FIFA World Cup 2022 Prize Money: ఫిఫా ప్రపంచకప్ 2022 విజేతకు ఊహించని ప్రైజ్‌మనీ.. తెలిస్తే షాకే! అవార్డుల లిస్ట్ ఇదే

2022 FIFA World Cup Winner Argentina wins 72 million doller Prize Money. ఫిఫా ఫుట్‌బాల్‌ ప్రపంచకప్ 2022 టైటిల్ గెలిచిన అర్జెంటీనాకు ఊహించని ప్రైజ్‌మనీ దక్కింది. 42 మిలియన్ డాలర్లు (రూ. 348 కోట్ల 48 లక్షలు)  అర్జెంటీనా జట్టు అందుకుంది.   

Written by - P Sampath Kumar | Last Updated : Dec 19, 2022, 11:19 AM IST
  • ఫిఫా ప్రపంచకప్ 2022 విజేతకు ఊహించని ప్రైజ్‌మనీ
  • ప్రైజ్‌మనీ తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే
  • అవార్డుల లిస్ట్ ఇదే
FIFA World Cup 2022 Prize Money: ఫిఫా ప్రపంచకప్ 2022 విజేతకు ఊహించని ప్రైజ్‌మనీ.. తెలిస్తే షాకే! అవార్డుల లిస్ట్ ఇదే

2022 FIFA World Cup Winner Argentina wins 72 million doller Prize Money: ఫిఫా ఫుట్‌బాల్‌ ప్రపంచకప్‌ 2022 ఫైనల్‌లో డిఫెండింగ్‌ చాంపియన్‌ ఫ్రాన్స్‌ జట్టును ఓడించిన అర్జెంటీనా విష్వవిజేతగా నిలిచింది. పెనాల్టీ షూటౌట్‌లో లియోనెల్‌ మెస్సి సేన 4-2 తేడాతో ఫ్రాన్స్‌ను ఓడించి ఘన విజయం సాధించింది. అర్జెంటీనా ప్లేయర్స్ మెస్సి రెండు గోల్స్‌ (23 పెనాల్టీ, 108 పెనాల్టీ) గోల్స్‌ బాధగా.. డిమారియా (36వ) ఓ గోల్‌ కొట్టాడు. ఫ్రాన్స్‌ తరఫున స్టార్ ప్లేయర్ కిలియన్‌ ఎంబాపే (80వ, 81వ, 118వ నిమిషాల్లో) హ్యాట్రిక్‌ గోల్స్‌ చేశాడు. 2022 విజేతగా నిలిచిన అర్జెంటీనా.. ముచ్చటగా మూడోసారి ఫుట్‌బాల్‌ ప్రపంచకప్‌ ట్రోఫీని కైవసం చేసుకుంది. 

ఖతార్‌లో జరిగిన ఫిఫా ఫుట్‌బాల్‌ ప్రపంచకప్ 2022 టైటిల్ గెలిచిన అర్జెంటీనాకు ఊహించని ప్రైజ్‌మనీ దక్కింది. 42 మిలియన్ డాలర్లు (రూ. 348 కోట్ల 48 లక్షలు)  అర్జెంటీనా జట్టు అందుకుంది. రన్నరప్‌గా నిలిచిన ఫ్రాన్స్‌కు 30 మిలియన్ డాలర్లు (రూ. 248 కోట్ల 20 లక్షలు) దక్కాయి. మూడవ నంబర్ జట్టు క్రొయేషియాకు $27 మిలియన్లు (సుమారు రూ. 220 కోట్లు) దక్కాయి. నాలుగో స్థానంలో నిలిచిన జట్టు మొరాకోకు 25 మిలియన్ డాలర్లు (దాదాపు రూ. 204 కోట్లు) లభించాయి. రౌండ్ ఆఫ్ 16లో నిష్క్రమించిన ప్రతి జట్టుకు $13 మిలియన్ల ప్రైజ్ మనీ.. క్వార్టర్ ఫైనల్స్‌లో నిష్క్రమించిన ఒక్కో జట్టుకు $17 మిలియన్ల ప్రైజ్ మనీ దక్కింది.

ఫిఫా ఫుట్‌బాల్‌ ప్రపంచకప్ 2022 కోసం మొత్తం $440 మిలియన్ల ప్రైజ్ మనీ పంపిణీ చేశారు. 32 జట్ల పంపిణీ కోసం $440 మిలియన్లు కేటాయించబడ్డాయి. 2018 సీజన్ కంటే 40 మిలియన్ డాలర్లు (సుమారు 331 కోట్లు) ఈసారి ఎక్కువ. ఇక 2018లో ఆడిన ప్రపంచకప్‌లో విజేతగా నిలిచిన ఫ్రాన్స్‌కు 38 మిలియన్ డాలర్లు (రూ.314 కోట్లు) అందించారు. రన్నరప్‌గా నిలిచిన క్రొయేషియాకు 28 (రూ. 231 కోట్లు) మిలియన్ డాలర్లు అందించారు. 

ప్రపంచకప్‌ 2022 అవార్డులు:
గోల్డెన్‌ బాల్‌ - లియోనల్‌ మెస్సీ అర్జెంటీనా 
గోల్డెన్‌ బూట్‌ - కైలియన్‌ ఎంబాపె- ఫ్రాన్స్‌
గోల్డెన్‌ గ్లౌవ్‌ - మార్టినెజ్‌ - అర్జెంటీనా
బెస్ట్‌ యంగ్‌ ప్లేయర్‌ - ఎంజో ఫెర్నాండెజ్‌ - అర్జెంటీనా
మ్యాన్‌ ఆఫ్‌ ద ఫైనల్‌ - లియోనల్‌ మెస్సీ - అర్జెంటీనా
ఫెయిర్‌ ప్లే అవార్డు - ఇంగ్లండ్‌  

Also Read: Mercury Rise 2023: జనవరి 12న ధనుస్సు రాశిలోకి బుధుడు.. ఈ 3 రాశుల వారికి శుభప్రదం! కొత్త ఉద్యోగం, వ్యాపారంలో భారీ ఆదాయం  

Also Read: ఈ చిన్న మొక్క మనీ ప్లాంట్ కంటే అత్యంత ప్రభావమైనది.. ఇంట్లో ఉంటే డబ్బును అయస్కాంతంలా ఆకర్షిస్తుంది!  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook.

Trending News