ఐపీఎల్ టైటిల్ 4 సార్లు సాధించిన చెన్నై సూపర్‌కింగ్స్ ఈసారి వేలంలో సహజ స్వభావానికి విరుద్ధంగా వ్యవహరించింది. ఓ ప్లేయర్ విషయంలో భారీగానే ఖర్చు పెట్టింది. అతడే ఇంగ్లండ్ కెప్టెన్ బెన్‌స్టోక్స్. అయితే దీని వెనుక కారణం లేకపోలేదు.
సాధారణంగా చెన్నై సూపర్‌కింగ్స్ జట్టు ఐపీఎల్ వేలంలో ఏ ప్లేయర్ కోసం పెద్దగా పోటీపడదు. అంచనాలు మించుతుందని తెలిసినప్పుడు డ్రాప్ అయిపోతుంటుంది. అదే సమయంలో ఇతర జట్లు భారీ ధర వెచ్చిస్తుంటాయి. ఈసారి కొచ్చిలో జరిగిన ఐపీఎల్ 2023 మినీ వేలంలో అంచనాలకు అతీతంగా బెన్‌స్టోక్స్ కోసం ఏకంగా 16.25 కోట్లు వెచ్చించింది. ఇతర ఫ్రాంచైజీల్నించి పోటీ వచ్చినా వెనక్కి తగ్గలేదు. ఓ ప్లేయర్ కోసం ఇంతలా వేలంలో వెచ్చించడం ఇదే తొలిసారి. అయితే దీనికి కారణం లేకపోలేదు. బెన్‌స్టోక్స్‌ను ఎలాగైనా తీసుకోవాలని..వెనక్కి తగ్గవద్దని టీమ్ ప్రస్తుత కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని ఇచ్చిన సూచనలేనని తెలుస్తోంది. బెన్‌స్టోక్స్ బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ మూడింట్లోనూ ప్రతిభ కలిగిన ఆటగాడు.
మహేంద్రసింగ్ ధోని గత సీజన్‌లో కెప్టెన్సీ బాధ్యతల్ని రవీంద్ర జడేజాకు అప్పగించినా..అతడు ఘోరంగా విఫలం కావడంతో తిరిగి పగ్గాలు చేపట్టాడు. ఈసారి ధోనీ ఐపీఎల్ నుంచి వైదొలగాలనే నిర్ణయం తీసుకున్నాడు. అందుకే తన వారసుడిగా బెన్‌స్టోక్స్‌కు కెప్టెన్సీ అప్పగించనున్నాడు. ఇందులో భాగంగానే బెన్‌స్టోక్స్ కోసం 16.25 కోట్లు వెచ్చించింది చెన్నై సూపర్‌కింగ్స్ యాజమాన్యం.
అటు చెన్నై సూపర్‌కింగ్స్ సీఈవో కాశీ విశ్వనాధ్ కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. కెప్టెన్సీ ఎవరికి ఇవ్వాలనేది పూర్తిగా ధోనీ నిర్ణయంపై వదిలిపెట్టామన్నారు. ఇటు ధోనీ కూడా బెన్‌స్టోక్స్‌కు పగ్గాలు ఇచ్చే ఆలోచనలో ఉన్నాడు.
Also read: Ind Vs Ban: వద్దనుకున్న ప్లేయర్ పెద్ద దిక్కయ్యాడు.. టీమిండియా విజయంలో అతనిదే కీ రోల్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook