చైనా మొబైల్ తయారీ సంస్థ షియోమీ మరో కొత్త స్మార్ట్ ఫోన్‌ను విడుదల చేసింది. రెడ్ మీ నోట్ 5ప్రోకు సక్సెసర్‌గా సోమవారం షియోమీ రెడ్మి 6ప్రోను చైనాలో విడుదల చేసింది. రోజ్ గోల్డ్, గోల్డ్, బ్లూ, బ్లాక్, రెడ్ కలర్ వేరియెంట్లలో ఈ ఫోన్ లభించనుంది. 3జీబీ, 4 జీబీ ర్యామ్ వేరియెంట్లలో విడుదలైన ఈ ఫోన్ భారత కరెన్సీలో రూ.10.400, రూ.12,500 ధరలకు వినియోగదారులకు జూన్ 26 నుంచి చైనాలో అందుబాటులోకి రానుంది. త్వరలోనే భారత్‌లోనూ రెడ్మి 6ప్రోను విడుదల చేయనున్నారు.
షియోమీ రెడ్మి 6 ప్రో ప్రత్యేకతలు
5.84 ఇంచ్ ఫుల్ హెచ్డీ డిస్ప్లే, 2280 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 2 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 625 ప్రాసెసర్, 3 జీబీ ర్యామ్/32జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, 4 జీబీ ర్యామ్/64 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, డ్యుయల్ సిమ్, 12, 5 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, ఇన్ఫ్రారెడ్ సెన్సార్, 4జీ వీవోఎల్టీఈ, మైక్రో యూఎస్బీ, 3.5 ఎంఎం హెడ్‌ఫోన్ జాక్, బ్లూటూత్ 4.2, 4000 ఎంఏహెచ్ బ్యాటరీ.
ఎంఐ ప్యాడ్ 4
షియోమీ తన నూతన ఆండ్రాయిడ్ ట్యాబ్లెట్ పీసీ 'ఎంఐ ప్యాడ్ 4' ను ఇవాళ విడుదల చేసింది. ప్రస్తుతం ఈ ట్యాబ్లెట్ చైనా మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. త్వరలో భారత్‌లోనూ ఈ ట్యాబ్లెట్ పీసీ విడుదల కానుంది. 3/4 జీబీ ర్యామ్ వేరియెంట్లలో విడుదలైన ఈ ఫోన్ రూ.11,470, రూ.14,600, రూ.15,625 ధరలకు వినియోగదారులకు లభ్యం కానుంది.
షియోమీ ఎంఐ ప్యాడ్ 4 ప్రత్యేకతలు..
8 ఇంచ్ ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్ప్లే, ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 660 ప్రాసెసర్, 3/4 జీబీ ర్యామ్, 32/64 జీబీ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, 13 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, 4జీ ఎల్టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0, యూఎస్బీ టైప్ సి, 6000 ఎంఏహెచ్ బ్యాటరీ.