Vipreet Rajyog 2023: అరుదైన యోగాన్ని ఏర్పరుస్తున్న గురుడు... ఇక ఈ 3 రాశులకు తిరుగుండదు.. డబ్బే డబ్బు..

Vipreet Rajyog In 2023: కొత్త ఏడాదిలో బృహస్పతి రాశి మార్పు వల్ల అరుదైన రాజయోగం ఏర్పడుతుంది. ఇది మూడు రాశులవారిపై ధనవర్షం కురిపిస్తుంది.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Dec 19, 2022, 11:21 AM IST
  • మేషరాశిలో బృహస్పతి సంచారం
  • ఈ మూడు రాశుల ఫేట్ మారడం ఖాయం
  • ఇందులో మీరున్నారేమో చెక్ చేసుకోండి
Vipreet Rajyog 2023: అరుదైన యోగాన్ని ఏర్పరుస్తున్న గురుడు... ఇక ఈ 3 రాశులకు తిరుగుండదు.. డబ్బే డబ్బు..

Guru Planet Transit In Mesh Rashi 2023: జ్యోతిషశాస్త్రం ప్రకారం, 2023 సంవత్సరంలో అనేక గ్రహాలు తమ రాశిచక్రాలను మార్చబోతున్నాయి. ఇందులో దేవతల గురువైన బృహస్పతి కూడా ఉన్నాడు. గురుడు ఏప్రిల్ 22, 2023 నాడు తన రాశిని మార్చబోతున్నాడు. అతడు మేషరాశిలో సంచరించనున్నాడు. దీని కారణంగా విప్రీత్ రాజయోగం (Vipreet Rajyog 2023) ఏర్పడుతుంది. ఈ యోగం మూడు రాశులవారికి అపారమైన ప్రయోజనాలను ఇవ్వనుంది. ఆ లక్కీ రాశులేంటో తెలుసుకుందాం. 

ధనుస్సు (Sagittarius): ఈ రాజయోగం ధనుస్సు రాశివారికి శుభప్రదంగా ఉంటుంది. ఎందుకంటే బృహస్పతి మీ రాశి నుండి ఐదో ఇంట్లో సంచరించబోతున్నాడు. దీని కారణంగా మీరు ప్రేమ వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. పెళ్లికాని వారికి వివాహం కుదిరే అవకాశం ఉంది. సంతానం లేని దంపతులకు పిల్లలు కలుగుతారు. ఈ సమయంలో విద్యార్థులు రాణిస్తారు. విదేశాల్లో స్టడీస్ చేయాలనుకునేవారి కోరిక నెరవేరుతుంది. 

మకరం (Capricorn); విపరీత రాజయోగం మీకు ప్రయోజనకరంగా ఉంటుంది. ఎందుకంటే మీ రాశి నుండి నాల్గవ ఇంట్లో ఈ యోగం ఏర్పడబోతోంది. దీంతో మీరు లగ్జరీ లైఫ్ ను లీడ్ చేస్తారు. మీరు ఏదైనా వాహనం లేదా ఆస్తిని కొనుగోలు చేసే అవకాశం ఉంది. పెద్ద పెద్ద వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. దాని వల్ల మీరు భవిష్యత్తులో ప్రయోజనం పొందుతారు. ఫ్యామిలీ సంబంధాలు బాగుంటాయి. 

కర్కాటకం (Cancer): ఈరాజయోగం వల్ల కర్కాటక రాశి వారికి అదృష్టం వరిస్తుంది. ఎందుకంటే మీ జాతకంలో పదవ ఇంట్లో ఈ యోగం ఏర్పడబోతోంది. దీంతో మీరు కొత్త జాబ్ పొందే అవకాశం ఉంది. నచ్చిన ప్రదేశానికి ట్రాన్సఫర్ అయ్యే అవకాశం ఉంది. వ్యాపారులు భారీగా లాభాలను ఆర్జించే అవకాశం ఉంది. బిజినెస్ విస్తరిస్తుంది. టోటల్ గా ఈ సమయం ఈ రాశివారికి అద్భుతంగా ఉంటుంది.

Also Read; Falgun Amavasya 2023: ఫాల్గుణ అమావాస్య ఎప్పుడు? దీని ప్రాముఖ్యత ఏంటి?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook.

 

Trending News