప్పుడు మలయాళ సినీ పరిశ్రమలో  పాపులర్ నటుడు కొచ్చు ప్రేమన్ కన్నుమూశారు.

Written by - Chaganti Bhargav | Last Updated : Dec 3, 2022, 08:30 PM IST
Kochu Preman: సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం.. అనారోగ్యంతో సీనియర్ నటుడు కన్నుమూత

Malayalam actor Kochu Preman passes away: సినీ పరిశ్రమలో వరుస విషాదాలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. తెలుగు సినీ పరిశ్రమ ఇప్పటికే సూపర్ స్టార్ కృష్ణ లాంటి హీరోని కోల్పోయి తీవ్ర విషాదంలో మునిగిపోగా ఇప్పుడు మలయాళ సినీ పరిశ్రమలో కూడా ఒక పాపులర్ నటుడు కన్నుమూశారు. మలయాళ నటుడు కొచ్చు ప్రేమన్ తన 68 ఏళ్ల వయసులో కన్నుమూశారు. ఆయన అసలు పేరు కెఎస్ ప్రేమ్ కుమార్. ఆయన ఒక ప్రైవేటు ఆస్పత్రిలో అనారోగ్యం రీత్యా చికిత్స పొందుతూ కన్నుమూసినట్లు తెలుస్తోంది.

ఆయన కొద్దిరోజులుగా ఊపిరితిత్తుల సమస్యతో బాధ పడుతున్నట్లు తెలుస్తోంది. తన కెరియర్ లో ఎక్కువగా సినిమాల్లోని కామెడీ రోల్స్ చేశారు. రెండు దశాబ్దాల పాటు ఆయన ఆయన సుమారు 200 పైగా సినిమాల్లో నటించి మలయాళ సినీ పరిశ్రమకు తన సేవలు అందించారు. ముందుగా నాటక పరిశ్రమ ద్వారా నటుడిగా పరిచయమైన ఆయన ఆ తరువాత సినీ రంగంలోకి ప్రవేశించి 20 దశాబ్దాల పాటు 200 సినిమాల్లో నటించారు.

ఆయన తిరువనంతపురంలో పుట్టి పెరిగి సినిమాల మీద ఆసక్తి పెంచుకున్నారు. ఆ తర్వాత నాటకాల ద్వారా నటుడిగా నిరూపించుకుని సినీ రంగ ప్రవేశం చేశారు. శ్రీకృష్ణపురతే నక్షత్రతిలక్కం , మట్టుపెట్టి మచ్చన్ , ఇరట్టక్కుట్టికలుడే అచ్చన్ , పట్టాభిషేకం , గురు , తెంకాసి పట్టణం , కళ్యాణ రామన్ సహా తిలక్కం వంటి అనేక ప్రసిద్ధ మళయాళ సినిమాల్లో కొచ్చు ప్రేమన్ నటించారు.

త్రివేండ్రం లాడ్జ్ , ఆర్డినరీ , ఓజిమూరి , యాక్షన్ హీరో బిజు , కార్బన్, ది ప్రీస్ట్ వంటి తాజా సినిమాల్లో కూడా ఆయన కనిపించారు. ఇక అయన టెలివిజన్‌లో కూడా సత్తా చాటారు. వివిధ మలయాళ ఛానెల్‌లలో అనేక ప్రముఖ సీరియల్స్‌లో నటిస్తున్నారు.ఇక  ఆయన మృతి పట్ల ముఖ్యమంత్రి పినరయి విజయన్‌తో పాటు పలువురు నటీనటులు, నిర్మాతలు సంతాపం తెలిపారు.

Also Read:

Also Read:

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

 
 

Trending News