Pawan Kalyan Marriages : పెళ్లిళ్లపై పవన్ కళ్యాణ్‌ స్పందన.. కుక్కలే అంటూ బాలయ్య కౌంటర్లు

Pawan Kalyan Marriages పవన్ కళ్యాణ్‌ తాజాగా తన పెళ్లిళ్లు, భార్యల మీద స్పందించాడట. బాలయ్య అన్ స్టాపబుల్ షోలో అంతా కూలంకషంగా వివరించాడట. అవన్నీ విన్న బాలయ్య అదిరిపోయేలా స్పందించాడట. ఇంకా విమర్శిస్తుంటే.. వాళ్లు ఊరకుక్కలతో సమానం అని అన్నాడట.

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 28, 2022, 10:41 AM IST
  • బాలయ్య టాక్ షోలో అరుదైన ఘట్టం
  • పవన్ కళ్యాణ్‌ పెళ్లిళ్లు, భార్యలపై కామెంట్
  • అందరికీ కౌంటర్ వేసిన బాలయ్య
Pawan Kalyan Marriages : పెళ్లిళ్లపై పవన్ కళ్యాణ్‌ స్పందన.. కుక్కలే అంటూ బాలయ్య కౌంటర్లు

Pawan Kalyan Marriages పవన్ కళ్యాణ్‌ విషయంలో విమర్శించడానికి ఏమీ లేకపోవడంతో ప్రత్యర్థులంతా కూడా ఆయన పర్సనల్ లైఫ్ మీద పడి ఏడుస్తుంటారు. మూడు పెళ్లిళ్లు చేసుకున్నాడు.. భార్యలను మార్చేస్తున్నాడు అంటూ ఇలా నానా రకాలుగా కామెంట్లుచేస్తుంటారు. రాజకీయ ప్రత్యర్థులు పవన్ కళ్యాణ్‌ను తిట్టాలంటే ఈ టాపిక్ తప్పా ఇంకోటి ఉండదు. అందుకే వీటికి సరైన సమాధానం చెప్పేందుకు బాలయ్య అన్ స్టాపబుల్ షోను పవన్ కళ్యాణ్‌ వేదికగా మార్చుకున్నట్టు తెలుస్తోంది.

పెళ్లిళ్లు, పర్సనల్ లైఫ్ గురించి ప్రశ్నలు అడగొద్దని బాలయ్యను ముందుగానే పవన్ కళ్యాణ్‌ రిక్వెస్ట్ చేసినట్టుగా టాక్ వచ్చింది. కానీ బాలయ్య మాత్రం వాటినే అడిగినట్టు టాక్. అసలు ఈ పెళ్లి ఏంటయ్యా.. అని బాలకృష్ణ నేరుగా పవన్‌ను ప్రశ్నించాడట. దానికి పవన్ కల్యాణ్.. చాలా క్లియర్‌గా డీప్‌గా తన జీవితంలో అసలేం జరిగిందో వివరించాడని తెలుస్తోంది. లోలోపల జరిగిందంతా చెప్పేశాడట. ఎక్కడా ఏమీ దాచుకోలేదట.

ఇంత కాలం తన వ్యక్తిగత జీవితాన్ని ఎక్కడా బయట పెట్టలేని పవన్ కళ్యాణ్‌ ఇప్పుడు మాత్రం ఇలా ఈ షో ద్వారా అందరికీ చెప్పాలని అనుకున్నాడేమో. అయితే పవన్ కళ్యాణ్‌ చెప్పిందంతా విన్న బాలయ్య అదిరిపోయేలా కౌంటర్లు వేశాడట. ఇంత క్లియర్‌గా స్ట్రెయిట్ ఫార్వార్డ్‌గా చెప్పిన తర్వాత కూడా.. పర్సనల్ గా టార్గెట్ చేస్తే.. వాళ్లు ఊర కుక్కలతో సమానం ఎవరికి తగలాలో వారికి తగిలేట్టుగా కౌంటర్లు వేసినట్టు తెలుస్తోంది.

మరి ఈ షో ప్రసారం అయిన తరువాత పవన్ కళ్యాణ్‌ చెప్పిన విషయాలు బయటకు వస్తాయి. వాటిని చూసిన తరువాత అయినా కూడా ఇలాంటి కామెంట్లు తగ్గుతాయో లేదో చూడాలి. పవన్ కళ్యాణ్ పర్సనల్ విషయాలను టార్గెట్ చేయడం మానేస్తారో లేదో చూడాలి.

Also Read : Sreeja Konidela Daughter : నవిష్క బర్త్ డే.. కూతురితో దగ్గరగా, ఆనందంగా శ్రీజ.. దూరంగా కళ్యాణ్‌ దేవ్

Also Read : Kajal Aggarwal at Taiwan: తైవాన్లో ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్న కాజల్.. లిప్ కిస్సులతో రచ్చ!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News