Shukra Gochar 2023: మీన రాశిలోకి శుక్రుడు... ఈ 3 రాశుల వారి ఇంటి నిండా సిరి సంపదలు ఖాయం..

Shukra Transit 2023: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, శుక్రుడు మీన రాశిలో సంచరించబోతున్నాడు. శుక్రుడు రాశి మారడం వల్ల 3 రాశుల వారు అపారమైన డబ్బును పొందనున్నారు.  

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Dec 19, 2022, 12:38 PM IST
  • కొత్త ఏడాదిలో శుక్రుడు రాశి మార్పు
  • ఈ మూడు రాశులకు అపారమైన ప్రయోజనం
  • ఇందులో మీరున్నారా మరి
Shukra Gochar 2023: మీన రాశిలోకి శుక్రుడు... ఈ 3 రాశుల వారి ఇంటి నిండా సిరి సంపదలు ఖాయం..

Shukra Transit In Pisces 2023: ప్రేమ, సంపద, అందం మరియు లగ్జరీ లైఫ్ కు కారకుడు శుక్రుడు. ఇతడిని ఆస్ట్రాలజీలో శుభగ్రహంగా భావిస్తారు. కొత్త ఏడాదిలో శుక్రుడు కూడా తన రాశిని మార్చబోతున్నాడు. ఫిబ్రవరి 05న శుక్రుడు తన రాశిని ఛేంజ్ చేసి మీన రాశిలోకి (Venus transit in Pisces 2023) ప్రవేశించబోతున్నాడు. శుక్రుడి యెుక్క ఈ రాశి మార్పు కారణంగా మూడు వారు కెరీర్ లో అద్భుతమైన పురోగతితోపాటు భారీ మెుత్తంలో డబ్బును పొందుతారు. ఆ లక్కీ రాశులేంటో తెలుసుకుందాం. 

కన్య రాశి (Virgo): శుక్రుడి రాశి మార్పు మీకు శుభప్రదంగా ఉంటుంది. ఎందుకంటే శుక్ర గ్రహం మీ రాశి నుండి ఏడో ఇంట్లో సంచరించబోతున్నాడు. దీంతో మీ వైవాహిక జీవితం అద్భుతంగా ఉంటుంది. పెళ్లికాని యువతీ యువకులకు వివాహం కుదిరే అవకాశం ఉంది. మీరు భాగస్వామ్యంతో చేసే పనులు లాభాలు ఇస్తాయి. మీ ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. 

తుల రాశిచక్రం (libra); శుక్రుని సంచారం మీకు ప్రయోజనకరంగా ఉంటుంది. ఎందుకంటే ఈ సంచారం మీ రాశి నుండి ఆరో ఇంట్లో జరగబోతుంది. దీంతో మీరు శత్రువులపై విజయం సాధిస్తారు. మీరు కోర్టు కేసుల్లో విజయం సాధిస్తారు. మీ కెరీర్ లో అద్భుతమైన పురోగతి ఉంటుంది. వ్యాపారంలో భారీగా లాభాలు ఉంటాయి. మీకు కొత్త ఆదాయ మార్గాలు ఏర్పడతాయి. 

మిథునం  (Gemini): శుక్రుని సంచారం మిథునరాశివారికి అనుకూలంగా ఉంటుంది. ఎందుకంటే శుక్రుడు మీ రాశి నుండి పదో ఇంట్లోకి ప్రవేశించబోతున్నాడు. నిరుద్యోగులకు కొత్త ఉద్యోగం వస్తుంది. ఉద్యోగులకు పదోన్నతి లభిస్తుంది. వ్యాపారవేత్తలు తమ వ్యాపారాన్ని విస్తరిస్తారు. మీ ఆదాయం పెరుగుతుంది. 

Also Read: Rajyog 2023: అరుదైన యోగాన్ని ఏర్పరుస్తున్న గురుడు... ఇక ఈ 3 రాశులకు తిరుగుండదు.. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook.

Trending News