Trigrahi Yog December 2022: డిసెంబర్ 16న త్రిగ్రాహి యోగం.. ఈ 4 రాశుల వారికి ఉద్యోగ, వ్యాపారంలో అన్ని శుభాలే!

These 4 signs will have auspicious time in job and business due to Sun Transit 2022 in Sagittarius. ధనుస్సు రాశిలోకి సూర్యుడు రావడం వల్ల 'త్రిగ్రాహి యోగం 2022' ఏర్పడబోతోంది. ఈ త్రిగ్రాహి యోగం 4 రాశుల వారికి చాలా ప్రయోజనకరంగా ఉండనుంది.   

Written by - P Sampath Kumar | Last Updated : Dec 13, 2022, 08:17 AM IST
  • డిసెంబర్ 16న త్రిగ్రాహి యోగం
  • ఈ 4 రాశుల వారికి ఉద్యోగ, వ్యాపారంలో అన్ని శుభాలే
  • ఉద్యోగంలో ఇంక్రిమెంట్ మరియు ప్రమోషన్
Trigrahi Yog December 2022: డిసెంబర్ 16న త్రిగ్రాహి యోగం.. ఈ 4 రాశుల వారికి ఉద్యోగ, వ్యాపారంలో అన్ని శుభాలే!

These 4 signs will have auspicious time in job and business due to Sun Transit 2022 in Sagittarius: గ్రహాల రాజుగా పిలువబడే సూర్య దేవుడు 2022 డిసెంబర్ 16న తన రాశి చక్రాన్ని మార్చబోతున్నాడు. ధనుస్సు రాశిలోకి సూర్యుడు ప్రవేశించనున్నాడు. ధనుస్సు రాశిలో ఇప్పటికే శుక్ర మరియు బుధ గ్రహాలు ఉన్నాయి. దానివల్ల లక్ష్మీనారాయణ యోగం ఏర్పడుతుంది. ఇప్పుడు సూర్యుడు కూడా ధనుస్సు రాశిలోకి రావడం వల్ల 'త్రిగ్రాహి యోగం' ఏర్పడబోతోంది. ఈ త్రిగ్రాహి యోగం 4 రాశుల వారికి చాలా ప్రయోజనకరంగా ఉండనుంది. వారు ఉద్యోగం మరియు వ్యాపారంలో పురోగతిని పొందుతారు. అంతేకాదు భారీగా డబ్బు చేతికి అందుతుంది. ఆ అదృష్ట రాశులు ఏవో తెలుసుకుందాం.

ధనుస్సు: 
సూర్య సంచారం ధనుస్సు రాశి వారి గౌరవాన్ని పెంచుతుంది. కార్యాలయంలో కొత్త బాధ్యతను పొందవచ్చు. అలాగే మీ సీనియర్ సహోద్యోగులు మీకు పూర్తి మద్దతునిస్తారు. ఉద్యోగంలో ఇంక్రిమెంట్ మరియు ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది. మీ పనికి ప్రశంసలు అందుతాయి.

తులా: 
సూర్య దేవుని సంచారం తులా రాశి వారికి భారీ ప్రయోజనాలను ఇవ్వనుంది. ముఖ్యంగా సోషల్ మీడియా, మార్కెటింగ్ లేదా కన్సల్టింగ్ రంగంలోని వారు చాలా ప్రయోజనం పొందుతున్నారు. కెరీర్‌లో పురోగతి సాధించడమే కాకుండా.. భారీ ఇంక్రిమెంట్ కూడా అందుతుంది. కుటుంబంతో సరదాగా గడుపుతారు. 

మీనం:
మీన రాశి వారికీ కొత్త ఉద్యోగం రానుంది. నచ్చిన ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది. ప్రమోషన్‌కు కూడా అవకాశాలు వస్తున్నాయి. ఈ సమయంలో ఎవరితోనూ ఎలాంటి వివాదాలకు పోకూడదు. రుణ లావాదేవీలు జరపకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. రుణ లావాదేవీలు చేయడం హానికరం.

వృషభం: 
త్రిగ్రాహి యోగం వృషభ రాశి వారికి అనుకూల ఫలితాలను ఇవ్వనుంది. మీరు ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటారు. డబ్బు రాక పెరుగుతుంది. వచ్చిన డబ్బును ఆదా చేసుకోండి. అనవసరమైన ఖర్చులు తగ్గించండి. ఆస్తి లేదా వాహనం మీ ఇంటికి వచ్చే అవకాశం ఉంది.

Also Read: IND vs BAN: బంగ్లాదేశ్‌తో మొదటి టెస్టు.. బీసీసీఐ అనూహ్య నిర్ణయం! రిషబ్‌ పంత్‌ పని అయిపోయింది  

Also Read: Gold Price Today: మగువలకు తీపికబురు.. తగ్గిన బంగారం ధర! తెలుగు రాష్ట్రాల్లో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే?  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook.

 

Trending News