Shani Dev: న్యూ ఇయర్ లో ఈరాశుల జీవితాన్ని శనిదేవుడు మారుస్తాడు.. ఇక వారికి డబ్బే డబ్బు..

Saturn Transit 2023: న్యాయదేవుడైన శని కొత్త సంవత్సరం ప్రారంభంలో తన రాశిని మార్చబోతుంది. దీంతో నాలుగు రాశులవారి అదృష్టం ప్రకాశించనుంది.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Dec 30, 2022, 08:38 AM IST
Shani Dev: న్యూ ఇయర్ లో ఈరాశుల జీవితాన్ని శనిదేవుడు మారుస్తాడు.. ఇక వారికి డబ్బే డబ్బు..

Shani Rashi Parivartan 2023: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, శనిదేవుడు గ్రహాలన్నింటిలోకెల్లా నెమ్మదిగా కదిలే ఫ్లానెట్. ఇది రెండున్నరేళ్లకు ఒకసారి తన రాశిని మారుస్తుంది. శని ఒక రాశిని మార్చిన తర్వాత మళ్లీ అదే రాశిని చేరుకోవడానికి 30 ఏళ్లు పడుతుంది. ప్రస్తుతం మకర రాశిలో ఉన్న శని గ్రహం.. 30 సంవత్సరాల తర్వాత జనవరి 17, 2023న తన సొంత రాశి అయిన కుంభరాశిలోకి ప్రవేశించనున్నాడు. శనిదేవుడు 2025 మార్చి 29 వరకు కుంభరాశిలోనే ఉంటాడు. కుంభంలో శనిదేవుడు సంచారం వల్ల కొన్ని రాశులవారు లాభాలను పొందుతారు. అంతేకాకుండా కొంత మంది శని సాడేసతి మరియు ధైయా నుండి విముక్తి లభిస్తుంది. 

శని గోచరం ఈ రాశులకు బంఫర్ ప్రయోజనం
మేషం (Aries): మేషరాశి వారికి శని సంచారం వల్ల చాలా సంపదలు చేకూరుతాయి. కెరీర్‌లో అపారమైన పురోగతి సాధించడంతోపాటు ఉన్నత శిఖరాలకు చేరుకుంటాడు. మీ ఆదాయం రెట్టింపు అవుతుంది. వ్యాపారంలో భారీగా లాభాలు ఉంటాయి. కొత్త ఆదాయ మార్గాలు ఏర్పడతాయి. 

వృషభం (Taurus): వృషభ రాశి వారికి శని సంచారం అదృష్టాన్నిస్తుంది.  మీరు ప్రతి పనిలో విజయం సాధిస్తారు. ఆగిపోయిన పనులు పూర్తవుతాయి. పదవి, ధనం, పలుకుబడి, ప్రేమ లభిస్తాయి. పెళ్లికాని యువతీ యువకులకు వివాహం కుదిరే అవకాశం ఉంది. 

ధనుస్సు (Sagittarius): శని రాశిలో మార్పు వల్ల ధనుస్సు రాశి వారు శని మహదశ నుండి విముక్తి లభిస్తుంది. అంతేకాకుండా మానసిక ఒత్తిడి నుండి బయటపడతారు. మీ కష్టాలన్నీ దూరమవుతాయి. వివిధ మార్గాల ద్వారా డబ్బు సమకూరుతుంది. ధనం లాభదాయకంగా ఉంటుంది. దీర్ఘకాలిక వ్యాధుల నుండి ఉపశమనం లభిస్తుంది. 

కుంభం (Aquarius): శని సంచారం తర్వాతనే కుంభరాశిలోకి ప్రవేశిస్తుంది. కుంభ రాశికి అధిపతి శని కాబట్టి, ఈ రాశి వారికి లాభాలను ఇస్తుంది. కొత్త ఉద్యోగం పొందవచ్చు. ఏదైనా పెద్ద విజయాన్ని సాధించవచ్చు. వ్యాపారంలో కూడా లాభం ఉంటుంది. 

Also Read: Shukra Gochar 2023: అరుదైన లక్ష్మీనారాయణ రాజయోగం.. ఈ 4 రాశుల వారిపై కురవనున్న డబ్బు వర్షం! 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook.

Trending News