Chinmayi Social Media Abusing సింగర్ చిన్మయి శ్రీపాద సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉంటుంది. అమ్మాయిలకు అండగా ఉంటూ అవగాహన కల్పిస్తూ ఉంటుంది. సోషల్ మీడియా తరంలో ఎలా ఉండాలి.. ఇండిపెండెంట్‌గా ఎలా బతకాలి.. ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలో చెబుతూ నేటి యువతకు సలహాలు, సూచనలు ఇస్తుంటుంది. ఇక అమ్మాయిలకు ఎదురయ్యే చేదు అనుభవాల గురించి ప్రత్యేకంగా వీడియోలు, పోస్టులు షేర్ చేస్తుంటుంది.
ఇంట్లో చెప్పుకోలేని విషయాలు, తమకు జీవితంలో ఎదురైన చేదు అనుభవాలను చిన్మయితో పంచుకుంటూ ఉంటారు అమ్మాయిలు. ఇంట్లో బంధువులు కూడా తమపై అత్యాచారం చేస్తుంటారని చిన్మయితో ఎంతో మంది అమ్మాయిలు చెప్పుకుని బాధపడుతుంటారు. మీటూ, కాస్టింగ్ కౌచ్‌లో భాగంగా ఎంతో మంది నిజ స్వరూపాలను చిన్మయి ఎండగట్టింది. సింగర్ కార్తీక్, రైటర్ వైరముత్తులపై చిన్మయి చేసిన ఆరోపణలు, వాటి పర్యవసనాలను చిన్మయి ఇప్పటికీ ఎదుర్కొంటోంది.
చిన్మయి మాత్రం ఎప్పుడూ తన పోరాటాన్ని ఆపలేదు. వెనుకడుగు వేయలేదు. ఇంకా వారితో పోరాడుతూనే ఉంటోంది. కోలీవుడ్‌లో చిన్మయిని బ్యాన్ చేశారు. డబ్బింగ్ యూనియన్, సింగర్ల యూనియన్ కూడా ఆమెను బ్యాన్ చేసింది. అయినా కూడా చిన్మయి మాత్రం అడుగు ముందుకే వేసింది. తాజాగా చిన్మయి అమ్మాయిల మీద జరిగే వేదింపులు, బ్లాక్ మెయిల్‌ల గురించి వీడియో చేసింది.
సోషల్ మీడియాలో కొందరు ఆకతాయిల బెదిరింపులు ఎక్కువ అయ్యాయని, రిప్లై ఇవ్వకుంటే.. చాటింగ్ చేయకపోతే మీ న్యూడ్ ఫోటోలు, వీడియోలు బయటపెడతామని, అశ్లీల వెబ్ సైట్లలో పెడతామంటూ బెదిరిస్తున్నారని, అలాంటి వాటికి బెదిరిపోకండని, ధైర్యంగా ఎదుర్కోండని, మీ ఇంట్లో వాళ్లకి అర్థమయ్యేట్లు వివరించండని, అంతే కానీ ఎలాంటి అఘాయిత్యాలకు పాల్పడకండని సూచించింది. వారు మిమ్మల్ని బెదిరిస్తే.. తిరిగి మీరే బెదిరించండని, ఏం చేసుకుంటావో చేసుకో అని చెప్పండి అంటూ ఇలా అమ్మాయిలకు ధైర్యం ఇచ్చే ప్రయత్నం చేసింది చిన్మయి.
పోరా కుక్క అని తిట్టండి.. అయినా వాళ్ల కంటే కుక్కలు చాలా మంచి జంతువులు.. వీరు అలాంటి బెదిరింపులకు భయపడకండి.. మీరేంటో మీకు తెలుసు.. మీకు నచ్చినట్టుగా బతకండి.. ఒకరి కోసం బతక్కండి అంటూ చిన్మయి నేటి యువతలో ధైర్యాన్ని, తెగింపుని నింపే ప్రయత్నం చేసింది.
Also Read : Veerayya Title Song : వీరయ్య.. అదరగొట్టేశావయ్యా.. దుమ్ములేపిసిన చిరు, డీఎస్పీ
Also Read : Mega Fans Fire on Mythri Movie : బాలయ్య అంటే భయమా?.. చిరుపై అలసత్వమా?.. మైత్రీపై మెగా ఫ్యాన్స్ ఫైర్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook